Pawan Kalyan : కోటి కుటుంబాలకు సురక్షిత మంచినీరు అందించడమే లక్ష్యం- పవన్ కల్యాణ్
Pawan Kalyan : కనీసం రోజుకి సగటు మనిషికి 55 లీటర్ల పరిశుభ్రమైన నీరు అందిచడమే జల్ జీవన్ మిషన్ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కోటి కుటుంబాలకు సురక్షిత మంచినీరు అందించాలనే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు.
Pawan Kalyan : వైసీపీ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులను దుర్వినియోగం చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. జల్ జీవన్ మిషన్ కింద రూ.4000 కోట్లు ఖర్చుపెట్టామని గత ప్రభుత్వం చెబుతోందని, కానీ తాను ఏ జిల్లాకి వెళ్లినా నీళ్లు రావట్లేదనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. విజయవాడలో నిర్వహించిన జల్ జీవన్ మిషన్ వర్క్ షాప్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో 95.44 లక్షల కుటుంబాలకు గాను 70.04 లక్షల గృహాలకు నీటి కుళాయిలు అందించామని, ఇంకా 25.40 లక్షల నీటి కుళాయిలు ఇవ్వాల్సి ఉందని జల్ జీవన్ మిషన్ తెలియజేసిందన్నారు. అయితే దీనిపై పల్స్ సర్వే చేయిస్తే 85.22 లక్షల కుటుంబాలకు గాను కేవలం 55.37 లక్షల గృహాలకే నీటి కుళాయిలు అందించారని తెలిసిందన్నారు.
కనీసం రోజుకి సగటు మనిషికి 55 లీటర్ల పరిశుభ్రమైన నీరు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం అని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ లక్ష్యలు చేరుకునేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలన్నారు. దాదాపు కోటి కుటుంబాలకి నీటి అవసరాలు ఉన్నాయని, ఆ కోటి కుటుంబాలకు సురక్షిత మంచినీరు అందించాలనే ధ్యేయంగా ముందు వెళుతున్నామన్నారు. మనసు పెట్టి ఇది సాధించేలా అందరి సహకారం కావాలన్నారు. ప్రజలకు మంచి తాగు నీరు అందించడం కనీస బాధ్యత అన్నారు.
"ఆదిలాబాద్ లో మూడు నాలుగు తాండాలకి కలిపి ఒకే బోర్ పాయింట్. అక్కడ కళ్లు కూడా సరిగ్గా కనపడని ఒక పెద్దావిడ వచ్చి నీళ్లు ఇప్పించమని అడిగింది. అంటే నీరు ఎంత కీలకమో అర్థం చేసుకోండి. భీష్మ ఏకాదశి రోజున 24 గంటల పాటు నీరు తాగకపోతే ఎలా ఉంటదో ఆ వ్రతాలు పాటించేవారికి, నీరు దొరకని వారికి తెలుస్తుంది"- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
సంబంధిత కథనం