Money Problems: సంతోషంగా ఉండాలంటే ఈ పొరపాట్లు చేయకండి.. డబ్బు మంచి నీరులా ఖర్చు అయ్యి, అప్పుల ఊబిలో కూరుకుపోవచ్చు
Money Problems: మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి తప్పులు చేయకుండా చూసుకోండి. లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవ్వాల్సి ఉంటుంది. ఈ అలవాట్లు ఆర్థిక ఇబ్బందుల్ని కలిగించొచ్చు
చాలా మంది ఆర్థిక సమస్యల వలన ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు నుంచి బయటపడటం చాలా కష్టం. ఒకసారి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతే, దాని నుంచి తేలడం ఎంతో కష్టంతో కూడుకున్నది. అయితే, మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి తప్పులు చేయకుండా చూసుకోండి. లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవ్వాల్సి ఉంటుంది.
ఈ అలవాట్లు ఆర్థిక ఇబ్బందుల్ని కలిగించొచ్చు
మనం చేసే పొరపాట్ల వలన కొన్ని సమస్యలు వస్తాయి. తెలిసి చేసినా తెలియక చేసినా సమస్యలు వస్తాయి. ఒకవేళ మీరు కూడా ఈ తప్పులు చేస్తుంటే ఇక నుంచి మానుకోండి.
కుళాయిల నుంచి నీళ్లు కారిపోవడం
చాలామంది కుళాయిల్ని ఎప్పటికప్పుడు క్లోజ్ చేయరు. అయితే కుళాయి కట్టకపోవడం వలన నీరు కారిపోతూ ఉంటుంది. అలా నీరు వృధాగా పోతే డబ్బులు కూడా అదే విధంగా ఖర్చు అయిపోతాయి. ఒక్కోసారి ఏదైనా రిపేర్ అయ్యి నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా వెంటనే లీక్ అవ్వకుండా రిపేర్ చేయించుకోవడం మంచిది.
ఇల్లు శుభ్రంగా లేకపోవడం
చాలా మంది సర్దుకుందాంలే అని వదిలేస్తూ ఉంటారు. ఇల్లు అలా చిరాకుగా తయారవుతుంది. ఇలాంటి ఇంట్లో కూడా డబ్బులు ఉండవు. ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు చెత్తాచెదారాన్ని తొలగించి, ఇంటిని ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి. లేదంటే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాలి.
చనిపోయిన వారి కోసం
పితృపక్షం సమయంలో చనిపోయిన పూర్వికులను తలుచుకుని కార్యక్రమాలను చేయాలి. అలాగే వారు చనిపోయిన రోజు కూడా స్వార్థం పెట్టడం వంటివి చేయాలి. అప్పుడే సంతోషంగా ఉండొచ్చు. లేదంటే ఆర్థిక ఇబ్బందులు రావచ్చు.
నైరుతి వైపు
నైరుతి ధనాన్ని అందిస్తుంది. స్టెబిలిటీని పెంచుతుంది. నైరుతి వైపు శుభ్రంగా లేకపోవడం చెత్తాచెదారతో నిండి ఉండడం వంటి తప్పులు చేయకండి. ఇలాంటి తప్పులు చేస్తే కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంటి నైరుతి వైపు ఫోటోలు లేదా దేవుడు ఫోటోలు వంటి వాటిని పెట్టండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి. శుభ్రంగా ఉంచండి. నైరుతి వైపు మనీ ప్లాంట్ పెంచితే కూడా మంచిది.
విరిగిపోయిన కుబేరుడి విగ్రహం
కుబేరుడు సంపదకు అధిపతి. శ్రేయస్సుకు చిహ్నం. ఇంట్లో కుబేరుని విగహం ఉండడం మంచిదే. కానీ, విరిగిపోయిన కుబేరుడు విగ్రహం ఉండకూడదు. అలా ఉంటే ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా రావొచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.