Money Remedies: ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలా? ఈ పరిహారాలను పాటిస్తే మీ సమస్యలన్నీ తీరిపోవచ్చు
Money Remedies: వాస్తు ప్రకారం నడుచుకుంటే, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు. అలాగే వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఇంట్లో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి.
చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలని పాటించడం మంచిది. ఈ పరిహారాలని కనుక పాటించినట్లయితే ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండొచ్చు. చాలా మంది ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండడానికి వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు. అలాగే వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఇంట్లో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి.
ఇలా ఆర్థిక సమస్యలు లేకుండా ఉండొచ్చు:
ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి
ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఇంట్లో చెత్తాచెదారం, పనికిరాని సామాన్లు, విరిగిపోయిన వస్తువులు వంటివి ఉండకూడదు. ఆగ్నేయం వైపు అస్సలు చెత్తాచెదరం లేకుండా చూసుకోవాలి. ఆగ్నేయం వైపు చెత్తాచెదరం ఉన్నట్లయితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తుపెట్టుకోండి.
మనీ ప్లాంట్
ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే ఒక మనీ ప్లాంట్ ని పెట్టుకోండి. మనీ ప్లాంట్ వలన కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులువుగా బయటపడొచ్చు. సంతోషంగా ఉండొచ్చు. ముఖ్యంగా ఆగ్నేయం వైపు మనీ ప్లాంట్ ని ఉంచడం వలన సానుకూల శక్తి కలిగి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సంతోషంగా ఉండొచ్చు. ఆర్థిక బాధల నుంచి కూడా సులువుగా బయటపడవచ్చు.
ఇంటి ముఖద్వారం దగ్గర ఈ మార్పు చేయండి
ఇంటి ముఖ ద్వారం దగ్గర లాఫింగ్ బుద్దా పెడితే కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సంతోషంగా ఉండొచ్చు. కనుక ఒక లాఫింగ్ బుద్ధా ని ఇంట్లో ముఖద్వారం వద్ద ఉంచండి.
దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది
పేద వాళ్ళకి బట్టలు, ఆహారం, డబ్బులు వంటివి దానం చేస్తే కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా గురువారం నాడు కానీ పౌర్ణమి నాడు కానీ పేదలకు దానం చేయడం మంచిది.
ఇలా చేస్తే కూడా ఆర్థిక సమస్యలు ఉండవు
సూర్యునికి నీళ్లు సమర్పిస్తే కూడా ఆర్థిక బాధల నుంచి బయటపడి సంతోషంగా ఉండొచ్చు. ఆర్థిక బాధలతో సతమతమవుతున్న వాళ్ళు ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అన్ని 108 సార్లు జపిస్తే కూడా చక్కటి ఫలితం ఉంటుంది. 'ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్య పతయే ధన ధాన్య సమృద్ధి దపాయ స్వాహా' అని 108 సార్లు శుక్రవారం నాడు చదివితే మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం