Vijay Fly To Goa: కీర్తి సురేశ్ పెళ్లికి హీరోయిన్‌తో కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో హీరో విజయ్.. పాత రూమర్ మళ్లీ తెరపైకి
Vijay And Trisha Fly To Goa: హీరో విజయ్, కీర్తి సురేశ్ రెండు సినిమాల్లో జంటగా నటించారు. దాంతో కీర్తి పెళ్లికి స్పెషల్ ఫ్లైట్‌లో గోవాకి విజయ్ వెళ్లారు. అతని వెంట హీరోయిన్ త్రిష కూడా వెళ్లడంతో..?
హీరోయిన్ కీర్తి సురేశ్ వివాహానికి నటుడు విజయ్, త్రిష జంట హాజరవడం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. డిసెంబర్ 12న గోవాలో కీర్తి సురేశ్ తన స్నేహితుడు ఆంటోనీ తాటిల్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హిందూ సంప్రదాయం ప్రకారం అట్టహాసంగా ఈ పెళ్లి జరగగా.. ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
విజయ్, కీర్తి రెండు సినిమాల్లో
పరిమిత సంఖ్యలో బంధువులు, అతిథుల సమక్షంలో ఈ పెళ్లి జరగగా.. ఈ వివాహానికి తమిళ్ హీరో విజయ్.. సీనియర్ హీరోయిన్‌తో త్రిషతో కలిసి హాజరయ్యారు. విజయ్‌తో కలిసి సర్కార్, పైరా మూవీల్లో కీర్తి సురేశ్ నటించింది. ఆ సాన్నిహిత్యంతో పెళ్లికి విజయ్ హాజరైనట్లు తెలుస్తోంది.
చెన్నై నుంచి ప్రైవేట్ ఫ్లైట్‌లో విజయ్, త్రిష గోవా వెళ్లారు. ఇలా ఇద్దరూ కలిసి ప్రైవేట్ ఫ్లైట్‌లో వెళ్లడం ఇది రెండోసారి. ఇటీవల ఓ కార్యక్రమానికి త్రిషతో కలిసి విజయ్ ప్రైవేట్ ఫ్లైట్‌లో వెళ్లిన విషయం తెలిసిందే. దాంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విజయ్, త్రిషపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విజయ్‌పై సెటైర్లు
వరద ప్రభావిత ప్రాంతాలకు త్వరితగతిన వెళ్లి ఏరోజూ సాయం చేయని విజయ్.. నటి త్రిషతో కలిసి ప్రైవేట్ ఫ్లైట్‌లో గోవాకు వెళ్లారని ఒకరు విమర్శలు గుప్పించగా.. విజయ్ సతీమణి సంగీతకు న్యాయం చేయాలటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. విజయ్ తన భార్య, పిల్లల కోసం.. లేదా ప్రజల కోసం ఏరోజూ స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లలేదని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
విజయ్, త్రిష డేటింగ్?
వాస్తవానికి త్రిష, విజయ్ డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. త్రిషని పెళ్లి చేసుకునేందుకు విజయ్ తన భార్యకి విడాకులు ఇచ్చేందుకు సిద్ధపడినట్లు కూడా వార్తలు వచ్చాయి. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన లియో సినిమాలో విజయ్, త్రిష ఆఖరిగా జంటగా నటించారు.
రాజకీయాల్లోకి విజయ్
ఈ ఏడాది ప్రారంభంలో ‘తమిళనాడు వెట్రి కళగం’ అనే పార్టీని స్థాపించిన విజయ్.. ఎన్నికల సంఘంలో ఆ పేరుని రిజిస్టర్ చేయించారు. మార్చి 8 నుంచి పార్టీ సభ్యత్వం కూడా జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మందికి సభ్యత్వం ఇవ్వాలనే లక్ష్యంతో ‘తమిళగ వెట్రి కళగం’ అనే యాప్‌ను కూడా విజయ్ ప్రారంభించారు. ఈ యాప్ ఆరంభమైన 3 రోజుల్లోనే 50 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. ఇటీవల తమిళనాడు వెట్రి కళగం తొలి మహాసభ కూడా జరిగింది. అందులో ప్రాజెక్టుల గురించి విజయ్ చేసిన ప్రసంగం వైరల్‌గా మారింది. రాబోవు ఎన్నికల్లో డీఎంకేను ఓడించాలని విజయ్ పిలుపునిచ్చారు.