Thursday Remedies: మీ కోరికేదైనా సరే గురువారం రోజు ఈ పరిహారాలు చేస్తే తీరిపోతుంది!!-thursday remedies to attract prosperity and wealth grace of lord vishnu everything possible ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Thursday Remedies: మీ కోరికేదైనా సరే గురువారం రోజు ఈ పరిహారాలు చేస్తే తీరిపోతుంది!!

Thursday Remedies: మీ కోరికేదైనా సరే గురువారం రోజు ఈ పరిహారాలు చేస్తే తీరిపోతుంది!!

Ramya Sri Marka HT Telugu
Dec 05, 2024 08:35 AM IST

Thursday Remedies: విష్ణు భగవానుని, గురు గ్రహానికి ఆరాధన చేయడానికి గురువారం అనుకూలమైన రోజు. సంపదను ఆకర్షించ డానికి, కెరీర్ అభివృద్ధిని మెరుగుపరచడానికి, గురు దోషాన్ని పరిష్కరించడానికి ఈ పరిహారాలు పాటించండి.

<p>మహావిష్ణువు అనుగ్రహం వల్ల జీవితంలో సుఖసంతోషాలు ఉంటాయి. గురువారం మహావిష్ణువు ఆరాధనకు ముఖ్యమైనదిగా భావిస్తారు.</p>
మహావిష్ణువు అనుగ్రహం వల్ల జీవితంలో సుఖసంతోషాలు ఉంటాయి. గురువారం మహావిష్ణువు ఆరాధనకు ముఖ్యమైనదిగా భావిస్తారు.

విష్ణు భగవానున్ని, దేవగురువైన బృహస్మతిని ఆరాధించడానికి ప్రత్యేక రోజుగా గురువారాన్ని భావిస్తారు. ఈ రోజున ఉపవాసాలు చేసుకోవడం, వైదిక ఆచారాలను పాటిస్తూ వ్రతమాచరించడం వల్ల జీవిత సమస్యలను తగ్గించి, భారీ సంపద, అభివృద్ధిని అందించగలదని విశ్వసిస్తారు. జ్యోతిష్య శాస్త్రాన్ని బట్టి గురువారం ప్రత్యేకమైన పరిహారాలు సూచించారు. ఇవి కష్టాలను ఎదుర్కొనడానికి, జీవితంలోకి సానుకూలతను ఆకర్షించడానికి సహాయపడతాయి.

కెరీర్ అభివృద్ధి, పెళ్లి, సంసారిక జీవితంలో ఆర్థిక సమస్యలను అధిగమించడానికి, ఈ పరిహారాలు వివిధ అంశాలకు ఆధ్యాత్మిక మార్గదర్శకాన్ని అందిస్తాయి. ఈ పరిహారాలు ఎలా చేయాలో, జీవితంలో సమస్యలను పరిష్కరించి సంపద ఎలా వచ్చిపడుతుందో తెలుసుకుందాం.

వ్యవసాయ విజయానికి:

మీరు మీ వ్యాపారాన్ని మెరుగుపరచాలని కోరుకుంటే, ఈ పద్దతి పాటించండి. ఉదయం స్నానం ఆచరించండి. పసుపు రంగు దుస్తులు ధరించండి. మీ నుదుటికి పసుపు తిలకం దిద్దుకోండి. ఈ పరిహారాలు వ్యాపార లాభాలు, అభివృద్ధిని పెంచుతాయని భక్తుల నమ్మిక.

ఇంట్లో ఆర్థిక సమస్యలుంటే:

గురువారం ఆనందం, సంపదను ఆహ్వానించడానికి సరైన రోజు. ఉదయం పరిశుభ్రంగా స్నానం చేయండి. విష్ణు భగవానుడ్ని, లక్ష్మీ దేవిని పూజించండి. ప్ర‌సాదంగా అరటిపండ్లతో పాటు ఉడికించిన శనగపప్పు, బెల్లంతో చేసిన వంటకాన్ని సమర్పించండి. ఆ తర్వాత విష్ణు సహస్రనామాన్ని జపించండి. ఈ పరిహారం చేయడం వల్ల ఇంటికి శాంతి సమకూరి, సంపదను తీసుకొస్తుందని నమ్ముతారు.

ఉద్యోగ పదోన్నతికి:

మీరు పదోన్నతిని సాధించేందుకు ప్రయత్నిస్తున్నా, ఫలితం రాకపోతే, ఈ పరిహారం చేయండి. గురువారం రోజున పసుపు రంగు వస్తువులను ఎక్కువగా వాడండి. ప్రార్థన సమయంలో విష్ణు దేవునికి పసుపు ఫలాలు, పుష్పాలను అర్పించండి. ఒక పసుపు వస్త్రంలో కొబ్బరికాయ, పసుపు ఫలాలు, పసుపు, ఉప్పులను ముడుపుగా కట్టి పూజా మందిరంలో ఉంచండి. ఈ పరిహారం కెరీర్ చేతికి చిక్కకుండాపోయిన అవకాశాలను పెంచడానికి, సమయానికి పదోన్నతిని అందించడానికి సహాయపడుతుంది.

పెళ్లి కోసం:

త్వరలో పెళ్లి కానున్న వారు ఈ పరిహారం చేయండి. స్నానం చేసిన తర్వాత, ప్రతి గురువారం పసుపు రంగు దుస్తులు ధరించండి. ఇంట్లోని పూజా మందిరంలో విష్ణు భగవానుడు, లక్ష్మీ దేవిని పూజించండి సమీపంలో ఉన్న ఆలయానికి వెళ్లి, దుర్గాదేవికి సిందూరాన్ని సమర్పించండి. అదే సిందూరంతో మీరూ తిలకం దిద్దుకోండి. ఈ చర్యలు పెళ్లి పనులు వేగవంతంగా జరగడానికి సహాయపడతాయని నమ్ముతారు.

గురు దోషాన్ని అధిగమించడానికి: మీ జాతకంలో గురు బలహీనంగా ఉన్నప్పుడు లేదా గురు దోషం కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు, ఈ పరిహారం చేయండి.

  • గురువారం రోజున స్నానపు నీటిలో పసుపు కొద్దిగా వేసుకోండి.
  • స్నానం చేస్తున్నప్పుడు “ఓమ్ నమో భగవతే వాసుదేవాయ” మంత్రాన్ని జపించండి.

ఈ పరిహారం గురు గ్రహాన్ని బలహీనంగా చేసి, దాని ప్రతికూల ప్రభావాలను తగ్గించగలదు.

సంప్రదాయ నమ్మకాలను గౌరవిస్తూ ఈ పరిహారాలు నిష్టతో పాటిస్తే శుభఫలితాలుంటాయి. ఇవి ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలతో అనుసంధానమైనప్పటికీ, మీరు కోరుకునే ఫలితాలను సాధించేందుకు అనుకూలిస్తాయి. వీటితో పాటుగా వ్యక్తిగత, వృత్తి జీవితంలో మనం కూడా ప్రయత్నాలు చేస్తుండాలి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner