Krishna DMHO Jobs : కృష్ణా జిల్లా మచిలీపట్నం.... జిల్లా ఆసుపత్రిలోని పాలియేటివ్ సెంటర్ లో కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రొఫార్మాను https://krishna.ap.gov.in/ పోర్టల్‌లో 11.12.2024 నుంచి 17.12.2024 వరకు సాయంత్రం 05:00 గంటల వరకు (పని రోజులు మాత్రమే) అందుబాటులో ఉంటుంది.
ఆఫ్ లైన్ లో దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 17.12.2024న సాయంత్రం 05:00 గంటలు అని నోటిఫికేషన్ పైలో తెలిపారు. అభ్యర్థులు అప్లికేషన్ ను కృష్ణ జిల్లాలో డీఎమ్.హెచ్ఓ కార్యాలయంలోని కౌంటర్లలో సమర్పించాలి. దరఖాస్తు సమర్పించిన తర్వాత రుజువుగా, దరఖాస్తు స్వీకరించే అధికారి నుంచి రసీదును పొందాల్సి ఉంటుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలలో ఖాళీలను భర్తీ చేసినట్లుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మొత్తం 9 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వార భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారు ఒక ఏడాది పాటు విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
పిజీషియన్ కు నెలకు రూ.1,10,000, మెడికల్ ఆఫీసర్ కు వైద్యులకు రూ.61,960 జీతంగా చెల్లిస్తారు. ఎండీ జనరల్ మెడిసిన్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎంబీబీఎస్ లేదా తత్సమాన డిగ్రీ అర్హతలు.
వేతనం నెలకు రూ.27,675, ఏపీపీఎంబీ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుంచి జీఎన్ఎమ్/బీఎస్సీ నర్సింగ్‌లో డిప్లొమా, ఏపీఎంఎంబీలో రిజిస్టర్ అయి ఉండాలి.
ఈ పోస్టులకు దరఖాస్తులను 17.12.2024న లేదా అంతకు ముందు అన్ని పని దినాలలో సాయంత్రం 5.00 గంటలలోపు మచిలీపట్నంలోని పరాసుపేటలోని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో సమర్పించాలి.
దరఖాస్తుదారుడు ప్రాసెసింగ్ రుసుమును డిమాండ్ డ్రాఫ్ట్‌ను “జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి, కృష్ణ జిల్లా” పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. ఈ డీడీని అప్లికేషన్ కు జతపరచాలి.
దరఖాస్తు ఫారమ్, ఇతర వివరాలను https://krishna.ap.gov.in లో పొందవచ్చు.
సంబంధిత కథనం