Allu Arjun Lawyer: హైకోర్టులో లాజిక్‌తో కొట్టిన అల్లు అర్జున్ లాయర్.. పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సీన్ రిపీట్!
Allu Arjun Lawyer At High Court Video Viral: హైకోర్టులో అల్లు అర్జున్‌కు బెయిల్ వచ్చేలా వాదనలు వినిపించిన లాయర్ నిరంజన్ రెడ్డి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ లాయర్ నిరంజన్ రెడ్డి లాజిక్‌తో కొట్టాడని, వకీల్ సాబ్ సీన్ రిపీట్ అయిందని మీమ్స్ వేస్తున్నారు నెటిజన్స్.
Allu Arjun Lawyer At High Court Video Viral: అల్లు అర్జున్ అరెస్ట్ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పుష్ప 2 బెన్‌ఫిట్ షో వేసిన రోజున (డిసెంబర్ 4) సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పరోక్ష బాధ్యుడిగా అల్లు అర్జున్‌ను శుక్రవారం (డిసెంబర్ 13) పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
అల్లు అర్జున్ లాయర్ వీడియో వైరల్
అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్‌ను నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వగా.. బన్నీ మధ్యంతర బెయిల్ కోసం హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టులో అల్లు అర్జున్ తరఫున లాయర్ నిరంజన్ రెడ్డి వాదించి బెయిల్ వచ్చేలా చేశారు. ఉన్నత న్యాయస్థానంలో అల్లు అర్జున్ వైపు గట్టి వాదనలు వినిపించిన నిరంజన్ రెడ్డి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
అల్లు అర్జున్‌ను చూసేందుకు
పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాలోని సూపర్ వుమెన్ అనే సీన్‌ను రిపీట్ అయిందని నెటిజన్స్ ఆ వీడియోకు కామెంట్స్ పెడుతున్నారు. ఆ వీడియోలో "రిమాండ్ రిపోర్ట్‌లో చెప్పినట్లు థియేటర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో జరిగిన తొక్కిసలాటలో బాధిత మహిళ, చిన్నారి ఏడుపు వినిపించింది. దీంతో వెంటనే మొదటి అంతస్థులో ఉన్న పోలీసులు గ్రౌండ్ ఫ్లోర్‌కు వచ్చారు. అంటే, దీనర్థం ఏంటీ.. గ్రౌండ్ ఫ్లోర్‌లో తొక్కిసలాట జరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడ లేరు. వారు కూడా అల్లు అర్జున్‌ను చూసేందుకు మొదటి అంతస్థుకు వెళ్లారు" అని నిరంజన్ రెడ్డి చెప్పారు.
వకీల్ సాబ్ సీన్ రిపీట్
దాంతో అక్కడున్న వాళ్లంత నవ్వేశారు. లాయర్ నిరంజన్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక క్రికెట్ మ్యాచ్‌లో ప్రేక్షకులతోపాటు పోలీసులు కూడా క్రికెట్ చూస్తుంటారు. కానీ, అబ్రాడ్‌లో మాత్రం గుంపును పోలీసులు చూస్తారు" అని అన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో వకీల్ సాబ్ సీన్ రిపీట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
ఏం లాజిక్ అయ్యా
అంతేకాకుండా "ఏం లాజిక్‌తో కొట్టావయ్యా" అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, హైకోర్టు వాదనల అనంతరం అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ వచ్చింది. దాంతో చంచల్‌గూడా జైలు నుంచి ఉదయం మొదటగా గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కు, తర్వాత స్నేహారెడ్డి పుట్టింటికి చేరుకున్నాడు అల్లు అర్జున్.
లాయరే కాదు నిర్మాత కూడా
కాగా అల్లు అర్జున్ తరఫున వాదించిన న్యాయవాది నిరంజన్ రెడ్డి పలు సినిమాలకు నిర్మాతగ వ్యవహరించడం విశేషం. ఆచార్య, క్షణం, ఘాజీ, వైల్డ్ డాగ్ సినిమాలను నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇక అల్లు అర్జున్ తరఫున వాదించినందుకు లాయర్ నిరంజన్ రెడ్డి గంటకు సుమారుగా రూ. 5 లక్షల ఫీజు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పరామర్శించిన హీరోలు
మరోవైపు అల్లు అర్జున్‌ను పరామర్శించేందుకు పలువురు సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీలు బన్నీ ఇంటికి వెళ్లారు. వారిలో దగ్గుబాటి రానా, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, డైరెక్టర్ వంశీ పైడిపల్లి, దిల్ రాజు, కొరటాల శివ, హరీష్ శంకర్‌తోపాటు పలువురు ఉన్నారు.
టాపిక్