దేవుడి దగ్గర దీపం పెట్టాలంటే ప్రతి రోజూ ఇల్లు తుడవాల్సిందేనా..? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి.-do you have to clean the house every day to light a lamp with god every day what do the sciences say ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  దేవుడి దగ్గర దీపం పెట్టాలంటే ప్రతి రోజూ ఇల్లు తుడవాల్సిందేనా..? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి.

దేవుడి దగ్గర దీపం పెట్టాలంటే ప్రతి రోజూ ఇల్లు తుడవాల్సిందేనా..? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి.

Ramya Sri Marka HT Telugu
Dec 14, 2024 06:35 AM IST

ప్రతి రోజూ దేవుడి దగ్గర దీపం పెట్టడం హిందువుల్లో చాలా మందికి అలవాటు. అయితే దీపం పెట్టే సమయంలో ఇల్లు శుభ్రంగా ఉంచాలనే నియమం కూడా ఉంది. అంటే ప్రతి రోజూ దీపం పెట్టేవారు ప్రతి రోజూ ఇంటిని తప్పనిసరిగా తుడవాల్సిందేనా.. శాస్త్రాలు ఏం చెబుతున్నాయి.?

దేవుడి దగ్గర దీపం పెట్టాలంటే ప్రతి రోజూ ఇల్లు తుడవాల్సిందేనా..?
దేవుడి దగ్గర దీపం పెట్టాలంటే ప్రతి రోజూ ఇల్లు తుడవాల్సిందేనా..? (Shutterstock)

దేవుడి దగ్గర దీపం పెట్టడం అనేది అత్యంత పవిత్రమైన కార్యం. శుద్ధి, కోసం శుభం కోసం నిత్యా దీపారాధన చేసే అలవాటు హిందువుల్లో చాలా మందికి ఉంది. అయితే చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే ప్రతి రోజూ దేవుడి దగ్గర దీపం వెలిగించాలంటే ప్రతి రోజూ ఇళ్లంతా తుడవడం లేదా కడగటం చేయాలా? అని దీనికి శాస్త్రోక్తంగా కొన్ని సమాధానాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శాస్త్రాలు, ఆచారాల ప్రకారం మన ఒల్లు, ఇల్లు శుభ్రంగా ఉండడం చాలా ముఖ్యం. ప్రత్యేకంగా పూజ సమయంలో లేదా దీపారాధన సమయంలో శుభ్రత, శుద్ది చాలా అవసరం. దీని ద్వారా మనం దేవుని కృపను సులభంగా పొందవచ్చు. ఇంట్లోకి శుభం, శాంతి, ఐశ్వర్యాలను ఆహ్వానించవచ్చు. అయితే అప్పుడప్పుడూ పూజ, దీపారాధన చేసే వారికి శుభ్రత విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ప్రతి రోజూ దేవుడిని పూజించే వారికీ, దీపారాధన చేసేవారికి మాత్రం శుభ్రత అనేది చాలా పెద్ద విషయమే. ప్రస్తుత జీవిన విధానంలో ప్రతి రోజూ ఇంటిని తుడవడం అనేది సాధ్యం కాని పని అలాంటప్పుడు దీపారాధన చేయడం మానుకోవాలా అనే సందేహం చాలా మందిలో ఉంది. ఇందుకు సమాధానం ఇక్కడ దొరుకుతుందేమో చూడండి.

ఇంటినంతా తప్పనిసరిగా తుడవాలా..?

హిందూ ఆచారాల ప్రకారం దేవుడి దగ్గర దీపం పెట్టేటప్పుడు మన చుట్టూ శుభ్రత ఉండటం అవసరం.ఇల్లు పవిత్రంగా ఉండాలి. దీపం పెట్టేటప్పుడు దేవుడు మన మనస్సులో, మన ఇల్లులో శాంతిని, ఆధ్యాత్మిక ప్రకాశాన్ని పంపించడానికి సిద్ధపడతారు. ఇల్లు శుభ్రంగా ఉండటం మనం పవిత్రంగా ఉంటామని సూచిస్తుంది. మన పూజ స్థలాన్ని శుభ్రం చేయడం వల్ల దైవ శక్తులు మన ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. అలా అని ప్రతి రోజు ఇంటిని తుడవాల్సిన అవసరం లేదు. ఇంట్లో చెత్త, దుమ్ము ధూళి వంటివి లేకుండా ఊడిస్తే సరిపోతుంది.

పూజా స్థలం ఎలా ఉండాలి?

దేవుడి దగ్గర దీపం వెలిగించే సమయంలో పూజా స్థలం శుభ్రంగా ఉండటం తప్పనిసరి. ఇళ్లంతా తుడుచుకునే వీలు లేనప్పుడు పూజ స్థలాన్ని తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఈ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచడం ద్వారా మనం దేవుని దృష్టిలో స్వచ్చత, పవిత్రతను కలిగి ఉంటాము. వాస్తు శాస్తం ప్రకారం దేవుడికి పూజ చేసే స్థలాన్ని శుభ్రంగా ఉంచడం అనేది శుభ ఫలితాలను ఇస్తుంది.ఇది దైవ కృప, ఐశ్వర్యం పొందడానికి కీలకమైన చర్య.

ఉదయం లేదా సాయంత్రం పూజ సమయంలో..

సూర్యోదయం లేదా సూర్యాస్తమయ సమయంలో పూజ చేయడం చాలా శుభకరమని శాస్త్రాలు చెబుతున్నాయి.ఈ సమయాల్లో ఇల్లు శుభ్రంగా ఉండటం ముఖ్యం.అలాగే ఈ సమయంలో ఇంట్లో ఎలాంటి గందరగోళం, గొడవలు వంటివి ఉండకూడదు. ఉదయాన్నే ఇంటిని తుడవడం వల్ల కొత్త రోజును శుభంగా ప్రారంభించినట్లు అవుతుంది. అలాగే సాయంత్రం ఇల్లు శుభ్రంగా ఉండటం వల్ల ఇంట్లో సానుకూల శక్తుల ప్రవాహం పెరుగుతుంది. దైవానుగ్రహం మనపై ఉంటుంది.

శుభ్రత ఐశ్వర్యానికి మూలం:

శాస్త్రాలు చెబుతున్నట్లుగా శుభ్రత అనేది మనకు శాంతి, ఐశ్వర్యం, ధార్మిక పురోగతిని ఇచ్చే మూలాధారం. శుభ్రమైన వాతావరణం ఒక సానుకూల ప్రభావాన్ని కలిగిస్తుంది. నిత్య ఆరోగ్యం, ధన, సమృద్, శాంతిని చేకూరుస్తుంది. ఇల్లు శుభ్రంగా ఉంటే, మనలో సానుకూలమైన ఆలోచనలు, శాంతి, ఆనందం పెరుగుతాయి. శుభ్రమైన పూజ స్థలాలు పవిత్రమైన శక్తులను ఆకర్షిస్తాయి. ఐశ్వర్య సిద్ధిని ప్రాప్తిస్తాయి.

దీపం, పవిత్రతల అనుబంధం..

దీపం అనేది జ్ఞానం, పవిత్రతకి సూచన. దీపం వెలిగించడం ద్వారా జీవితంలో అంధకారాన్ని తొలగించి, శుభాల ప్రవాహాన్ని మన ఇంట్లోకి ఆహ్వానిస్తాము. దీపం పెట్టడం ద్వారా మనం మన ఆత్మీయమైన మార్గాన్ని వెలిగించి, శక్తిని, దైవ అనుగ్రహాన్ని పొందుతాము. దీపం పెట్టే సమయంలో ఇల్లు ముఖ్యంగా పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచడం పవిత్రతను పెంచి ఆధ్యాత్మిక శక్తుల దృష్టిలో మరింత శుభకరంగా నిలుస్తుంది. ప్రతి రోజూ ఇంటిని శుభ్రం చేసుకోవాలని కచ్చితంగా ఏ శాస్త్రం చెప్పడం లేదు.వీలు కలిగిన రోజుల్లో, పండగలు, ప్రత్యేక రోజుల్లో ఇంటిని శుభ్రంగా తుడుచుకుంటే చాలు. ప్రతి రోజూ దీపం పెట్టేవారు ప్రతి రోజు ఇంటిని తుడవాల్సిందే అనే నియమం ఎక్కడా లేదు. వీలును బట్టి కేవలం పూజ గదిని శుభ్రం చేసుకుంటే చాలు. శరీరం శుద్ధిగా ఉండి, మనస్సు దేవుడిపై లగ్నం చేయగలిగితే దేవుడి ఆశీర్వాదాలను అంది శుభఫలితాలు కలుగుతాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner