TG Residential Schools : సంక్షేమ హాస్టళ్లపై సర్కార్ ఫోకస్..! రంగంలోకి సీఎం రేవంత్, ఆకస్మిక తనిఖీలు-cm revanth reddy and ministers to visit residential schools today ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Residential Schools : సంక్షేమ హాస్టళ్లపై సర్కార్ ఫోకస్..! రంగంలోకి సీఎం రేవంత్, ఆకస్మిక తనిఖీలు

TG Residential Schools : సంక్షేమ హాస్టళ్లపై సర్కార్ ఫోకస్..! రంగంలోకి సీఎం రేవంత్, ఆకస్మిక తనిఖీలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 14, 2024 06:15 AM IST

సంక్షేమ వసతిగృహాల పరిస్థితులను చక్కదిద్దేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు నేడు వసతి గృహాలను సందర్శించనున్నారు. అక్కడ ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకోనున్నారు.

నేడు వసతిగృహాలను పరిశీలించనున్న సీఎం రేవంత్, మంత్రులు
నేడు వసతిగృహాలను పరిశీలించనున్న సీఎం రేవంత్, మంత్రులు

రాష్ట్రంలోని సంక్షేమ వసతిగృహాల పరిస్థితులను స్వయంగా అంచనా వేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వసతిగృహాలను సందర్శించనున్నారు. వీరే కాకుండా… రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొనున్నారు. అక్కడే విద్యార్ధులతో కలసి భోజనం చేసి పరిస్థితులను అంచనా వేయనున్నారు.

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల వసతిగృహాల్లో దాదాపు 8 లక్షల మంది విద్యార్థులకు డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్ చార్జీలు 200 శాతం పెంచుతూ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు రాష్ట్రంలోని పాఠశాలలో 667.25 కోట్లతో మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పించింది. వసతిగృహాల పనితీరును నిరంతరం పర్యేవేక్షించేందుకు ఆకునూరి మురళి అధ్యక్షతన స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది.

రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీకృత వసతిగృహాల నిర్మాణానికి కూడా సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటి వసతిగృహాల్లో మరింత ప్రామాణికమైన ఆహారాన్ని అందించడంతోపాటు మెరుగైన విద్య బోధనా అవకాశాలను పెంపొందించాలని సర్కార్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రాష్ట్రంలోని అన్ని గురుకుల సంక్షేమ వసతిగృహాల్లో పర్యటించి పరిస్థితులను స్వయంగా సమీక్షించనుంది.

ముఖ్యమంత్రి, మంత్రుల, పర్యటన వివరాలు :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాలలోని ఏదో ఒక వసతిగృహంలో ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలోని MJPBCWR JC (బాలికలు) మధిర పాఠశాల, బోనకల్‌లో తనిఖీలు నిర్వహిస్తారు.

మంత్రులు దామోదర రాజనరసింహ భూపాలపల్లి జిల్లాలోని MJPBCWR JC (బాలికలు), మైలారం గ్రామం, ఘన్‌పూర్‌లలో పర్యటిస్తారు. శ్రీధర్ బాబు భూపాలపల్లి జిల్లాలోని MJPBCWR JC (బాలికలు), మైలారం గ్రామం, ఘన్‌పూర్ ను సందర్శించనుండగా… పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని TGTWR JC (బాలికలు), మాదిరిపురం, తిరుమలాయపాలెంను సందర్శిస్తారు. పొన్నం ప్రభాకర్ TGSWR JC (బాలుర) షేక్‌పేట, హైదరాబాద్, కొండా సురేఖ TGSWR JC (బాలురు), హతునూర, సంగారెడ్డి, సీతక్క… ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలికలు) నేరడిగొండ, (ఆదిలాబాద్ )లో పర్యటిస్తారు.

 

Whats_app_banner

సంబంధిత కథనం