తెలుగు న్యూస్ / ఫోటో /
ఈ రాశుల వారికి త్వరలో అదృష్ట కాలం.. సంతోషం, విజయాలు, ధనయోగం!
- శుక్రుడు త్వరలో ధనిష్ఠ నక్షత్రంలో అడుగుపెట్టనున్నాడు. దీంతో కొన్ని రాశులకు అదృష్టం ఉండనుంది. లాభాలు దక్కే ఛాన్స్ ఉంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
- శుక్రుడు త్వరలో ధనిష్ఠ నక్షత్రంలో అడుగుపెట్టనున్నాడు. దీంతో కొన్ని రాశులకు అదృష్టం ఉండనుంది. లాభాలు దక్కే ఛాన్స్ ఉంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
(1 / 5)
శుక్రుడు త్వరలోనే నక్షత్రం మారనున్నాడు. ప్రస్తుతం శ్రవణ నక్షత్రంలో ఉన్న శుక్రుడు త్వరలో వేరే నక్షత్రంలో అడుగుపెట్టనున్నాడు. శుక్రుడి ఈ సంచారం కొన్ని రాశుల వారికి కలిసి రానుంది.
(2 / 5)
శుక్రుడు డిసెంబర్ 22వ తేదీన ధనిష్ఠ నక్షత్రంలో ప్రవేశించనున్నాడు. 2025 జనవరి 4వ తేదీ వరకు అదే నక్షత్రంలో సంచరిస్తాడు. ఈ కాలంలో మూడు రాశులకు లక్ ఎక్కువగా ఉండనుంది.
(3 / 5)
మకరం: ఈ కాలంలో ఈ మకర రాశి వారికి సంతోషం ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలు బాగా వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఉద్యోగస్తులకు సానుకూల ఫలితాలు దక్కుతాయి. కెరీర్లో పురోగతి ఉంటుంది. చేసే పనుల్లో అధిక శాతం విజయాలు సిద్ధిస్తాయి.
(4 / 5)
సింహం: ఈ కాలంలో సింహ రాశి వారికి ధనపరంగా ప్రయోజనాలు లభించే ఛాన్స్ ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొందరికి ఆకస్మిక ధన లాభం కలగొచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో కలిసి వస్తుంది.
(5 / 5)
కన్య: ధనిష్ఠ నక్షత్రంలో శుక్రుడు సంచరిస్తున్న కాలంలో కన్యా రాశి వారికి శుభాలు కలుగుతాయి. ధన యోగం బాగుంటుంది. చాలా విషయాల్లో విజయాలు వరిస్తాయి. ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. పనికి తగ్గ ఫలితాలు దక్కుతాయి. (గమనిక: శాస్త్రాలు, నమ్మకాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాల నివృత్తి కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు)
ఇతర గ్యాలరీలు