TG Spot Admissions: తెలంగాణ ఈఏపీ సెట్ రాయకున్నా ఆ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు, మైనార్టీ కాలేజీల్లో అడ్మిషన్లు
TG Spot Admissions: తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా అడ్మిషన్లలో కీలక అప్డేట్ వచ్చింది. ఈఏపీసెట్ ఎంపీసీ స్ట్రీమ్ అడ్మిషన్లకు సంబంధించి ఈఏపీసెట్‌కు హాజరు కాని మైనార్టీ అభ్యర్థులకు కూడా స్పాట్ అడ్మిషన్లలో సీట్లు కేటాయించనున్నారు.
TG Spot Admissions: 2024 తెలంగాణ ఈఏపీసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. బిఇ, బిటెక్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈఏపీసెట్ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియ మే 27 నుంచి తెలంగాణలో ప్రారంభమైంది.
తెలంగాణ ఈఏపీసెట్‌లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన మైనార్టీ విద్యార్ధులు, సెట్‌కు దరఖాస్తు చేసుకోని వారికి, పరీక్షకు హాజరు కాని వారికి స్పాట్ అడ్మిషన్లలో సీట్లు కేటాయించనున్నారు. స్పాట్ అడ్మిషన్లలో దరఖాస్తు చేసుకునే వారు అడ్మిషన్ పొందే నాటికి కనీస విద్యార్హత సాధించి ఉండాలని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.
మైనార్టీ ఇంజనీరింగ్ కళాశాలల్లో మిగిలి పోయిన సీట్లను వారితో భర్తీ చేస్తారు.మైనార్టీ కాలేజీలకు సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియను జూన్ 19న విడుదల చేస్తారు. ఈఏపీ సెట్ 2024 కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్, రెండో ఫేజ్, తుది విడత కౌన్సిలింగ్‌తో పాటు ఇంటర్నల్ స్లైడింగ్, స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన షెడ్యూల్ తెలంగాణ ఉన్నత విద్య మండలి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని తెలంగాణ ఈఏపీ సెట్ కన్వీనర్ బుర్రా వెంకటేశం తెలిపారు.
తెలంగాణలో ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జూన్ 27వ తేదీ నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఏడాది మొత్తం మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ జరగనుంది. జూన్ 30 నుంచి ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లకు ఛాన్స్ కల్పించారు. జులై 12న తొలి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు. తొలి విడుతలో సీట్లు పొందిన విద్యార్థులు జూలై 16వ తేదీలోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
ఇక రెండో విడత కౌన్సెలింగ్ జులై 19వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మూడో విడత జూలై 30వ తేదీ నుంచి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. జులై 24వ తేదీన ఇంజినీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు ఉండగా,ఆగస్టు 5వ తేదీన తుది విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయిస్తారు.
స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి ఆగస్టు 17వ తేదీన మార్గదర్శకాలను విడుదల చేస్తారు. విద్యార్థులు రిపోర్టింగ్ చేసే సంఖ్యను బట్టి మిగిలే సీట్ల విషయంలో క్లారిటీ వస్తుంది. త్వరలోనే అగ్రికల్చర్ మరియు ఫార్మసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి వెబ్ ఆప్షన్ల ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.
TS EAPCET ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ 2024- ముఖ్య తేదీలు
జూన్ 27, 2024 - ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం.
జూన్ 30, 2024 - ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు.
జులై 12, 2024 - ఫస్ట్ ఫేజ్ ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు.
జూలై 12- 16, 2024 - సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్టింగ్ చేయాలి.
జులై 19, 2024 - ఇంజినీరింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం.
జులై 24, 2024 - సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు
జులై 30, 2024 - ఇంజినీరింగ్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్.
ఆగస్టు 5, 2024 - ఇంజినీరింగ్ తుది విడత సీట్ల కేటాయింపు.
ఆగస్టు 17, 2024 - స్పాట్ అడ్మిషన్లకు గైడ్ లైన్స్ విడుదల
అధికారిక వెబ్ సైట్ - https://eapcet.tsche.ac.in/
ఈసారి తెలంగాణ ఈఏపీసెట్ పరీక్షలో చూస్తే…. అగ్రికల్చర్ , ఫార్మ విబాగాలకు 91633 మంది హాజరయ్యారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 91.24 శాతం మంది పరీక్ష రాశారు. కాగా ఇంజనీరింగ్ విభాగంలో 2 లక్షల 40వేల 618 మంది పరీక్ష రాశారు. ఈసారి మొత్తం 3 లక్షల 32 వేల 251 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు.
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో పురుషులు 88.25 శాతం ఉత్తీర్ణత సాధించగా, మహిళలు 90.18 శాతం క్వాలిఫై అయ్యారు. మొత్తం 89.66 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో అబ్బాయిలు…. 74.38 శాతం క్వాలిఫై అయ్యారు, అలాగే అమ్మాయిలు…. 75.85 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 89.66 శాతం ఉత్తీర్ణత సాధించారు.
కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్ధులు పదో తరగతి మెమో, ఇంటర్మీడియట్ మార్కుల మెమో, టీసీ(ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్), 01-01-2024 తర్వాత జారీ అయిన ఆదాయపత్రం, EWS రిజర్వేషన్ అర్హత ఉంటే తహసీల్దార్ కార్యాలయం నుంచి సర్టిఫికేట్ ఉండాలి. కుల ధ్రువీకరణపత్రం తప్పనిసరిగా ఉండాలి.
సంబంధిత కథనం