Andhra Pradesh News Live December 14, 2024: AP Crop Insurance : రైతులకు అలర్ట్, పంటల బీమా ప్రీమియం చెల్లింపునకు రేపే ఆఖరు తేదీ
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 14 Dec 202403:43 PM IST
AP Crop Insurance : ఏపీలో పంట బీమా ప్రీమియం చెల్లింపు ప్రక్రియ రేపటితో ముగుస్తుంది. బ్యాంకుల్లో రుణం తీసుకున్న రైతులు నేరుగా బ్యాంకుల ద్వారా, రుణాలు తీసుకోని రైతులు సీఎస్సీ ద్వారా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
Sat, 14 Dec 202402:48 PM IST
Tirumala Vaikunta Ekadasi Darshan : తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ పది రోజులు విశేష దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.
Sat, 14 Dec 202402:07 PM IST
Guntur Medical Jobs : గుంటూరు జిల్లాలోని వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 5 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు పాలియేటివ్ కేర్ పోస్టులకు డిసెంబర్ 19, డైక్ పోస్టులకు డిసెంబర్ 30లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Sat, 14 Dec 202401:46 PM IST
AP TG Political Recap 2024 : ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో 2024 సంచలన ఘటనలకు కేంద్రమైంది. వైసీపీ అనూహ్య ఓటమి, కూటమి ఘటన విజయం, బీఆర్ఎస్ కు లోక్ సభలో సున్న, కవిత అరెస్ట్ , షర్మిల రాజకీయ షిఫ్ట్ , పవన్ చేతికి పవర్ 2024 జరిగిన కీలక సంఘటనలు.
Sat, 14 Dec 202412:56 PM IST
CBN Phone To Allu Arjun : హీరో అల్లు అర్జున్ ను ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ లో పరామర్శించారు. అరెస్టుపై ఆరా తీసిన సీఎం.. ధైర్యంగా ఉండాలని సూచించారు. నిన్న అల్లు అరవింద్ కు సీఎం చంద్రబాబు ఫోన్ చేసిన సంగతి తెలిసిందే.
Sat, 14 Dec 202410:16 AM IST
- Sana Satish : ఇప్పుడు రాష్ట్రంలోని ఎక్కడ చూసినా సానా సతీష్ పేరే వినబడుతోంది. టీడీపీలోనూ, రాష్ట్రంలోనూ ఈయనెవరనే చర్చోపచర్చలు జరిగిపోతున్నాయి. కీలకమైన రాజ్యసభకు టీడీపీ ఈయనను పంపడమే అందుకు కారణం. ఆయన గురించి ఆసక్తికరమైన 10 విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Sat, 14 Dec 202406:57 AM IST
- CBN on Jamili Elections : జమిలి ఎన్నికలపై ఇటీవల కీలక అప్‌డేట్ వచ్చింది. జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతోంది ముఖ్యంగా వైసీపీ జమిలిపై ఆశగా ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Sat, 14 Dec 202406:17 AM IST
- బాపట్ల జిల్లాలో దారుణం వెలుగు చూసింది. కన్న కొడుకే తల్లిదండ్రులను హత్య చేశాడు. రోకలి బండతో కొట్టి చంపేశాడు. స్థానికులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది.
Sat, 14 Dec 202406:07 AM IST
- Eluru Crime : ఏలూరు జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌గా కన్నాలు వేస్తున్నారు. పగలు పక్కాగా రెక్కీ నిర్వహించి.. రాత్రిపూట సైలెంట్‌గా పని కానిచ్చేస్తున్నారు. దీంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో భద్రంగా దాచుకున్నా.. దోచుకెళ్తున్నారని వాపోతున్నారు.
Sat, 14 Dec 202404:59 AM IST
- Swarnandhra 2047 : ఏపీ దశ దిశను మార్చేలా స్వర్ణాంధ్ర – 2047 విజన్‌ను ఆవిష్కరించామని.. సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల స్పందించారు. చంద్రబాబు మళ్లీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శలు గుప్పించారు. మోదీ, చంద్రబాబు, జగన్ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు.
Sat, 14 Dec 202404:34 AM IST
- AP Crime : ఇటీవలి అన్నమయ్య జిల్లాలో చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని.. వృద్ధుడిని హత్య చేయడం సంచలనం అయింది. నిందితుడు.. తన కుమార్తె పట్ల నీచంగా ప్రవర్తించడం వల్లనే హత్య చేశానని వీడియో విడుదల చేశారు. అందరూ అదే అనుకున్నారు. కానీ ఇక్కడ డామిట్ కథ అడ్డం తిరిగింది.
Sat, 14 Dec 202412:36 AM IST
- Allu Arjun Arrest Politics : అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే బన్నీ అరెస్టుపై సినిమా ఇండస్ట్రీ కంటే ఎక్కువ రాజకీయ పార్టీలు, నేతలు స్పందించారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయి స్పందన రాలేదు. అల్లు అర్జున్‌కు రాజకీయాలకు సంబంధం ఏంటీ?
Sat, 14 Dec 202411:49 PM IST
- AP Telangana Weather Updates : ఇవాళ దక్షిణ అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది క్రమంగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిచింది. ఈ ప్రభావంతో సోమవారం ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…