Star Maa Serials: స్టార్ మాలోకి కొత్త సీరియల్.. ఈ మధ్యే ప్రారంభమైన సీరియల్ టైమ్ మార్పు
Star Maa Serials: స్టార్ మాలోకి సరికొత్త సీరియల్ రానుండటంతో ఈ మధ్యే ప్రారంభమైన మరో సీరియల్ టైమ్ మారింది. ఈ మార్పులు వచ్చే సోమవారం (డిసెంబర్ 16) నుంచి అమల్లోకి రానున్నట్లు స్టార్ మా వెల్లడించింది.
Star Maa Serials: స్టార్ మా ఇప్పటికే ఉన్న సీరియల్స్ తోపాటు కొత్త సీరియల్స్ ను కూడా వరుసగా లాంచ్ చేస్తోంది. ఈ మధ్యే ఇల్లు ఇల్లాలు పిల్లలు, గీత ఎల్ఎల్‌బీలాంటి సీరియల్స్ ను తీసుకొచ్చిన ఆ ఛానెల్.. ఇప్పుడు నువ్వుంటే నా జతగా అనే మరో కొత్త సీరియల్ ను ప్రారంభిస్తోంది. ఈ సీరియల్ కారణంగా గీత ఎల్ఎల్‌బీ టైమ్ మారనుంది.
స్టార్ మా సీరియల్స్ టైమ్ మార్పు
స్టార్ మాలో ఈ మధ్యే ప్రారంభమైన గీత ఎల్ఎల్‌బీ సీరియల్ ప్రతి రోజూ రాత్రి 9.30 గంటలకు టెలికాస్ట్ అవుతోంది. నిజానికి ఈ సీరియల్ కోసం రాత్రి 9.30కు వచ్చే బిగ్ బాస్ ను రాత్రి 10 గంటలకు మార్చారు. అయితే ఇప్పుడు నువ్వుంటే నా జతగా అనే కొత్త సీరియల్ వస్తుండటంతో గీత ఎల్ఎల్‌బీ టైమ్ మార్చేశారు. సోమవారం (డిసెంబర్ 16) నుంచి గీత ఎల్ఎల్‌బీ రాత్రి 9.30కు బదులు రాత్రి 10 గంటలకు ప్రసారం అవుతుంది.
కొత్త సీరియల్ నువ్వుంటే నా జతగా 9.30కు వస్తుంది. ఈ సీరియల్ అనౌన్స్ చేసే సమయంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు టెలికాస్ట్ అవుతుందని వెల్లడించినా.. ఇప్పుడు అనూహ్యంగా టైమ్ మార్చేశారు. ఈ మధ్యే ప్రారంభమైన సీరియల్ టైమ్ ను ఈ కొత్త సీరియల్ కోసం మార్చడం విశేషం.
స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
మరోవైపు 49వ వారం కోసం స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. ఇందులో కార్తీకదీపం మరోసారి టాప్ లో నిలిచింది. ఆ సీరియల్ కు ఈ వారం 11.91 రేటింగ్ నమోదైంది. ఇక రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు 10.92తో నిలిచింది. మూడో స్థానంలో చిన్ని (10.76), నాలుగో స్థానంలో ఇంటింటి రామాయణం (10.29), ఐదో స్థానంలో గుండెనిండా గుడిగంటలు (9.93), ఆరో స్థానంలో మగువ ఓ మగువ (9.86) నిలిచాయి.
కొత్త సీరియల్ గీత ఎల్ఎల్‌బీకి 5.32 రేటింగ్ నమోదైంది. ఇక చాలా రోజుల పాటు రాత్రి 7.30కు టెలికాస్ట్ అయి టీఆర్పీల్లో టాప్ లో నిలిచిన బ్రహ్మముడి మధ్యాహ్నం ఒంటి గంటకు మారిన తర్వాత రేటింగ్ 6.77కు పడిపోయింది. మరి కొత్తగా వస్తున్న నువ్వుంటే నా జతగా సీరియల్ ఎంత వరకూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.