Yoga Poses for Hangover: హ్యాంగోవర్ ఇబ్బంది పెడుతోందా? ఈ 3 యోగాసనాలు ట్రై చేయండి-this yoga poses can reduce hangover in morning ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yoga Poses For Hangover: హ్యాంగోవర్ ఇబ్బంది పెడుతోందా? ఈ 3 యోగాసనాలు ట్రై చేయండి

Yoga Poses for Hangover: హ్యాంగోవర్ ఇబ్బంది పెడుతోందా? ఈ 3 యోగాసనాలు ట్రై చేయండి

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 14, 2024 06:00 AM IST

Yoga Poses for Hangover: కొందరికి ఉదయాన్నే హ్యాంగోవర్ వేదిస్తుంది. రాత్రి మద్యం తాగడం వల్ల ఉదయాన్నే ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని యోగాసనాలు వేయడం వల్ల హ్యాంగోవర్ తగ్గుతుంది. అవేవో ఇక్కడ చూడండి.

Yoga Poses for Hangover: హ్యాంగోవర్‌ను ఇబ్బంది పెడుతోందా? ఈ 3 యోగాసనాలు ట్రై చేయండి
Yoga Poses for Hangover: హ్యాంగోవర్‌ను ఇబ్బంది పెడుతోందా? ఈ 3 యోగాసనాలు ట్రై చేయండి

రాత్రి తాగిన మందు ఎఫెక్ట్ తరువాతి రోజు ఉదయం చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. హ్యాంగోవర్‌తో బాధపడుతుంటారు. తలనొప్పి, మత్తుతో ఇబ్బందులు పడుతుంటారు. ఈ హ్యాంగోవర్ కొందరికి చాలా ఉంటుంది. దీంతో రోజు గందరగోళంగా మొదలైనట్టు అనిపిస్తుంది. అయితే, కొన్ని యోగాసనాలు హ్యాంగోవర్‌ తగ్గడంలో తోడ్పడతాయి. అందుకే వీటిని ట్రై చేయాలి. హ్యాంగోవర్ తగ్గేందుకు తీసుకునే వాటితో పాటు ఈ యోగాసనాలు చేస్తే.. త్వరగా దిగిపోతుంది. ఆ ఆసనాలు ఏవంటే..

బాలాసనం

బాలాసనం వేయడం వల్ల శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది. పొత్తి కడుపుపై ఒత్తిడి పడుతుంది. శరీరంలో లింఫ్ ప్రసరణను ఈ ఆసనం మెరుగుపరుస్తుంది. దీంతో శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు సులువుగా బయటికి వెళ్లేలా చేయగలదు. దీంతో హ్యాంగోవర్ తగ్గేందుకు సహకరిస్తుంది.

ఆసనం ఇలా: బాలాసనం వేసేందుకు ముందుగా ఓ చోట మోకాళ్లపై కూర్చోవాలి. ఆ తర్వాత శరీరాన్ని ముందుకు తెచ్చి వంగాలి. ముంజేతులను, తలను నేలకు ఆనించాలి. ఈ భంగిమలోనే సుమారు ఓ నిమిషం పాటు ఉండాలి. ఆ తర్వాత లేచి మళ్లీ రిపీట్ చేయాలి. చేతులను స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. పిల్లలు బోర్లా పడుకున్నట్టుగా ఈ బాలాసనం ఉంటుంది.

మలాసనం

మలాసనం వేయడం వల్ల శరీరంలో పేగుల కదలిక మెరుగవుతుంది. కాలేయంపై కూడా కాస్త ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల శరీరంలోని వ్యర్థాలు మెరుగ్గా బయటికి వెళ్లేందుకు ఈ ఆసనం సహాయపడుతుంది. దీంతో హ్యాంగోవర్ తగ్గుతుంది.

ఆసనం ఇలా: మలాసనం కోసం.. ముందుగా ఓ చోట నిటారుగా నిలబడి కాళ్లు దూరంగా జరపాలి. ఆ తర్వాత మోకాళ్లను వంచుతూ కిందికి వంగాలి. కాళ్లపై భారం వేస్తూ కూర్చున్నట్టుగా చేయాలి. మల విసర్జన కోసం కూర్చున్నట్టుగా ఈ భంగిమ ఉంటుంది. మలాసనం భంగిమలో ఐదుసార్లు శ్వాస తీసుకోవాలి. ఆ తర్వాత మళ్లీ నిలబడి సాధారణ స్థితికి రావాలి. మళ్లీ రిపీట్ చేయాలి.

మర్జర్యాసనం - బిటిలాసనం

హ్యాంగోవర్‌ను మర్జర్యాసనం - బిటిలాసనం (క్యాట్ అండ్ కౌ పోజ్) తగ్గించగలదు. శరీరం నుంచి ఒత్తిడి తగ్గేలా ఈ ఆసనం చేయగలదు. హ్యాంగోవర్ నుంచి రిలాక్సేషన్ ఇస్తుంది.

ఆసనం ఇలా: ముందుగా ఓ చోట మోకాళ్లపై కూర్చోవాలి. ముందుకు వంగి అరచేతులను నేలకు ఆనించి.. ఆవులా ఉన్నట్టుగా భంగిమలో ఉండాలి. శ్వాస తీసుకొన ఛాతిని, నడుమును కాస్త పైకి అనాలి. ఆ తర్వాత అదే భంగిమలో నడుమును, కిందికి వచ్చేలా వంచాలి. తలను పైకి ఎత్తి చూడాలి. పిల్లిలా ఈ భంగిమ ఉండాలి. మర్జర్యాసనం - బిటిలాసనం ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది. శరీరం నుంచి వ్యర్థాలు బయటికి వెళ్లేందుకు కూడా ఉపకరిస్తుంది.

బుద్ధ కోణాసనం, నవాసన కూడా హ్యాంగోవర్ తగ్గేందుకు ఉపయోపడతాయి. బుద్ధ కోణాసనంలో.. ఓ చోట కూర్చొని.. మోకాళ్లను మరింత పక్కకు జరపాలి. ఆ తర్వాత రెండు పాదాలను ఒకదానికి ఒకటి టచ్ చేసి.. అదిమి పట్టాలి. ఆ భంగిమలో వీలైనంత సేపు ఉండాలి. నవాసనం వేసేందుకు ముందుగా ఓ చోట కూర్చోవాలి. నడుముపై పూర్తి భారం వేసి.. కాళ్లు, తల, ఛాతిపైకి ఎత్తాలి.

Whats_app_banner

సంబంధిత కథనం