Gunde Ninda Gudi Gantalu: సంజుతో బాలు గొడవ - అత్తింట్లో మీనా రౌడీయిజం - ప్లేట్ ఫిరాయించిన మనోజ్
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు ప్రోమోలో మీనా సెలిబ్రిటీగా మారడంతో బాలు ఆనందం పట్టలేకపోతాడు. ఈ సంతోషంలో స్నేహితులకు బార్‌లో పార్టీ ఇస్తాడు. అదే బార్‌లో ఉన్న సంజు...బాలు స్నేహితుడిని కొడతాడు. తన స్నేహితుడిని కొట్టిన సంజును బట్టలు ఊడదీసి అవమానిస్తాడు బాలు.
Gunde Ninda Gudi Gantalu: శృతిని సంజు బారి నుంచి కాపాడిన మీనా సెలిబ్రిటీగా మారిపోతుంది. మీనాను టీవీ ఛానెల్ వాళ్లు ఇంటర్వ్యూ చేస్తారు. వండర్ ఉమెన్, స్టోన్ లేడీ అంటూ బిరుదులు ఇస్తారు. శృతిని మీనా కాపాడిన వీడియోను ప్రభావతితో పాటు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్‌కు మీడియా వాళ్లు చూపిస్తారు. ఇటుకరాళ్లతో రౌడీలను మీనా చితక్కొట్టడం చూసి ప్రభావతితో పాటు రోహిణి, మనోజ్ జడుసుకుంటారు.
క్రెడిట్ బాలుకే...
శృతిని కాపాడిన విషయంలో క్రెడిట్ మొత్తం బాలుకు ఇస్తుంది మీనా.. ఈ ధైర్యం అంత తాను భర్త దగ్గర నుంచి నేర్చుకున్నానని చెబుతుంది. మీనా చేసిన సాహసం చూసి బాలు పొంగిపోతాడు. నా భార్యను చూస్తుంటే గర్వంగా ఉందని అంటాడు.
అత్తను తప్పుపట్టిన రోహిణి...
బాలును చిన్నప్పటి నుంచి మీరు పట్టించుకోకపోవడం వల్లే ఇలా రౌడీలా తయారయ్యాడని అత్తను తప్పుపడుతుంది రోహిణి. బాలు, మీనాను ఉద్దేశించి ఇంట్లో రౌడీలు ఎక్కువైపోయారని మనోజ్ అంటాడు.
బాలు ఆనందం...
తన భార్యకు ఊరు ఊరంతా బిరుదుల మీద బిరుదులు ఇస్తున్నారని బాలు పొంగిపోతాడు. ఇక నుంచి నీకు ఏం భయం లేదని, నిన్ను దుష్టశక్తులు ఏమైనా అంటే పనికొస్తుందని ఇటుక రాయి తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నానని బాలు అంటాడు. ఇటుకరాయితో ప్రభావతి, మనోజ్, రోహిణిలను మరింత భయపెడతాడు బాలు.
ఒకటి రెండుసార్లు ఆలోచించుకో...
మీనా రోజు బయటకు వెళుతున్నందుకు ఆమెను ఏమైనా తిట్టాలని అనుకుంటున్నావా, ఆమెపై ఎగరాలని అనుకుంటున్నావా అని ప్రభావతిని అడుగుతాడు మనోజ్. నేనేందుకు ఎగురుతాను. కార్తీక మాసం గుడికి వెళ్లాలని చెప్పింది కదా.. వాళ్లతో అమ్మతో కాస్త మాట్లాడి వస్తుంది కదా...అందుకే ఆలస్యమవుతోంది ఉంటుంది ప్రభావతి. ఆ చిన్న విషయానికే నేనేందుకు మీనా తిడతాను అని భయంగా ప్రభావతి బదులిస్తుంది.
మనోజ్‌కు వార్నింగ్...
ఇందాక గట్టిగా ఎందుకు నవ్వావని మనోజ్‌ను అడుగుతాడు బాలు. నేనేం నవ్వలేదని మనోజ్ భయంగా సమాధానమిస్తాడు. ఓవర్ యాక్షన్ చేశావంటే ఇందాక వండర్ ఉమెన్ రాయిని ఎంత స్పీడుగా విసిరిందో చూశావు కదా అని హెచ్చరిస్తాడు. ఏంటి మీ రౌడీయిజం చూపించాలని అనుకుంటున్నారా అని రోహిణి ఫైర్ అవుతుంది. రోహిణికి సపోర్ట్‌గా ప్రభావతి మాట్లాడుతుంది.
ఏంటి బెదిరిస్తున్నావా...అడది అన్న తర్వాత హద్దుల్లో ఉండాలి రౌడీలా ప్రవర్తిస్తే ఎలా అని మీనా గురించి గొంతు పెంచి మాట్లాడుతుంది ప్రభావతి. ఈ రాయి వంక చూసి ఆ మాట చెప్పమని తల్లితో అంటాడు బాలు. అంటే పద్దతిగా ఉండాలని చెబుతున్నానని మాట మార్చేస్తుంది ప్రభావతి. ఆడపిల్ల అన్నప్పుడు పద్దతిగానే ఉండాలి...కానీ అన్ని సార్లు కాదు...అవసరం వచ్చినపుడు మీనాలా ధైర్యం చూపించాలని, సాహసం చేయాలని సత్యం అంటాడు.
బాలు పార్టీ...
మీనా సెలిబ్రిటీగా మారిన సందర్భంగా తన స్నేహితులుకు పార్టీ ఇవ్వాలని బాలు అనుకుంటాడు. పార్టీకి వెళుతున్నానని తెలిస్తే తండ్రి బాధపడతాడని అనుకుంటాడు. ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలియకుండా నువ్వే మ్యానేజ్ చేయాలని మీనాను బతిమిలాడుతాడు బాలు. సరేనని మీనా అంటుంది. మీనా ఒప్పుకోవడంతో సంతోషంగా ఆమె బుగ్గపై ముద్దిస్తాడు బాలు.
సంజును చితక్కొట్టిన బాలు...
బాలు తన స్నేహితులకు బార్‌లో పార్టీ ఇస్తుంటాడు. అదే బార్‌లో సంజు కూడా మందు తాగుతుంటాడు. శృతిపై ఎటాక్ చేసిన వాళ్లను నరికేయాలని బాలు స్నేహితుడు రాజేష్ అంటాడు. అతడి మాటల్ని సంజు వింటాడు. కోపం పట్టలేకపోతాడు. రాజేష్ వెళ్లబోతుంటే కావాలనే తన కాలును అతడికి అడ్డుగా పెడతాడు. తనను కావాలనే తన్నావని రాజేష్‌ను కొడతాడు. తన స్నేహితుడిని సంజు కొట్టడం చూసి బాలు రంగంలోకి దిగుతాడు.
సంజుతో పాటు అతడి గ్యాంగ్‌ను చితక్కొడతాడు. సంజు షర్ట్ మొత్తం చించేసి అతడిని అవమానిస్తాడు. నీలాంటివాడిని నరికేస్తాను..గుర్తుపెట్టుకోమని వార్నింగ్ ఇస్తాడు. తనను కొట్టిన మీనా, బాలులపై రివేంజ్ తీర్చుకోవాలని సంజు ఫిక్సవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది గుండె నిండా గుడి గంటలు సోమవారం నాటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.