Allari Naresh Bachhala Malli: రామ్ చరణ్‌కు రంగస్థలం ఎలానో అల్లరి నరేష్‌కు బచ్చల మల్లి.. నిర్మాత రాజేష్ దండా కామెంట్స్-producer razesh danda says rangasthalam was ram charan like bachhala malli for allari naresh bachhala malli story ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allari Naresh Bachhala Malli: రామ్ చరణ్‌కు రంగస్థలం ఎలానో అల్లరి నరేష్‌కు బచ్చల మల్లి.. నిర్మాత రాజేష్ దండా కామెంట్స్

Allari Naresh Bachhala Malli: రామ్ చరణ్‌కు రంగస్థలం ఎలానో అల్లరి నరేష్‌కు బచ్చల మల్లి.. నిర్మాత రాజేష్ దండా కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Dec 14, 2024 08:11 AM IST

Bachhala Malli Producer About Allari Naresh Ram Charan: రామ్ చరణ్‌కు రంగస్థలం సినిమా ఎలానే అల్లరి నరేష్‌కు బచ్చల మల్లి మూవీ అని నిర్మాత రాజేష్ దండా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న అల్లరి నరేష్ బచ్చల మల్లి ప్రమోషన్స్ సందర్భంగా ఇలా మాట్లాడారు.

రామ్ చరణ్‌కు రంగస్థలం ఎలానో అల్లరి నరేష్‌కు బచ్చల మల్లి.. నిర్మాత రాజేష్ దండా కామెంట్స్
రామ్ చరణ్‌కు రంగస్థలం ఎలానో అల్లరి నరేష్‌కు బచ్చల మల్లి.. నిర్మాత రాజేష్ దండా కామెంట్స్

Bachhala Malli Producer Allari Naresh Ram Charan: హీరో అల్లరి నరేష్ అప్‌కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. బచ్చల మల్లి మూవీలో హనుమాన్ ఫేమ్ అమృత అయ్యర్ హీరోయిన్‌గా అల్లరి నరేష్‌కు జోడీగా నటించింది.

yearly horoscope entry point

క్రిస్మస్ సందర్భంగా

సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా బచ్చల మల్లి సినిమాను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన బచ్చల మల్లి టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రాజేష్ దండా విలేకరుల సమావేశంలో బచ్చల మల్లి సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

బచ్చల మల్లి కథ ఎప్పుడు విన్నారు? ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది?

-ఇట్లు మారేడుమిల్లి సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు బచ్చలపల్లి కథ విన్నాను. కథ వినగానే బాడీలో ఒక ఎనర్జీ క్రియేట్ అయింది. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. నా మైండ్‌లో ఈ కథ ఉండిపోయింది. ఎక్కడికి వెళ్లినా ఈ కథే గుర్తుకొచ్చేది. నరేష్ గారికి ఈ కథ చాలా నచ్చింది. అయితే అప్పటికి నరేష్ గారు వేరే సినిమాలు కమిట్ అవ్వడం వల్ల ఆయన కోసం రెండేళ్లు వెయిట్ చేసి ఈ సినిమా చేశాం. బచ్చల మల్లి క్యారెక్టర్ డ్రివెన్ సినిమా. 1980లో జరిగే కథ.

ఇది రియల్ లైఫ్ స్టొరీనా?

-మా డైరెక్టర్ గారిది తుని. అదే ఊర్లో బచ్చలపల్లి అనే ఒక వ్యక్తి ఉన్నారు. కేవలం ఆయన పేరుని మాత్రమే ఈ సినిమా కోసం తీసుకున్నాం. ఇది ఫిక్షనల్ స్టోరీ. రామ్ చరణ్ గారికి రంగస్థలం ఎలానో నరేష్ గారికి బచ్చల మల్లి అలాంటి సినిమా అవుతుంది. మంచి మంచి కథలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా అద్భుతంగా వచ్చింది. సినిమా చూసి ఇది నరేష్ 2.0 అని ఫీల్ అవుతారు.

బచ్చల మల్లి ఎలాంటి కథ?

-లైఫ్‌లో తప్పులు చేయొచ్చు. కానీ, సరిదిద్దుకోలేని తప్పులు చేస్తే ఎలా ఉంటుందో బచ్చల మల్లిలో చూపించాం. మూర్ఖత్వం బార్డర్ దాటేసిన క్యారెక్టర్ ఇది. సినిమాలో ఎమోషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. డైరెక్టర్ సుబ్బు చాలా కసితో సినిమా చేశాడు. చాలా హార్డ్ వర్క్ చేశారు. మళ్లీ మళ్లీ తనతో వర్క్ చేయాలని ఉంది. మా బ్యానర్‌లో తను వన్ అఫ్ ది బెస్ట్ డైరెక్టర్.

మీ సినిమాలన్నిటికీ చాలా మంచి పేరు వచ్చింది. కథల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?

-నేనొక ఆడియన్‌గానే కథ వింటాను. ఫస్ట్ ఆఫ్ ఎక్సయిట్ చేస్తేనే సెకండ్ హాఫ్ వింటాను. ఒకే తరహాలో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్టులు చేయాలని భావిస్తాను. నా సినిమాలు మీరు గమనిస్తే ఒక దానికి ఒకటి పోలిక లేకుండా అన్ని డిఫరెంట్ జోనర్స్‌లో ఉంటాయి.

Whats_app_banner