TG Indiramma Housing Survey : కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే - దరఖాస్తుదారుడికి ఒక రోజు ముందే సమాచారం..!
- TG Indiramma Housing Scheme Survey : 'ఇందిరమ్మ ఇళ్ల సర్వే షురూ అయింది. సర్వేయర్లు దరఖాస్తుదారుల వద్దకు వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. సర్వేలో 30 నుంచి 35 ప్రశ్నలు ఉంటున్నాయి. ప్రతి అంశాన్ని యాప్ లో నమోదు చేస్తున్నారు. అన్ని కోణాల్లో పరిశీలించి… అర్హులైన వారినే లబ్ధిదారులుగా గుర్తించనున్నారు.

(1 / 7)
(2 / 7)
ముందుగా అధికారులు ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. ప్రతి దరఖాస్తును క్లుప్తంగా పరిశీలించి… వివరాలను సేకరిస్తున్నారు. ఇందులో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సేకరించి… వారి వద్దకు వెళ్తున్నారు.
(3 / 7)
ఇళ్ల సర్వే కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సర్వేయర్లను నియమించింది. వీరందరికీ శిక్షణ కూడా ఇప్పించింది. యాప్ లో నమోదు చేయాల్సిన అంశాలపై అవగాహన కల్పించింది. ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ సర్వేయర్లు… వివరాలను సేకరిస్తున్నారు.
(4 / 7)
ఇందిరమ్మ ఇళ్ల సర్వే గురించి ముందుగానే సమాచారం అందిస్తున్నారు. గ్రామాలు, వార్డుల్లో ఒక రోజు ముందే సమాచారం ఇస్తున్నారు. అధికారులు వచ్చే సమయానికి సంబంధిత ధ్రువపత్రాలన్నీ సిద్ధం చేసుకొని ఉండాలని దరఖాస్తుదారులకు సూచిస్తున్నారు. అన్ని పత్రాలు ఉంటే… ఇబ్బంది లేకుండా వివరాలను ఎంట్రీ చేయించుకోవచ్చని చెబుతున్నారు.
(5 / 7)
(6 / 7)
లబ్దిదారులు వికలాంగులు/అనాథలు/ ఒంటరి మహిళలు/వితంతువులు/ ట్రాన్సో జెండర్లు, పారిశుద్ధ్య కార్మికులు ఉంటే ఇందిరమ్మ ఇళ్లలో ప్రాధాన్యం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిని కూడా యాప్ ద్వారానే గుర్తిస్తున్నారు, అన్ని కలిపి 30 - 35 ప్రశ్నలు ఉంటాయి. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి అధికారులు ఆయా వివరాలను యాప్లో నమోదు చేస్తున్నారు.
ఇతర గ్యాలరీలు