TGPSC Group 2 Exams 2024 : రేపు, ఎల్లుండి గ్రూప్ 2 పరీక్షలు - అభ్యర్థులు పాటించాల్సిన సూచనలివే-telangana group 2 exams will start from tomorrow ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Tgpsc Group 2 Exams 2024 : రేపు, ఎల్లుండి గ్రూప్ 2 పరీక్షలు - అభ్యర్థులు పాటించాల్సిన సూచనలివే

TGPSC Group 2 Exams 2024 : రేపు, ఎల్లుండి గ్రూప్ 2 పరీక్షలు - అభ్యర్థులు పాటించాల్సిన సూచనలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 14, 2024 07:27 AM IST

TGPSC Group 2 Exam 2024 Updates: గ్రూప్ 2 పరీక్షలకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు సిద్ధం చేసింది. రేపట్నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 4 పేపర్లు రాయాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు చర్యలు చేపట్టనున్నారు. అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక సూచనలు చేసింది.

తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు
తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు

గ్రూప్‌-2 పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు సిద్ధం చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో జరిగే ఈ పరీక్షల కోసం సెంటర్ల వద్ద పకడ్బందీ చర్యలను చేపట్టింది. ఇందుకోసం రాష్ట్ర వ్యప్తంగా 1368 కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇప్పటికే హాల్ టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక సూచనలు చేసింది.

yearly horoscope entry point

గ్రూప్-2 లో మొత్తం 4 పేపర్లు ఉంటాయి. టీజీపీఎస్సీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం... పేపర్-1 డిసెంబరు 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 ఉంటుంది.ఇక డిసెంబరు 16వ తేదీన పేపర్​3, 4 పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్-2 ప్రతి పేపరులో 150 ప్రశ్నలు 150 మార్కులకు నిర్వహించనున్నారు.

అభ్యర్థులకు TGPSC కీలక సూచనలు:

  • గ్రూప్ 2 అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • హాల్ టికెట్ ఉన్నవారినే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.
  • ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక ఒరిజినల్ ఐడీని(Passport, Pan Card, Voter ID, Aadhaar Card, Government Employee ID లేదా డ్రైవింగ్ లైసెన్స్ ) చూపించాల్సి ఉంటుంది.
  • హాల్ టికెట్ పై క్లియర్ గా కనిపించేలా ఫొటో ఉండాలి. ఇలా లేకపోతే గెజిటెడ్ అధికారితో సంతకం చేయించుకోవాలి.
  • పరీక్షా కేంద్రాన్ని ఒక రోజు ముందుగానే చూసుకుంటే ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడొచ్చు.
  • ఉదయం 08. 30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. 09.30 గంటలకు గేట్లు మూసివేస్తారు.
  • ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి తీసుకెళ్లరాదు.
  • మాల్ ప్రాక్టీసింగ్, చీటింగ్ వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి. టీజీపీఎస్సీ పరీక్షలు రాయకుండా చర్యలు తీసుకుంటారు.

అభ్యర్థుల ఇబ్బందులను నివృత్తి చేసేందుకు జిల్లాల వారీగా హెల్ప్‌ లైన్‌ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఫోన్ నెంబర్లతో కూడిన జాబితాను వెబ్ సైట్ లో విడుదల చేసింది. ఇక హాల్​టికెట్లు డౌన్​లోడ్​ సమయంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే 040-23542185 లేదా 040-23542187 నంబర్లకు సంప్రదింవచ్చు. Helpdesk@tspsc.gov.in ఈ-మెయిల్‌ సందేహాలు పంపవచ్చని టీజీపీఎస్సీ పేర్కొంది.

గ్రూప్ 2 హాల్ టికెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  • తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్ సైట్ https://www.tspsc.gov.in / పై క్లిక్ చేయాలి.
  • హోం పేజీలో కనిపించే Download Hall Ticket For Group-II Services ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత ఓపెన్ అయ్యే విండోలో టీజీపీఎస్సీ ఐడీ , పుట్టిన తేదీ వివరాలు ఎంట్రీ చేయాలి.
  • డౌన్లోడ్ పీడీఎఫ్ పై క్లిక్ చేస్తే హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు.

Whats_app_banner