Spicy Curry: కారం కారంగా సోయా మెంతి మసాలా కూర ఇలా వండారంటే రుచి అదిరిపోతుంది-spicy soya methi masala curry recipe in telugu know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Spicy Curry: కారం కారంగా సోయా మెంతి మసాలా కూర ఇలా వండారంటే రుచి అదిరిపోతుంది

Spicy Curry: కారం కారంగా సోయా మెంతి మసాలా కూర ఇలా వండారంటే రుచి అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Dec 13, 2024 05:30 PM IST

Spicy Curry: స్పైసీగా ఉండే కూరలు అంటే తెలుగువారికి ఎంతో ఇష్టం. ఇక్కడ మేము సోయా మెంతి మసాలా కూర రెసిపీ ఇచ్చాము. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. రెసిపీ తెలుసుకోండి.

సోయా మెంతి మసాలా కూర
సోయా మెంతి మసాలా కూర (Tarla dalal)

తెలుగువారికి స్పైసీగా ఉండే కూరలంటే ఎంతో ఇష్టం. ఇక్కడ మేము సోయా మెంతి మసాలా కూర రెసిపీ ఇచ్చాము. ఇది టేస్టీగా ఉండడమే కాదు, ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. వేడివేడి అన్నంలో ఈ సోయా మెంతి మసాలా కూర కలుపుకొని తింటే రుచిగా ఉంటుంది. చపాతీ, రోటీల్లో కూడా ఇది రుచిగా ఉంటుంది. దీనిలో మనం వాడేవి అన్ని ఆరోగ్యానికి మేలు చేసేవే, రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

yearly horoscope entry point

సోయా మెంతి మసాలా కూర రెసిపీకి కావాల్సిన పదార్థాలు

సోయా మీల్ మేకర్ - 50 గ్రాములు

నూనె - రెండు స్పూన్లు

జీలకర్ర - ఒక స్పూను

దాల్చిన చెక్క - చిన్న ముక్క

బిర్యానీ ఆకు - ఒకటి

మిరియాలు - నాలుగు

లవంగాలు - మూడు

పచ్చిమిర్చి - ఒక స్పూను

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

ఉల్లిపాయల తరుగు - ముప్పావు కప్పు

మెంతి ఆకులు - ఒక కప్పు

టమాటో ప్యూరీ - ఒక కప్పు

పచ్చి బఠానీలు - అరకప్పు

బటర్ - రెండు స్పూన్లు

కసూరి మేతి - ఒక స్పూను

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

కారం - ఒక స్పూను

పసుపు - పావు స్పూను

ధనియాలు - ఒక స్పూను

జీలకర్ర - ఒక స్పూను

గరం మసాలా - ఒక స్పూను

చాట్ మసాలా - ఒక స్పూను

సోయా మెంతి మసాలా కూర రెసిపీ

1. సోయా మెంతి మసాలా కూర వండడానికి ముందుగా మసాలా పేస్ట్ ను రెడీ చేసుకోవాలి.

2. ఇందుకోసం మిక్సీలో కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర, గరం మసాలా, చాట్ మసాలా, పావు కప్పు నీళ్లు వేసి మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి.

3. టమోటోలను కూడా ఫ్యూరీలా చేసి పక్కన పెట్టుకోవాలి.

4.. సోయా మీల్ మేకర్ బయట మార్కెట్లో లభిస్తుంది. దాన్ని ముందుగానే నీటిలో వేసి నానబెట్టుకోవాలి.

5. వేడినీటిలో వేస్తే ఐదు నిమిషాల్లో ఇవి మెత్తగా మారిపోతాయి.

6. ఆ సోయా మిల్ మేకర్‌ను చేత్తోనే గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి. వాటిని మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.

7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

8. ఆ నూనెలో జీలకర్ర, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, నల్ల మిరియాలు, లవంగాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి రెండు నిమిషాలు వేయించాలి.

9. తర్వాత ఉల్లిపాయలను కూడా వేసి వేయించుకోవాలి.

10. ఆ తర్వాత మెంతి ఆకులను కూడా వేసి వేయించుకోవాలి.

11. కళాయిలో ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ను కూడా వేసి బాగా కలుపుకోవాలి.

12. అలాగే టమాటా ప్యూరిని కూడా వేసి బాగా కలుపుకోవాలి.

13. పచ్చి బఠానీలను కూడా వేసి కలపాలి. కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి.

14.ఇప్పుడు మిక్సీలో కచ్చాపచ్చాగా రుబ్బుకున్న సోయా మీల్ మేకర్ ను కూడా వేసి బాగా కలపాలి.

15. నీటిని వేసి ఇగురులాగా వచ్చేవరకు ఉడికించాలి.

16. రుచికి సరిపడా ఉప్పుని వేయడం మర్చిపోవద్దు.

17. స్టవ్ కట్టడానికి ఐదు నిమిషాలు ముందు బటర్, కసూరి మేతి, కొత్తిమీర తరుగు పైన చల్లుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసేయాలి.

18. అంతే టేస్టీ స్పైసీ సోయా మెంతి మసాలా కూర రెడీ అయినట్టే.

19. మీరు ఒక్కసారి దీన్ని తిని చూడండి. మీకు ఎంతో నచ్చుతుంది.

సోయా మెంతి మసాలా కూరను వేడివేడి అన్నంలో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చపాతి, రోటితో తిన్నా కూడా బాగుంటుంది. వారానికి ఒక్కసారి దీన్ని వండుకొని చూడండి. మీకు కొత్తగా టేస్టీగా అనిపిస్తుంది. దీని వండడం కూడా చాలా సులువు.

Whats_app_banner