Brahmamudi December 14th Episode: కొంప ముంచిన తాతయ్య- ఒక్క సంతకంతో రోడ్డుమీదకు రాజ్ కుటుంబం- కావ్యను వాడుతున్న రుద్రాణి-brahmamudi serial december 14th episode raj receives shocking news to pay 100 cr star maa brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi December 14th Episode: కొంప ముంచిన తాతయ్య- ఒక్క సంతకంతో రోడ్డుమీదకు రాజ్ కుటుంబం- కావ్యను వాడుతున్న రుద్రాణి

Brahmamudi December 14th Episode: కొంప ముంచిన తాతయ్య- ఒక్క సంతకంతో రోడ్డుమీదకు రాజ్ కుటుంబం- కావ్యను వాడుతున్న రుద్రాణి

Sanjiv Kumar HT Telugu
Dec 14, 2024 11:01 AM IST

Brahmamudi Serial December 14th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 14 ఎపిసోడ్‌లో సీతారామయ్య షూరిటీ పెట్టిన చిట్ ఫండ్ కంపెనీ బోర్డ్ తిప్పేసిందని, అందుకు వంద కోట్లు కట్టమంటూ రాజ్ దగ్గరికి బ్యాంక్ వాళ్లు వస్తారు. సంతకం చేసిన రాజ్ కంపెనీ, కుటుంబం అంతా రోడ్డుమీద పడుతుందా అని ఆలోచిస్తాడు.

బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 14వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 14వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో దుగ్గిలా ఇంటికి ఇందిరాదేవిని పరామర్శించడానికి కనకం వస్తే రుద్రాణి, ధాన్యలక్ష్మీ అవమానిస్తారు. నేను రావొద్దను అనుకున్నాను. కానీ, రాకుండా ఎలా ఉండను అని కనకం అంటుంది. ఇలాంటి పరిస్థితులోకి వచ్చినందుకు, వాళ్లు నిన్ను అన్నందుకు నేను క్షమాపణ చెబుతున్నాను అని ఇందిరాదేవి అంటుంది.

yearly horoscope entry point

బావ చావు కోరుకుంటున్నారు

అవేం మాటలు అని కనకం అంటుంది. ఈ ఇంట్లో అయినా వాళ్లు కావాల్సిన వాళ్లు ఎవరో తెలియట్లేదు. బయటు వాళ్లు అయిన మీరు మా బాగు కోరుకుంటుంటే మా వాళ్లు అనుకున్న వీళ్లు నా బావ చావు కోరుకుంటున్నారు. చివరకు ఆయన్ను అందరు జీవచ్ఛవంలా మార్చారు. చివరి రోజుల్లో మాకు ఈ శోకం ఎందుకో అని ఇందిరాదేవి కన్నీళ్లు పెట్టుకుంటుంది. కనకం, కావ్య ఓదార్చుతారు. మరోవైపు ఆఫీస్‌లో జగదీష్ గారి దగ్గర నుంచి చెక్ కలెక్ట్ చేసుకోమ్మని మేనేజర్‌కి రాజ్ చెబుతాడు.

ఇంతలో కొంతమంది బ్యాంక్ నుంచి వస్తారు. లోపలికి పర్మిషన్ లేకుండా వస్తారా అని రాజ్ ఫైర్ అవుతాడు. మేము మీ తాత కోసం వచ్చాం కానీ, ఆయన పరిస్థితి చూసి మీ దగ్గరికి వచ్చాం. ఆయన వంద కోట్లకు షూరిటీ పెట్టారు అని బ్యాంక్ వాళ్లు అంటారు. దాంతో రాజ్ షాక్ అవుతాడు. మీకు ఎన్డీ చిట్ ఫండ్ కంపెనీ తెలుసు కదా అని బ్యాంక్ వాళ్లు అంటారు. తెలుసు. అది మా తాత ఫ్రెండ్‌ది. అయినా ఆయన చనిపోయారు కదా అని రాజ్ అంటాడు.

ఆయన చనిపోయాక ఆ కంపెనీని ఆయన కొడుకు నడిపించారు. ఇప్పుడు సడెన్‌గా ఆ కంపెనీ బోర్డ్ తిప్పేసింది. సుమారు వెయ్యిమందికిపైగా ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. కంపెనీ స్టార్ట్ చేసే సమయంలో మీ తాతయ్యగారు వాళ్ల ఫ్రెండ్‌ను నమ్మి వంద కోట్లకు షూరిటీ ఇచ్చారు. అతను బ్యాంక్‌కు కట్టాల్సిన లోన్స్ ఎగ్గొట్టి కస్టమర్లను మోసం చేశాడు. ఇప్పుడు అబ్‌స్కాండ్‌లో ఉన్నాడు అని బ్యాంక్ వాళ్లు చెబుతారు.

వంద కోట్లు కట్టమంటూ

కాబట్టి, వారి తరఫున షూరిటీ ఇచ్చిన మీ తాతయ్య గారే కట్టాలి. మీ తాతగారు కోమాలో హాస్పిటల్‌లో ఉన్నారు కాబట్టి ఆయన వారసుడు, కంపెనీ ఎండీగా మీరు ఆ బాధ్యత తీసుకుని ఆ వంద కోట్లు కట్టేస్తారా లేదా వెంటనే మీ ఆస్తి మొత్తం జప్తు చేయమంటారా అని బ్యాంక్ వాళ్లు అంటారు. చూడండి, ఇది షాకింగ్ విషయం. నాకు కొంచెం టైమ్ కావాలి. ఆలోచించుకుని చెబుతాను అని రాజ్ అంటాడు. సారీ కానీ, దానికి టైమ్ లేదు. మా కంపెనీ రూల్స్ ఒప్పుకోవు అని బ్యాంక్ వాళ్లు అంటారు.

ఇప్పటికిప్పుడు వంద కోట్లు అంటే ఎలా. టైమ్ ఇవ్వాలి కదా అని రాజ్ అంటాడు. ఒక్కసారి కంపెనీ బోర్డ్ తిప్పేసాక షూరిటీ పెట్టినవాళ్లకు అంత టైమ్ ఇవ్వదు అని ఒక అగ్రిమెంట్‌ మీద సంతకం చేయమంటారు. ఇక్కడ సంతకం చేస్తే డబ్బు కట్టడానికి బ్యాంక్ మీకు పది రోజులు టైమ్ ఇస్తుంది. లేదంటే ఇప్పుడే మీ ఇల్లు, మీ ఆస్తి జప్తు చేయాల్సి వస్తుంది అని బ్యాంక్ వాళ్లు అంటారు. దాంతో ఆలోచనలో పడతాడు రాజ్.

ఇప్పుడు మీరు పెట్టే సంతకం మీద మీ ఫ్యామిలీ పరువు ఆధారపడి ఉంది. ఆలోచించుకోండి అని వాళ్లు అంటారు. దాంతో రాజ్ సంతకం చేయడానికీ రెడీ అవుతుంటే మేనేజర్ ఆగమని మీతో పర్సనల్‌గా ఓ విషయం మాట్లాడాలని అంటాడు. దాంతో ఇద్దరు బయటకు వెళ్తారు. మీరు సంతకం పెట్టకండి. ఇప్పుడు తాతయ్య గారి పేరు మీద ఆస్తి లేదు. కావ్య గారి మీద ఉంది. ఎలా ఆస్తి జప్తు చేస్తారు. కావాలంటే కోర్టుకు వెళ్లమనండి అని మేనేజర్ అంటాడు.

తాతయ్య మాట పోకూడదు

మరి మా తాతగారు ఇచ్చిన మాట అని రాజ్ అంటాడు. ఆయనే కోమాలో ఉన్నారు కదా సార్. ఆయన మాటకు ఇంకా విలువ ఏం ఉంటది అని మేనేజర్ అంటాడు. దాంతో కోపంగా మేనేజర్ కాలర్ పట్టుకుంటాడు. ఆస్తికోసం మా తాత ఇచ్చిన మాట పక్కన పెట్టి ఆయన పరువు తీయాలా. అలా చేస్తే మా తాత గురించి అందరూ ఏమనుకుంటారు. ఏం జరిగినా సరే మా తాతయ్య మాట మాత్రం పోకూడదు. ఆయన గురించి ఎవరు మాట్లాడిన మంచిగానే మాట్లాడాలి అని రాజ్ అంటాడు.

తర్వాత రాజ్ వచ్చి సంతకం చేస్తాడు. దాంతో బ్యాంక్ వాళ్లు హ్యాపీగా ఫీల్ అవుతారు. మనవడు అంటే ఆస్తులే కాదు. తాతయ్య గారి విలువను కాపాడే వ్యక్తి అని నిరూపించుకున్నారు. మీకు పదిరోజులు టైమ్ ఇస్తున్నాను. ఈలోపు వంద కోట్లు బ్యాంక్‌కు కట్టేయండి అని బ్యాంక్ వాళ్లు వెళ్లిపోతారు. మీరు చాలా గ్రేట్ సర్. మీ మీద మరింత రెస్పెక్ట్ పెరిగింది. ఇందాక తాతయ్య గారి గురించి అలా మాట్లాడినందుకు సారీ సర్ అని మేనేజర్ వెళ్లిపోతాడు.

సంతకం అయితే పెట్టేశాను. ఇప్పుడు వంద కోట్లు ఎలా కట్టాలి. ఎక్కడి నుంచి తేవాలి అని రాజ్ ఆలోచిస్తుంటాడు. మరోవైపు సుభాష్ దగ్గరికి రుద్రాణి పండుగలు అడ్డం పెట్టుకుని డబ్బులు వసూలు చేయను అని రుద్రాణి అంటే.. ఎంత కావాలి అని సుభాష్ అంటాడు. రెండు లక్షలు అని రుద్రాణి అంటుంది. అంతెందుకు అని సుభాష్ అంటే.. మరీ ముఖ్యమైతే తప్పా నేను అడగను. అలాగని కారణాలు అడిగి నీ పెద్దరికాన్ని తగ్గించుకోకు అని రుద్రాణి అంటుంది.

ఏటీఎమ్ మిషన్‌లా వాడతా

ఇప్పుడు బాధ్యతలు అన్ని కావ్యకే అప్పగించాడు. ఇక ఇంటి తాళాలు నాకెందుకు అని మీ వదినా కూడా కావ్యకే ఇచ్చింది. నాకు ఇచ్చే అధికారం లేదు అని సుభాష్ అంటాడు. దాంతో రుద్రాణి షాక్ అవుతుంది. ఇప్పుడెళ్లి కావ్య కాళ్లు పట్టుకోని అడగాలా, దానికి కారణాలు చెప్పాలా అని రుద్రాణి అంటుంది. కారణాలు చెప్పి తీసుకో అని సుభాష్ అంటాడు. ఇంతలో రాహుల్ వచ్చి నేను మాట్లాడతలే అని సుభాష్‌ను పంపిస్తాడు.

ఏంట్రా నాకే చెబుతున్నావా. ఇప్పుడు వెళ్లి ఆ గుమ్మడికాయ మొహందాని దగ్గర చేతులు కట్టుకుని డబ్బులు అడగాలా అని రుద్రాణి అంటుంది. అలా నేనేందుకు చేయనిస్తాను. నేను ఒకటి చెబుతాను కూల్‌గా విను. మావయ్య దగ్గర తాళాలు ఉంటే తీసుకున్న డబ్బులకు కారణాలు అడుగుతారు. అదే కావ్య అనుకో బంధాలకు విలువ ఇస్తుంది కదా. తను కారణాలు అడగదు. ఒకవేళ అడిగిన నీకెందుకు చెప్పాలి అని రివర్స్‌గా అంటే పెద్దవాళ్లను అడగడం ఎందుకు అని ఇస్తుంది అని రాహుల్ అంటాడు.

అందే జుట్టు పట్టుకుని ఆడించడం మంచిది కదా అని రాహుల్ అంటాడు. మొదటిసారి నువ్ బాగా పనికివచ్చే ఆలోచన ఇచ్చావ్. ఫ్రౌడ్ ఆఫ్ మై సన్. ఇకనుంచి చూడు కావ్యను ఏటీఎమ్ మిషన్‌లా ఎలా వాడతానో అని రుద్రాణి అంటుంది. కట్ చేస్తే కావ్య దగ్గరికి రుద్రాణి వెళ్తుంది. చివరికి పర్సనల్ ఖర్చులకు కూడా దీన్ని అడగాల్సి వస్తుందని అని మనసులో అనుకున్న రుద్రాణి రెండు లక్షలు కావాలని అంటుంది. ఈవిడ నిజంగా అవసరం అయి అడుగుతుందా. కావాలని అవసరం సృష్టించుకుని అడుగుతుందా. ఎందుకు ఇచ్చావ్ అని అంతా అడుగుతారు అని కావ్య అనుకుంటుంది.

రుద్రాణికి రెండు లక్షలు

ఇవ్వడానికి నాకు ఇబ్బంది లేదు. కానీ, ఎందుకో చెప్పండి అని కావ్య అంటుంది. ఇంతలో ధాన్యలక్ష్మీ వచ్చి ప్రతిదీ నీకు చెప్పి చేయాలా. ఆస్తి నీకు రాసిచ్చారని అందరిమీద అజమాయిషీ చెలాయించకు. మేము డబ్బులు అడిగితే ఎందుకు అని నువ్వు అడిగితే మమ్మల్ని అవమానించినట్లే. నువ్ ఆస్తికి కాపాలా అన్నట్లు గానీ, మహారాణలా ఫీల్ అవ్వమని కాదు. అర్థమైందా అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఈ ధాన్యలక్ష్మీ బాగానే మాట్లాడుతుంది అని రుద్రాణి అంటుంది.

ఎందుకు ఖర్చు పెడుతున్నారో చెబితే అది నేను రాసుకుంటాను. రేపు పొద్దున ఈ డబ్బు ఎక్కడ అని అడిగితే సమాధానం చెప్పాలి కదా అని కావ్య అంటుంది. అలా అడిగితే మాకు ఇచ్చాను అని చెప్పి. అప్పుడు మేము చెబుతాం. వెళ్లి డబ్బు తే అని ధాన్యలక్ష్మీ అంటే.. కావ్య వెళ్తుంది. దీన్ని అడగకూడదు. ఆర్డర్ వేయాలని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో రుద్రాణి తెగ పొగిడేస్తుంది. అస్సలు తగ్గొద్దు అని రుద్రాణి అంటుంది. దానికంటే ముందు పుట్టాం. ముందు వచ్చాం. అది చెప్పినట్లు మనమెందుకు వినాలి. నువ్ కూడా గట్టిగా చెప్పు అని ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది.

కావ్య డబ్బు తీసుకొచ్చి రుద్రాణికి ఇస్తుంది. ఇకనుంచి నేను ఎంత అడిగితే అంతా నోరు మూసుకుని.. అంటే ఎందుకు ఏంటీ అని అడగకుండా ఇవ్వాలి అని రుద్రాణి వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్ దగ్గరికి శ్రుతి వచ్చి ఫైల్స్ మీద సంతకం పెట్టమంటుంది. దాంతో రాజ్ కోప్పడతాడు. ఇవి కొత్త ప్రాజెక్ట్ ఫైల్స్. కొంచెం సైన్ చేస్తే అర్జంట్‌గా క్లైంట్‌కు పంపించాలి అని శ్రుతి అంటుంది. అర్జంట్‌గా పంపిచకపోతే వంద కోట్ల నష్టం రాదు అని రాజ్ అరుస్తాడు. దాంతో శ్రుతి వెళ్లిపోతుంది.

ఇంతమంది జీవితాలు రోడ్డుమీద

వంద కోట్ల గురించి రాజ్ ఆలోచిస్తుంటాడు. సీతారామయ్య చెప్పిన మాటలు రాజ్ గుర్తు చేసుకుంటాడు. పదిరోజుల్లో వంద కోట్లు కట్టకుంటే నన్ను నమ్ముకున్న స్టాఫ్ రోడ్డుమీద పడుతుంది. నా ఫ్యామిలీ కూడా రోడ్డునపడుతుంది. ఒకరి స్వార్థం, ఒకరి మంచితనం ఇంతమంది జీవితాలను రోడ్డున పడేస్తుందా. అలా జరగడానికి వీళ్లేదు. కానీ, వంద కోట్లు ఎలా తీసుకురావాలి అని రాజ్ అనుకుంటాడు. రాజ్ కంగారుగా ఉండటం చూసి ఏమైందని అనుకుంటుంది శ్రుతి.

రాజ్ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంటాడు. వెనుక నుంచి కారు డ్రైవర్ పిలుస్తూ వస్తాడు. కానీ, రాజ్ వినడు. ముందు నుంచి వెహికిల్ వస్తుంది. కొంచెంలో యాక్సిడెంట్ అయ్యేది. హలో బాస్ రోడ్డు అనుకుంటున్నావా. పార్క్ అనుకుంటున్నావా. పక్కకు వెళ్లి నడు అని అతను అంటాడు. మరోవైపు కావ్యను మూడు లక్షలు అడుగుతుంది ధాన్యలక్ష్మీ. అంత డబ్బా అని కావ్య అంటే.. ధాన్యలక్ష్మీ నోటికివచ్చినట్లు అంటుంది. దాంతో కావ్య సరే అంటుంది.

మరోవైపు బోర్డ్ తిప్పేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తుంటారు. వాడు చాలా పెద్ద ఫ్రాడ్ అని ఎస్సై అంటాడు. అతను ఉన్న ఇంటికి వెళ్లి నందగోపాల్ ఉన్నాడా అని వాచ్‌మెన్‌ను అడుగుతాడు. సర్ రెండు గంటల ముందే ఫారెన్ వెళ్లారు అని వాచ్‌మెన్ అనడంతో రాజ్ వెనక్కి తిరుగుతాడు. ఇప్పుడు వందకోట్లు ఎలా కట్టాలి. కళావతి సాయం తీసుకోవాలి అని రాజ్ అనుకుంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner