RRB JE Admit Card 2024 : ఆర్ఆర్బీ జేఈ అడ్మిట్ కార్డులు విడుదల- ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
RRB JE Admit Card 2024 download link : ఆర్ఆర్బీ జేఈ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. డైరక్ట్ లింక్, డౌన్లోడ్ ప్రక్రియతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ జేఈ అడ్మిట్ సీఏ 2024/ ఈ-కాల్ లెటర్ని తాజాగా విడుదల చేసింది. సీబీటీ 1 పరీక్షకు హాజరయ్యేందుకు రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఆర్ఆర్బీల అధికారిక వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు rrbapply.gov.in వెళ్లి రిజిస్ట్రేషన్ నంబరును పొందవచ్చని ఆర్ఆర్బీ వెబ్సైట్ పేర్కొంది.
ఆర్ఆర్బీ జేఈ అడ్మిట్ కార్డు 2024 డౌన్లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సీబీటీ 1 రాత పరీక్షను 2024 డిసెంబర్ 16, 17, 18 తేదీల్లో దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. పరీక్ష 90 నిమిషాలు ఉంటుంది. ఎగ్జామ్ పేపర్లో 100 ప్రశ్నలు ఉంటాయి.
ఎంపిక ప్రక్రియలో ఈ దశలు ఉంటాయి..
ఆర్ఆర్బీ జేఈ ఎంపిక కోసం మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సిబిటి-1), రెండవ దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సిబిటి -2), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (డీవీ), మెడికల్ ఎగ్జామినేషన్ (ఎంఈ).
ఈ నియామక పరీక్ష ద్వారా 7951 పోస్టులను భర్తీ చేయాలని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు యోచిస్తోంది. వీటిలో 17 కెమికల్ సూపర్ వైజర్ / రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్ వైజర్ / రీసెర్చ్ పోస్టులు, 1934 జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
జులై 30న ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 ఆగస్టు 29న ముగిసింది.
ఆర్ఆర్బీ జేఈ అడ్మిట్ కార్డు 2024: ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ స్టెప్స్‌ని అనుసరించవచ్చు
- ఆర్ఆర్బీల అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఆర్ఆర్బీ జేఈ అడ్మిట్ కార్డ్ 2024 లింక్‌పై క్లిక్ చేయండి.
- అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే మీ అడ్మిట్ కార్డు డిస్ప్లే అవుతుంది.
- అడ్మిట్ కార్డు చెక్ చేసుకుని పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి.
- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసిపెట్టుకోండి.
మరింత సంబంధిత సమాచారం కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం