సమస్యలు, సవాళ్లను ఎదుర్కోవడమా, పారిపోవడమా అనే ప్రేరణను ఎడ్రినాల్ గ్రంథులు  ఉత్పత్తి చేసే హర్మోనుల ద్వారా రక్షణకు తోడ్పడుతున్నాయి. 

By Bolleddu Sarath Chandra
Dec 13, 2024

Hindustan Times
Telugu

ఎడ్రినాల్ గ్రంథులు ఎడ్రినలైన్, నోర్‌ఫైన్‌ఫ్రైన్, కార్టిజాల్‌ అనే మూడు స్ట్రెస్ హార్మోనులను ఉత్పత్తి చేస్తాయి.

ప్రమాదం, సమస్య ఎదురైనపుడు ఎడ్రినలైన్ హార్మోను ప్రమాదాన్ని ఎదుర్కోడానికి, ప్రమాదం నుంచి తప్పించుకోడానికి కావాల్సిన శక్తిని సమకూరుస్తుంది. 

నోర్‌పైన్‌ఫ్రైన్‌ ఆ సమయంలో మనిషి స్థిమితంగా ఉండటానికి కావాల్సిన శక్తిని సమకూరుస్తుంది. 

కార్టిజాల్‌ హార్మోను శరీర అవసరాలను తగ్గించి పూర్తి శక్తిని ప్రమాదం నుంచి బయటపడటానికి శక్తిని కేటాయించేలా దోహదం చేస్తుంది. 

ప్రమాదం తొలగిన మరుక్షణం స్ట్రెస్‌ ఫ్రీ స్థితి పొందడం గ్రహించవచ్చు 

ప్రస్తుతం మనుషులకు కూృర మృగాల నుంచి మనుషులకు ముప్పులేకున్నా స్ట్రెస్‌ మాత్రం నిరంతరం వెంటాడుతోంది.

నిర్ణీత వ్యవధిలో పని పూర్తి చేయాలనుకోవడం, దాని గురించి ఒత్తిడికి గురి కావడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. 

స్ట్రెస్ ఫ్రీ స్థితికి చేరుకోవడాన్ని అలవాటు చేసుకోవడం ఆరోగ్య సంరక్షణలో అతిముఖ్యం. దీర్ఘకాలిక స్ట్రెస్ విషప్రాయమైన స్ట్రెస్ ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తుంది. 

స్ట్రెస్‌ వల్ల శరీరం అంతులేని అలసటకు గురవుతుంది. స్ట్రెస్‌ వల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది.  స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ పరిశోధనల్లో 95శాతం వ్యాధులు స్ట్రెస్‌, అలసట వల్ల కలుగుతున్నట్టు గుర్తించారు. 

స్ట్రెస్‌ను మనిషి అదుపు చేసుకోలేకపోతే అది మనిషి అదుపు చేసే స్థాయికి చేరుకుంటుంది. దీని కోసం మొదట టైమ్‌ ప్రెషర్ తగ్గించుకోవాలి. 

డెడ్‌లైన్‌  సమస్యను అధిగమించడానికి ప్రణాళిక బద్దంగా పనిచేయడం అలవాటు చేసుకోవాలి.సమయపాలనతో స్ట్రెస్‌ను అధిగమించవచ్చు. 

స్ట్రెస్‌ను ప్రభావితం చేసే అంశాల్లో ఆహార అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి.  భోజనంలో వినియోగించే తీపి పదార్ధాలు స్ట్రెస్ ను అధికం చేస్తాయి.

దీర్ఘకాలిక స్ట్రెస్ వల్ల ఎడ్రినాల్‌ హార్మోన్ కార్టిజాల్‌ హార్మోను ఉత్పత్తిని కోల్పోతుంది. 

నిద్ర అలసటను తీర్చే శక్తిని సమకూర్చే దివ్యమైన ఔషధం, ఎడ్రినాల్ ఫ్యాటిగ్‌కు గురైన వారు ఎంతసేపు నిద్రించినా  తీరని అలసటకు గురవుతారు. 

ఎడ్రినాల్ ఫ్యాటిగ్‌  వ్యాధి వల్ల స్ట్రెస్‌ను అదుపు చేయలేని స్థితికి శరీరం చేరుతుంది. 

మానవ శరీరం అద్భుతమైన యంత్రం, వ్యాధులు బారిన  పడినపుడు తనకు తానే ఆరోగ్యం చేకూర్చుకునే స్థితి శరీరానికి ఉంటుంది. స్ట్రెస్‌ను నియంత్రించుకోవడంతో శరీరానికి  స్వస్థత చేకూర్చవచ్చు.

విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలు చలికాలంలో పిల్లలకు అత్యంత అవసరం.

Image Source From unsplash