Samantha on Weight: తాను బరువు ఎందుకు పెరగడం లేదో చెప్పిన సమంత.. ఏ డైట్ పాటిస్తున్నారంటే..-samantha ruth prabhu reveals why she is not gaining weight and talks about anti inflammatory diet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Samantha On Weight: తాను బరువు ఎందుకు పెరగడం లేదో చెప్పిన సమంత.. ఏ డైట్ పాటిస్తున్నారంటే..

Samantha on Weight: తాను బరువు ఎందుకు పెరగడం లేదో చెప్పిన సమంత.. ఏ డైట్ పాటిస్తున్నారంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 05, 2024 02:00 PM IST

Samantha on Weight: ఇన్‍స్టాగ్రామ్‍లో తాజాగా కొన్ని ప్రశ్నలకు స్పందించారు హీరోయిన్ సమంత. ఈ క్రమంలో తన బరువుపై వచ్చిన ఓ క్వశ్చన్‍కు ఆమె స్పందించారు. బరువు పెరగకుండా తాను పాటిస్తున్న డైట్ ఏదో వెల్లడించారు.

Samantha on Weight: తాను బరువు ఎందుకు పెరగడం లేదో చెప్పిన సమంత.. ఏ డైట్ పాటిస్తున్నారంటే..
Samantha on Weight: తాను బరువు ఎందుకు పెరగడం లేదో చెప్పిన సమంత.. ఏ డైట్ పాటిస్తున్నారంటే..

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు సుమారు ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. మయోసైటిస్‍కు చికిత్స తీసుకున్నారు. మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. సమంత ప్రధాన పాత్ర పోషించిన సిటాడెల్ హనీబన్నీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. నవంబర్ 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు రానుంది. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రమోషన్లలో సమంత బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఇన్‍స్టాగ్రామ్‍లో తాజాగా ఆస్క్ మీ ఎనీథింగ్ అంటూ ప్రశ్నలు అడగాలని నెటిజన్లను సామ్ అడిగారు. బరువు పెరగాలంటూ ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమంత స్పందించారు.

అందుకే బరువు పెరగడం లేదు

కాస్త బరువు పెరిగి.. బొద్దుగా కావాలని సమంతపై ఓ నెటిజన్ కామెంట్ చేశారు. దీంతో ఆమె రెస్పాండ్ అయ్యారు. తన ఆరోగ్య పరిస్థితి వల్ల తాను ప్రస్తుతం యాంటీ-ఇన్‍ఫ్లమేటరీ డైట్‍ను కఠినంగా పాటిస్తున్నానని అందుకే బరువు పెరగడం లేదని తెలిపారు.

ప్రస్తుత పరిస్థితికి తన బరువు సరిగా ఉందని సమంత చెప్పారు. ఎవరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఉండనివ్వాలని సమంత పేర్కొన్నారు. “మరోసారి నా బరువుపై కామెంట్ వచ్చింది. ప్రస్తుత నా పరిస్థితికి అవసరమైన యాంటీ-ఇన్‍ఫ్లమేటరీ డైట్‍ను నేను స్ట్రిక్ట్‌గా పాటిస్తున్నా. ఇది మీ అందరికీ తెలియాలి. అదే నేను బరువు పెరగకుండా చేస్తుంది. నా పరిస్థితికి సరైన బరువు ఉండేలా అది చేస్తోంది. జనాలను జడ్జ్ చేయడం మానేయండి. ఎవరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండనివ్వండి. మీరు అలా జీవించండి.. జీవించనివ్వండి. ప్లీజ్ గాయ్స్.. ఇది 2024” అని సమంత వీడియోలో చెప్పారు.

యాంటీ-ఇన్‍ఫ్లమేటరీ డైట్‍లో ఈ ఫుడ్స్

యాంటీ-ఇన్‍ఫ్లమేటరీ డైట్‍లో యాంటీఆక్సిడెంట్లు, హెల్దీ ఫ్యాట్స్, ఒమేగా-3 యాసిడ్స్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలు ఎక్కువగా ఉంటాయి. పండ్లు, కూరగాయాలు, పాలకూర, కేల్, నట్స్, సీడ్స్, ఫ్యాటీ చేపలు లాంటి ఫుడ్స్ ఈ డైట్‍లో ఉంటాయి. ఈ డైట్ వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి.

యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఫ్రీరాడికల్స్ నుంచి కణాలు డ్యామేజ్ అవడాన్ని తగ్గిస్తాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్ బెర్రీలు లాంటి బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సీ, విటమిన్ ఈ, ఫ్లేవనాయిడ్స్, పైథోకెమెకిల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్‍ఫ్లమేషన్‍ను తగ్గిస్తాయి. ఆకుకూరలు, సాల్మోన్, తునా లాంటి చేపలు, వాల్‍నట్స్, పసుపులోనూ యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. క్యారెట్లు, టమాటోల్లో కరోటనాయిడ్ పిగ్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ యాంటీ-ఇన్‍ఫ్లమేటర్ డైట్‍లో ఉంటాయి. ఈ డైట్ పాటిస్తే ఆరోగ్యానికి చాలా మేలు.

Whats_app_banner