శరీరంలో రోగ నిరోధకశక్తి మెరుగ్గా ఉండడం, కణాలు డ్యామేజ్ అవకుండా ఉండేందుకు యాంటీఆక్సిడెంట్లు తోడ్పడతాయి. ఇవి చాలా ముఖ్యం. యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే 6 రకాల ఆహారాలు ఇవి.
Photo: Pexels
బాదం, ఆక్రోటు, పిస్తాలు లాంటి నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఈ సహా చాలా పోషకాలు ఉంటాయి. ఇవి రెగ్యులర్‌గా తింటే ఓవరాల్ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
Photo: Pexels
పాలకూర, కేల్, తోటకూర లాంటి ఆకుకూరల్లో బీటా కరోటిన్, విటమిన్ సీ, ఈ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. శరీరంలో మంటను తగ్గిస్తాయి.
Photo: Pexels
బ్లూబెర్రీ, రాస్ప్ బెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లాక్‍బెర్రీల్లో ఫ్లేవనాయిడ్స్, ఆంథోసియానిన్స్, విటమిన్ సీ లాంటి యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్‍ను తగ్గించడటంలో తోడ్పడటంతో పాటు రోగ నిరోధకశక్తి పెరిగేలా ఇవి చేయగలవు.
Photo: Pexels
గ్రీన్ టీలో కేట్‍చిన్స్ అనే యాంటీఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటుంది. గ్రీన్ టీ తాగడం వల్ల మెదడు పనితీరు మెరుగవడం, కొవ్వు తగ్గడం సహా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
Photo: Pexels
నారింజ, చీని, నిమ్మ లాంటి సిట్రస్ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. విటమిన్ సీ ఎక్కువగా కలిసి ఉంటుంది. సిట్రస్ పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.
Photo: Pexels
టమాటాల్లో లికోపిన్ అనే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. గుండె ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. రోగ నిరోధకశక్తిని మెరుగుపరచగలదు.
Photo: Pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి