Samantha: “నేను నిఘా వేసి ఉండాల్సింది”: సమంత.. నాగచైతన్య గురించే అంటున్న నెటిజన్లు
Samantha Ruth Prabhu: సమంత ప్రస్తుతం సిటాడెల్: హనీబన్నీ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. దీంతో ఆమె తన మాజీ భర్త నాగచైతన్య గురించే అలా అన్నారంటూ కొందరు నెటిజన్లు అంటున్నారు.

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలు పోషించిన సిటాడెల్: హనీబన్నీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు రెడీ అవుతోంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ నవంబర్ 7వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ తరుణంలో ఈ సిరీస్ ప్రమోషన్లలో సమంత పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజయ్యారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ఓ కామెంట్ ఇంట్రెస్టింగ్‍గా మారింది. తన మాజీ భర్త నాగచైతన్య విషయంలోనే సమంత అలా అన్నారంటూ వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇవే..
నిఘా వేయాల్సింది
సిటాడెల్: హనీబన్నీ సిరీస్‍లో స్పై ఏజెంట్‍గా సమంత నటించారు. దీంతో నిజజీవితంలోనూ ఎప్పుడైనా స్పై లాగా ఎవరిపై అయినా నిఘా వేసి ఉండాల్సిందనిపిస్తుందా అనే ప్రశ్న ఎదురైంది. దీని సమంత స్పందించారు. స్పై చేసి ఉండాల్సిందని అన్నారు.
స్పై కావాలని జీవితంలో ఎప్పుడైనా అనిపించిందా అనే ప్రశ్న ముందుగా సమంతకు ఎదురైంది. “నేను స్పై కావాలని అనుకోలేదు. ఎందుకంటే ఆ లక్షణాలు నాలో ఏ మాత్రం లేవు” అని ఆమె అన్నారు. అయితే, నిజజీవితంలో ఎవరిపై అయినా నిఘా వేసి ఉండాల్సిందని అనిపించిందా అని మరో క్వశ్చన్ వచ్చింది. “ఆలోచిస్తే.. నిఘా వేసి ఉండాల్సిందనిపిస్తుంది” అని సమంత చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో రెడిట్‍లో వైరల్ అవుతోంది.
నాగచైతన్య గురించే అంటూ..
నిఘా వేసి ఉండాల్సింది అని తన మాజీ భర్త నాగచైతన్య గురించే సమంత అన్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చైతూ తనను కొన్ని విషయాల్లో మోసం చేశాడని సమంత అనుకుంటున్నారని, ఆ దిశగా ఆమె ఇప్పటికే చాలా హింట్స్ ఇచ్చారని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. అతడిపైనే నిఘా వేసి ఉండాల్సిందని పరోక్షంగా సామ్ చెప్పారని అభిప్రాయపడుతున్నారు. విడాకుల విషయంలో సమంతను ఇప్పటికీ కొందరు తప్పుబడుతున్నారని, అది సరి కాదని కామెంట్లు చేస్తున్నారు.
చైతూ, సమంత బంధం ఇలా..
నాగచైతన్య, సమంత కలిసి నాలుగు చిత్రాల్లో నటించారు. పెళ్లికి ముందు ఏం మాయ చేశావే, మనం, ఆటో నగర్ సూర్య చిత్రాల్లో జంటగా యాక్ట్ చేశారు. ఈ క్రమంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి తర్వాత మజిలీ మూవీలోనూ వీరిద్దరూ జోడీగా నటించారు. కొన్నేళ్ల ప్రేమ తర్వాత 2017 అక్టోబర్‌లో సమంత, నాగచైతన్య పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అన్యూన్యంగా ఉన్నారు. అయితే, నాలుగేళ్ల వివాహ బంధం తర్వాత 2021లో వీరి విడాకులు తీసుకున్నారు. పరస్పర అంగీకారంతో విడిపోయారు. నాగచైతన్య, సమంత విడాకుల అంశం నాలుగేళ్లయినా ఇంకా హాట్ టాపిక్‍గానే ఉంది.
త్వరలో శిభితాతో చైతూ పెళ్లి
నాగచైతన్య త్వరలో హీరోయిన్ శోభితా ధూళిపాళ్లను వివాహం చేసుకోనున్నారు. ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన చైతూ, శోభితా నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్‌లో వీరి పెళ్లి జరగనుందని తెలుస్తోంది. అయితే, తేదీ విషయంలో అధికారిక సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.
మయోసైటిస్ కారణంగా సుమారు ఏడాదిగా సినిమాలకు సమంత దూరంగా ఉంటున్నారు. ఇప్పడిప్పుడే మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. తన సొంత బ్యానర్‌పై మా ఇంటి బంగారం మూవీని సామ్ ప్రకటించారు. అలాగే, మరో వెబ్ సిరీస్‍కు కూడా ఓకే చెప్పారు.