Bigg Boss Voting: ఓటింగ్‌లో అనూహ్య మార్పులు- వేర్వేరుగా బిగ్ బాస్ విన్నర్- యూట్యూబ్‌లో ఒకలా, మిగతా సోషల్ మీడియాలో మరోలా!-bigg boss telugu 8 winner voting results different in youtube and other social media bigg boss winner is gautham nikhil ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Voting: ఓటింగ్‌లో అనూహ్య మార్పులు- వేర్వేరుగా బిగ్ బాస్ విన్నర్- యూట్యూబ్‌లో ఒకలా, మిగతా సోషల్ మీడియాలో మరోలా!

Bigg Boss Voting: ఓటింగ్‌లో అనూహ్య మార్పులు- వేర్వేరుగా బిగ్ బాస్ విన్నర్- యూట్యూబ్‌లో ఒకలా, మిగతా సోషల్ మీడియాలో మరోలా!

Sanjiv Kumar HT Telugu
Dec 14, 2024 06:34 AM IST

Bigg Boss Telugu 8 Winner Voting Results Today: బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ఓటింగ్ ఫలితాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. టాప్ 2 ఫైనలిస్ట్స్‌కు ఒక్కసారిగా ఓటింగ్ పెరగ్గా వారిలో ఎవరు విజేత అనేది పెద్ద కన్ఫ్యూజన్‌గా మారింది. ఎందుకంటే యూట్యూబ్, మిగతా సోషల్ మీడియాలో వేర్వేరుగా ఫలితాలు ఉన్నాయి.

ఓటింగ్‌లో అనూహ్య మార్పులు- వేర్వేరుగా బిగ్ బాస్ విన్నర్- యూట్యూబ్‌లో ఒకలా, మిగతా సోషల్ మీడియాలో మరోలా!
ఓటింగ్‌లో అనూహ్య మార్పులు- వేర్వేరుగా బిగ్ బాస్ విన్నర్- యూట్యూబ్‌లో ఒకలా, మిగతా సోషల్ మీడియాలో మరోలా!

Bigg Boss 8 Telugu Winner Voting Results: సెప్టెంబర్ 1న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌కు రేపటితో (డిసెంబర్ 15) ఎండ్ కార్డ్ పడనుంది. బిగ్ బాస్ 8 తెలుగు ఇన్ఫినిటీ ఫినాలే నిర్వహించి విజేత ఎవరు అనేది ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ఎవరు అనేది చాలా ఆసక్తిగా మారింది.

బిగ్ బాస్ విన్నర్ ఓటింగ్ పోల్స్

అయితే, బిగ్ బాస్ 8 తెలుగు టాప్ 5 ఫైనలిస్ట్స్‌గా అవినాష్, నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్ నిలిచిన విషయం తెలిసిందే. వీరి ఐదుగురు మధ్య బిగ్ బాస్ విన్నర్ ఓటింగ్ పోల్స్ జరిగాయి. ఇందులో టాప్ 2లో ఎప్పుడు గౌతమ్, నిఖిల్ మాత్రమే వస్తున్నారు. మిగతా ఫైనలిస్ట్స్‌ల స్థానాల్లో మార్పులు లేవు గానీ, స్థానాలు మాత్రం అలాగే ఉన్నాయి.

భారీగా పెరిగిన ఓటింగ్

అయితే, బిగ్ బాస్ ఓటింగ్ ఆఖరు రోజు వచ్చేసరికి అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. టాప్ 2 కంటెస్టెంట్స్‌కు ఓటింగ్ విపరీతంగా పెరగ్గా.. బాటమ్ 3 ఫైనలిస్ట్స్‌కు ఓట్లు తగ్గాయి. అలాగే, బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనేది వేర్వేరుగా ఫలితాలు చూపిస్తున్నాయి. యూట్యూబ్‌లో ఒకరు విజేత అని పోల్స్ చెబుతుంటే.. ఇన్‌స్టా గ్రామ్ వంటి మిగతా సోషల్ మీడియాలో మరొకరు విన్నర్ అని చూపిస్తున్నాయి.

టాప్ 2లో ఆ ఇద్దరే

బిగ్ బాస్ తెలుగు 8 ఫైనల్ డే ఓటింగ్ ఫలితాలు చూస్తే.. 2,80,850 ఓట్లు, 45 శాతం ఓటింగ్‌తో గౌతమ్ టాప్‌లో ఉన్నాడు. ఈసారి గౌతమ్ ఓటింగ్ ఒక్కరోజులో విపరీతంగా పెరిగిపోయింది. ఇక రెండో స్థానంలో ఉన్న నిఖిల్‌కు 1,85,847 ఓట్లు, 30 శాతం ఓటింగ్ పడింది. అయితే, ఇదివరకు వీరిద్దరికి ఓట్లల్లో తేడా ఉండేది. కానీ, ఓటింగ్ చివరి రోజు వచ్చేసరికి ఓటింగ్‌లో కూడా 15 శాతం తేడా వచ్చేసింది.

6 లక్షల మంది ఓటింగ్

అలాగే, ఇప్పటివరకు వేలల్లో ఓట్లు పడితే ఆఖరు రోజున లక్షల్లో పడ్డాయి. ఇక మూడో స్థానంలో నబీల్ (87,380 ఓట్లు, 14 శాతం ఓటింగ్), టాప్ 4లో ప్రేరణ (43,729 ఓట్లు, 7 శాతం ఓటింగ్), చివరి స్థానం టాప్ 5లో అవినాష్ (21,926 ఓట్లు, 4 శాతం ఓటింగ్) నిలిచారు. ఈ ఓటింగ్ పోల్‌లో మొత్తంగా 6,19,732 మంది ఓట్లు వేసినట్లుగా సమాచారం.

యూట్యూబ్, సోషల్ మీడియాలో వేర్వేరుగా

అయితే, ఓటింగ్ పోల్స్ అన్ని వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లలో జరుగుతున్నాయి. యూట్యూబ్ ఓటింగ్ పోల్స్‌లలో నిఖిల్ (5 లక్షల ఓట్లు) విజేతగా ఎక్కువగా ఓట్లు పడుతుంటే.. ఇన్‌స్టా గ్రామ్ వంటి వివిధ సోషల్ మీడియాలో గౌతమ్ (సుమారు 5 లక్షల ఓట్లు) విన్నర్ అంటూ ఇద్దరికీ ఒకేరకమైన ఓటింగ్ నమోదు అవుతోంది. ఇలా ఈసారి విన్నర్ ఎవరు అనేది కన్ఫ్యూజన్‌గా మారింది.

చివరి వరకు

గ్రాండ్ ఫినాలే రోజు అధికారిక ఓట్లతో బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ఎవరు అనేది హోస్ట్ నాగార్జున చెప్పేవరకు దీంట్లో క్లారిటీ వచ్చేలా లేదు. బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ టైటిల్ ట్రోఫీని ఎవరు ఎత్తుకుంటారో అనేది చివరి వరకు క్యూరియాసిటీగా మారింది.

Whats_app_banner