Bigg Boss Voting: బిగ్ బాస్ ఓటింగ్‌లో మారిన స్థానాలు- ఇవాళే ఆఖరు రోజు- రెండ్రోజుల్లో తెలియనున్న టైటిల్ విన్నర్!
Bigg Boss Telugu 8 Winner Voting Results Today: బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ఎవరో గెలిపించేందుకు వేయాల్సిన ఓటింగ్ ఇవాళ్టితో ముగియనుంది. డిసెంబర్ 13 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు మాత్రమే బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ఓటింగ్ పోల్స్ ఓపెన్‌గా ఉండనున్నాయి.
Bigg Boss 8 Telugu Winner Voting Results: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ మరో రెండు రోజుల్లో ముగియనుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో టాప్ 5 ఫైనలిస్ట్‌ల బిగ్ బాస్ జర్నీ వీడియోలను చూపిస్తున్నారు. బిగ్ బాస్ 8 తెలుగు డిసెంబర్ 12 ఎపిసోడ్‌లో గౌతమ్ కృష్ణ, జబర్దస్త్ అవినాష్ ఏవీలు చూపించారు.
గౌతమ్, అవినాష్ జర్నీ
గౌతమ్‌కు ఒక రేంజ్‌లో ఎలివేషన్ ఇస్తూ అతని బిగ్ బాస్ జర్నీని చూపించారు. దాదాపు అరగంటపాటు గౌతమ్ బిగ్ బాస్ జర్నీ వీడియోను ప్లే చేశారు. అనంతరం అవినాష్ బిగ్ బాస్ జర్నీని చూపించారు. అవినాష్ కేవలం కమెడియన్ మాత్రమే కాదు అన్నింట్లో ముందున్న ఎంటర్‌టైనర్ అంటూ బిగ్ బాస్ అవినాష్‌ను పొగిడాడు.
ఇక బిగ్ బాస్ తెలుగు 8 డిసెంబర్ 13 ఎపిసోడ్‌లో ప్రేరణ, నబీల్ జర్నీ వీడియోలను ప్రసారం చేయనున్నారు. ఇదిలా ఉంటే, డిసెంబర్ 15న బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. బిగ్ బాస్ 8 తెలుగు ఇన్ఫినిటీ ఫినాలే పేరుతో ఈవెంట్ నిర్వహించి టైటిల్ విజేతను ప్రకటించనున్నారు. అయితే, బిగ్ బాస్ విన్నర్‌ను గెలిపించుకునేందుకు వేయాల్సిన ఓటింగ్ పోల్స్ ఇవాళ్టితో ముగియనున్నాయి.
టాప్ 1లో గౌతమ్
డిసెంబర్ 13 అర్థరాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు బిగ్ బాస్ ఓటింగ్ వేసేందుకు అవకాశం ఉంది. అలాగే, తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్‌కు కేటాయించిన ఫోన్ నెంబర్స్‌కి కాల్ చేసి ఓట్ వేసేందుకు కూడా ఇదే చివరి రోజు. ఇక ఈ బిగ్ బాస్ ఓటింగ్‌లో మళ్లీ స్థానాలు మారిపోయాయి. టాప్ 2 స్థానాలు తరచుగా మారుతూ వస్తున్నాయి. మళ్లీ ఇప్పుడు టాప్ 1 స్థానంలో గౌతమ్ నిలిచాడు.
34 శాతం ఓటింగ్, 63,806 ఓట్లతో గౌతమ్ టాప్ 1 స్థానంలో ఉన్నాడు. తర్వాత అదే 34 శాతం ఓటింగ్‌తో రెండో స్థానంలో నిఖిల్ ఉన్నాడు. అయితే, నిఖిల్‌కు 63,370 ఓట్లు పడ్డాయి. ఇద్దరికి ఓట్ల మధ్య స్వల్ప తేడా మాత్రమే వస్తుంది. కానీ, ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం ఒకేలా ఉంటుంది. వీకెండ్ వచ్చేసరికి వీరి ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తోంది. కానీ, ఇద్దరి స్థానాలు మారుతూ వస్తున్నాయి.
ఓటింగ్‌లో మార్పులు
ఇక మూడో స్థానంలో 33,606 ఓట్లు, 18 శాతం ఓటింగ్‌తో నబీల్ ఉండగా.. ప్రేరణ 19,061 ఓట్లు, 10 శాతం ఓటింగ్‌తో టాప్ 4లోకి వచ్చింది. ఇక మొదటి ఫైనలిస్ట్ అయిన అవినాష్ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. జబర్దస్త్ అవినాష్‌కు 9,201 ఓట్లు, 5 శాతం ఓటింగ్ నమోదు అవుతోంది. టాప్ 2 స్థానాల్లో మార్పులు తప్పా మిగతా వారి ప్లేసుల్లో ఎలాంటి మార్పు లేదు. కానీ, ఓటింగ్, ఓట్లు మాత్రం మారుతూ వస్తున్నాయి.
ఈ లెక్కన బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ టాప్ 2 కంటెస్టెంట్స్‌లో ఉండనున్నారు. అంటే, ఈ సీజన్‌కు విజేతగా గౌతమ్ లేదా నిఖిల్‌లో ఒక్కరు నిలవనున్నారు. వీరిద్దరి మధ్యలోనే గట్టి పోటీ నెలకొంది. ఎవరు విజేత అయ్యే అవకాశం ఉందనేది అంచనా వేయరాకుండా ఉంది. అలాగే, వీరిద్దరికి సంబంధించిన అధికారిక ఓటింగ్‌ను బయటకురాదు.
బిగ్ బాస్ విన్నర్?
డైరెక్ట్ విన్నర్‌ను ప్రకటించే సమయంలోనే ఎవరికి ఎంత ఓటింగ్ వచ్చిందనేది హోస్ట్ నాగార్జున చెప్పే అవకాశం ఉంది. కాబట్టి బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ఎవరు అనేది మాత్రం తెలియాలంటే గ్రాండ్ ఫినాలే వరకు ఆగాల్సిందే.
టాపిక్