Vishwak Sen Anudeep KV: జాతి రత్నాలు డైరెక్టర్‌తో విశ్వక్ సేన్ మూవీ.. విచిత్రంగా టైటిల్.. ప్రారంభించిన నాగ్ అశ్విన్-vishwak sen movie with director anudeep kv titled as funky pooja ceremony funky launch by director nag ashwin ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwak Sen Anudeep Kv: జాతి రత్నాలు డైరెక్టర్‌తో విశ్వక్ సేన్ మూవీ.. విచిత్రంగా టైటిల్.. ప్రారంభించిన నాగ్ అశ్విన్

Vishwak Sen Anudeep KV: జాతి రత్నాలు డైరెక్టర్‌తో విశ్వక్ సేన్ మూవీ.. విచిత్రంగా టైటిల్.. ప్రారంభించిన నాగ్ అశ్విన్

Sanjiv Kumar HT Telugu
Dec 11, 2024 03:17 PM IST

Vishwak Sen Anudeep KV Funky Movie Pooja Ceremony: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన కొత్త సినిమాను జాతి రత్నాలు డైరెక్టర్ కేవీ అనుదీప్‌తో చేస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఫంకీ అనే విచిత్రమైన టైటిల్ పెట్టారు. తాజాగా పూజా కార్యక్రమాలతో ఫంకీ మూవీని ప్రారంభించారు.

జాతి రత్నాలు డైరెక్టర్‌తో విశ్వక్ సేన్ మూవీ.. విచిత్రంగా టైటిల్.. ప్రారంభించిన నాగ్ అశ్విన్
జాతి రత్నాలు డైరెక్టర్‌తో విశ్వక్ సేన్ మూవీ.. విచిత్రంగా టైటిల్.. ప్రారంభించిన నాగ్ అశ్విన్

Vishwak Sen Anudeep KV Funky Movie Launch: వైవిధ్యమైన కథలు, పాత్రలతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవల మెకానిక్ రాకీ మూవీతో అలరించాడు. ఇప్పుడు విశ్వక్ సేన్ మరో కొత్త సినిమాతో బిజీ కానున్నాడు.

ఆసక్తికర టైటిల్

విశ్వక్ సేన్ హీరోగా చేస్తున్న తర్వాతి సినిమా కోసం బ్లాక్ బస్టర్ దర్శకుడు అనుదీప్ కేవీతో చేతులు కలిపారు. జాతి రత్నాలు వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాన్ని అందించిన దర్శకుడు కేవీ అనుదీప్‌తో విశ్వక్ సేన్ పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీని చేస్తున్నాడు. ఈ చిత్రానికి 'ఫంకీ' అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేశారు.

సూర్య దేవర నాగవంశీ నిర్మాణం

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ ఫంకీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. విచిత్రమైన టైటిల్‌తో వస్తోన్న ఫంకీ మూవీని పూజా కార్యక్రమాలతో ఈరోజు (డిసెంబర్ 11) హైదరాబాద్‌లో ప్రారంబించారు.

క్లాప్ కొట్టిన నాగ్ అశ్విన్

నటీనటులు, సాంకేతిక బృందం సమక్షంలో ఫంకీ మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. కల్కి 2898 ఏడీ దర్శకుడు నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టగా, దర్శకుడు కళ్యాణ్ శంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాత ఎస్. నాగవంశీ స్క్రిప్ట్‌ను చిత్రబృందానికి అందజేశారు.

మంచి కుటుంబ కథా చిత్రంగా

ఈ సందర్భంగా విడుదల చేసిన ఫంకీ ప్రత్యేక పోస్టర్ ఆకట్టుకుంటోంది. ప్రేమ గుర్తులతో, చూడగానే అందరి దృష్టిని ఆకర్షించేలా ఫంకీ టైటిల్‌ను డిజైన్ చేసిన తీరు బాగుంది. ఆ టైటిల్ డిజైన్‌తో పాటు, పోస్టర్ మీద రాసి ఉన్న 'ఫ్యామిలీ ఎంటర్‌టైనర్' అనే పదాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫంకీ సినిమా ప్రేమ, వినోదంతో కూడిన ఓ మంచి కుటుంబ కథా చిత్రమనే భావన పోస్టర్ చూస్తే కలుగుతోంది.

అంచనాలకు తగినట్లుగా

విశ్వక్ సేన్, అనుదీప్ కలయికపై ఉండే అంచనాలకు తగ్గట్టుగా, ఫంకీ చిత్రం పూర్తిస్థాయిలో ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని నిర్మాతలు హామీ ఇచ్చారు. వినోదాన్ని పంచడంలో దర్శకుడు అనుదీప్‌ది విభిన్న శైలి. అలాంటి అనుదీప్‌కి ప్రతిభగల నటుడు విశ్వక్ సేన్ తోడయ్యారు.

కడుపుబ్బా నవ్వించేలా

ఈ ఇద్దరు కలిసి చిన్న పెద్ద అనే లేకుండా అన్ని వయసుల ప్రేక్షకులు మనస్ఫూర్తిగా కడుపుబ్బా నవ్వుకునే చిత్రాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు సురేష్ సారంగం కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

టాప్ మ్యూజిక్ డైరెక్టర్

'టిల్లు స్క్వేర్', 'మ్యాడ్' చిత్రాలతో తన సంగీతంతో ఆకట్టుకొని, ప్రస్తుతం 'మాస్ జాతర', 'మ్యాడ్ స్క్వేర్' వంటి అద్భుతమైన సినిమాలకు పని చేస్తున్న సంచలన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఫంకీ మూవీకి సంగీతం అందిస్తున్నారు. 2025 సంక్రాంతి తర్వాత ఫంకీ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Whats_app_banner