Bigg Boss Allu Arjun: బిగ్ బాస్ ఇన్ఫినిటీ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్- విన్నర్‌కు ట్రోఫీ అందజేయనున్న బన్నీ!-allu arjun chief guest to bigg boss telugu 8 infinity finale to give trophy to bigg boss 8 telugu winner over pushpa 2 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Allu Arjun: బిగ్ బాస్ ఇన్ఫినిటీ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్- విన్నర్‌కు ట్రోఫీ అందజేయనున్న బన్నీ!

Bigg Boss Allu Arjun: బిగ్ బాస్ ఇన్ఫినిటీ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్- విన్నర్‌కు ట్రోఫీ అందజేయనున్న బన్నీ!

Sanjiv Kumar HT Telugu
Dec 12, 2024 07:02 AM IST

Allu Arjun Chief Guest To Bigg Boss Telugu 8 Infinity Finale: ఈసారి బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే కాకుంగా బిగ్ బాస్ తెలుగు 8 ఇన్ఫినిటీ ఫినాలే పేరుతో నిర్వహించనున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ రానున్నారని టాక్ నడుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..!

బిగ్ బాస్ ఇన్ఫినిటీ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్- విన్నర్‌కు ట్రోఫీ అందజేయనున్న బన్నీ!
బిగ్ బాస్ ఇన్ఫినిటీ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్- విన్నర్‌కు ట్రోఫీ అందజేయనున్న బన్నీ!

Allu Arjun Chief Guest To Bigg Boss Telugu 8 Grand Finale: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ చివరి ఘట్టానికి చేరుకుంది. బిగ్ బాస్ 8 తెలుగు ముగిసిపోడానికి ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఐదుగురు టాప్ 5 ఫైనలిస్ట్ కంటెస్టెంట్స్ ఉన్నారు.

yearly horoscope entry point

టాప్ 5 ఫైనలిస్ట్స్

వారిలో బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఉన్న నిఖిల్, నబీల్, ప్రేరణ ఉండగా.. అక్టోబర్ 6న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టిన గౌతమ్, అవినాష్ ఉన్నారు. వీరిలో మొదటి ఫైనలిస్ట్‌గా అవినాష్ అయితే.. రెండో ఫైనలిస్ట్‌గా నిఖిల్, మూడో ఫైనలిస్ట్‌గా గౌతమ్, నాలుగు, ఐదు స్థానాల్లో ప్రేరణ, నబీల్ ఉన్నారు.

టాప్ 2లో ఆ ఇద్దరే

ఇక వీరిలో బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఎవరు అనేదానిపై ఓటింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ విన్నర్ ఓటింగ్‌లో టాప్ 2 స్థానాల్లో గౌతమ్, నిఖిల్ ఉంటూ వస్తున్నారు. ఈ ఇద్దరిలోనే ఓటింగ్ శాతంలో మార్పులు లేవు కానీ, ఓట్లల్లో స్వల్ప తేడాలు ఉంటున్నాయి. కాబట్టి, విజేత ఎవరు అనేది చివరి వరకు ఆసక్తిగా మారింది.

హోస్ట్ చేతులమీదుగానే

ఇక ప్రతి సీజన్‌ విన్నర్‌కు ప్రముఖ సెలబ్రిటీని పిలిపించి బిగ్ బాస్ ట్రోఫీని అందజేస్తారన్న విషయం తెలిసిందే. అయితే, గత సీజన్ బిగ్ బాస్ తెలుగు 7కి మాత్రం హోస్ట్ నాగార్జుననే విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు ట్రోఫీ అందజేశారు. అంతకుముందుకు చిరంజీవి వంటి స్టార్ సెలబ్రిటీలు వచ్చి బిగ్ బాస్ విజేతకు టైటిల్ ట్రోఫీని అందజేశారు.

చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్

అయితే, బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్‌కు ట్రోఫీ అందజేయడానికి చీఫ్ గెస్ట్‌గా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్‌ రానున్నారని సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. పుష్ప 2 ది రూల్ మూవీ బాక్సాఫీస్ వద్ద వరల్డ్‌వైడ్‌గా వైల్డ్ ఫైర్ క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో పుష్ప రాజ్ వైల్డ్ ఫైర్‌‌తో బిగ్ బాస్ 8 తెలుగు సీజన్‌కు ముగింపు పలకనున్నారని సమాచారం.

బిగ్ బాస్ తెలుగు 8 ఇన్ఫినిటీ ఫినాలే

అయితే, ఇందులో ఎంతవరకు నిజముందో తెలియరాలేదు. కానీ, డిసెంబర్ 15న నిర్వహించే బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్‌ను తీసుకువచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయని, ఇది బిగ్ బాస్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం అని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా ప్రతి సీజన్‌ను గ్రాండ్ ఫినాలే అనే టైటిల్‌తో నిర్వహించేవారు.. కానీ, ఈ సారి ఇన్ఫినిటీ ఫినాలే అనే పేరుతో చేయనున్నారని సమాచారం.

వైల్డ్ ఫైర్‌తో ముగింపు

ఈ బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ అంతా అన్‌లిమిటెడ్ ట్విస్టులు, అన్‌లిమిటెడ్ ఫన్ అని మొదటి నుంచి నాగార్జున చెబుతున్న విషయం తెలిసిందే. అందుకే గ్రాండ్ ఫినాలేను కూడా బిగ్ బాస్ తెలుగు 8 ఇన్ఫినిటీ ఫినాలే టైటిల్‌తో నిర్వహించనున్నారట. 

బిగ్ బాస్ 8 తెలుగు ఇన్ఫినిటీ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్ వచ్చి విజేతకు ట్రోఫీ అందజేయనున్నాడని, పుష్ప రాజ్ వైల్డ్ ఫైర్‌తో సీజన్‌కు ముగింపు పలకనున్నారని టాక్. ఇక బిగ్ బాస్ స్టేజీపై నాగార్జునతో అల్లు అర్జున్ ఉన్నట్లు క్రియేట్ చేసిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, అది ఫేక్ ఫొటో అని తెలుస్తోంది. 

Whats_app_banner