Highest Ticket Sales: ఒక్క గంటలో అత్యధిక టికెట్స్ అమ్ముడు పోయిన టాప్ 5 సినిమాలు- లిస్ట్‌లో అల్లు అర్జున్, ప్రభాస్, విజయ్
Top 5 Movies With Highest Ticket Sales In One Hour: అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ మూవీ విడుదలైన రోజు బుక్ మై షోలో అత్యధిక టికెట్స్ అమ్ముడు పోయిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో బుక్ మై షోలో ఒక్క గంటలో అత్యధికంగా టికెట్స్ అమ్ముడు పోయిన టాప్ 5 సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
Top 5 Movies With Highest Ticket Sales: స్టార్ హీరో సినిమాలు అంటే వాటికి వచ్చే కలెక్షన్స్, వాటి రికార్డ్స్‌పై అందరి దృష్టి ఉంటుంది. ఇటీవల కలెక్షన్స్‌తోపాటు అత్యధికంగా ఎన్ని టికెట్స్ అమ్ముడుపోయాయి, అది కూడా ఎంత సమయంలో సేల్ అయ్యాయి అనే విషయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలో బుక్ మై షోలో ఒక్క గంటలో అత్యధికంగా టికెట్స్ అమ్ముడుపోయిన టాప్ 5 సినిమాలు ఏంటో ఇక్కడ చూద్దాం.
పుష్ప 2 ది రూల్ టికెట్ సేల్స్
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా మరోసారి తెరకెక్కిన సినిమా పుష్ప 2 ది రూల్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 మూవీ వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 5న విడుదలైన బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌తో రికార్డులన్నింటిని బ్రేక్ చేస్తోంది. అలాగే, ఒక్క గంటలో అత్యధికంగా టికెట్స్ అమ్ముడు పోయిన టాప్ 5 సినిమాల జాబితాలో మొదటి స్థానంలో ఉంది పుష్ప 2.
పుష్ప 2 ది రూల్ సినిమా విడుదల రోజున బుక్ మై షో యాప్‌లో ఒక్క గంటలో అత్యధికంగా టికెట్స్ అమ్ముడు పోయిన చిత్రంగా నిలిచింది. ఒక్క గంటలో 101.43K పుష్ప 2 టికెట్స్ అమ్ముడుపోయాయి. అంటే, సుమారుగా లక్షకుపైగా టికెట్స్ ఒక్క గంటలో సేల్ అయ్యాయి.
కల్కి 2898 ఏడీ టికెట్ సేల్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27న విడుదలైంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కల్కి 2898 ఏడీ మూవీ టికెట్స్ బుక్ మై షోలో ఒక్క గంటలో 96K అంటే 96 వేల వరకు అమ్ముడుపోయాయి. దాంతో మొన్నటివరకు మొదటి స్థానంలో ఉన్న కల్కి ఇప్పుడు రెండో ప్లేస్‌లోకి జారింది.
జవాన్ టికెట్ సేల్స్
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ జవాన్. తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ మూవీ టికెట్స్ బుక్ మై షోలో ఒక్క గంటలో 86 వేలు అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా టాప్ 3 ప్లేస్‌లో నిలిచింది. ఈ మూవీతో లేడి సూపర్ స్టార్ నయనతార హిందీలోకి డెబ్యూ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
లియో టికెట్ సేల్స్
తమిళ స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్ నటించిన లియో మూవీపై రిలీజ్ సమయంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లియో సినిమాకు బుక్ మై షోలో ఒక్క గంటలో 83 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. దాంతో బుక్ మై షోలో ఒక్క గంటలో అత్యధికంగా టికెట్ సేల్ అయిన టాప్ 5 మూవీల్లో నాలుగో స్థానంలో లియో చేరింది.
యానిమల్ టికెట్ సేల్స్
సందీప్ రెడ్డి వంగా హిందీ తెరకెక్కించిన వైల్డ్ మూవీ యానిమల్. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న, తృప్తి డిమ్రి నటించిన యానిమల్ మూవీ బుక్ మై షోలో గంటలో 80 వేల టికెట్స్ అమ్ముడు పోయాయి. దాంతో యానిమల్ టాప్ 5 సినిమాగా జాబితాలో చోటు సంపాదించుకుంది.