Bigg Boss Winner Voting: బిగ్ బాస్ విన్నర్ ఓటింగ్‌లో ఆ ఇద్దరికి సేమ్ ఓట్లు- కానీ, స్థానాలు వేరు- ఫలితాలు ఎలా ఉన్నాయంటే?
Bigg Boss Telugu 8 Winner Voting Results: బిగ్ బాస్ తెలుగు 8 ఫైనల్ వీక్ ఓటింగ్‌ను విన్నర్ ఎవరో తేల్చేందుకు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 15న గ్రాండ్ ఫినాలే నిర్వహించి బిగ్ బాస్ 8 తెలుగు విజేత ఎవరో చెప్పనున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన విన్నర్ ఓటింగ్ పోల్‌లో ఇద్దరికి ఒకేరంగా సేమ్ ఓట్లు పడుతున్నాయి.
Bigg Boss 8 Telugu Winner Voting Results: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ అంతిమ వారానికి చేరుకుంది. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఎవరో తేలిపోనుంది. డిసెంబర్ 15న బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే ఈవెంట్ నిర్వహించి విజేతను ప్రకటించనున్నారు. ఇందుకోసం బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ఓటింగ్ పోల్‌ను నిర్వహిస్తున్నారు.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో
ప్రస్తుతం బిగ్ బాస్ 8 తెలుగు టాప్ 5 ఫైనలిస్ట్‌గా అవినాష్, నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్ ఐదుగురు ఉన్నారు. ఈ ఐదుగురిలో బిగ్ బాస్ విన్నర్ ఓటింగ్ పోల్ సోమవారం రాత్రి 10:30 గంటల నుంచి జరుగుతుంది. తమ అభిమాన కంటెస్టెంట్స్‌కు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ఒక ఓట్‌తో, వారికి కేటాయించిన ఫోన్ నెంబర్‌కు కాల్ చేసి ఓటింగ్ వేయొచ్చు.
టాప్ 2లో ఎప్పటిలాగే ఆ ఇద్దరు
ఓటీటీలో ఒక ఓట్, ఫోన్ ద్వారా ఒక్కసారి కాల్ చేసి మాత్రమే ఓటింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ బిగ్ బాస్ 8 తెలుగు ఫైనల్ వీక్ అంటే విన్నర్ ఓటింగ్‌లో టాప్ 2లో ఎప్పటిలాగే నిఖిల్, గౌతమ్ దూసుకుపోతున్నారు. అయితే, వీరిద్దరికి మొదటి రోజు బిగ్ బాస్ విన్నర్ ఓటింగ్‌లో ఒకే రకమైన పర్సంటేజ్‌తో ఓటింగ్ పడుతోంది. కానీ, స్థానాలు మాత్రం వేరుగా ఉన్నాయి.
ఇద్దరికి 31 శాతం ఓటింగ్
అది ఎలా అంటే, ఓటింగ్ పర్సంటేజ్ ఒకేలా ఉన్నా ఓట్లు మాత్రం ఎక్కువ తక్కువగా ఉన్నాయి. నిఖిల్ కంటే ముందంజలో గౌతమ్ టాప్ 1 ప్లేస్‌లో దంచికొడుతున్నాడు. గౌతమ్ కృష్ణకు 17,111 ఓట్లతో 31 శాతం ఓటింగ్ సాధించగా.. నిఖిల్ 16,884 ఓట్లతో అదే 31 శాతం ఓటింగ్‌ను తెచ్చుకుని రెండో స్థానంలో నిలిచాడు. ఓట్ల ప్రకరంగా చూస్తే నెంబర్ వన్ స్థానంలో గౌతమ్, రెండో స్థానంలో నిఖిల్ ఉన్నాడు.
తర్వాతి స్థానాల్లో
ఓటింగ్ శాతం పరంగా మాత్రం ఇద్దరూ ఒకే స్థానంలో నిలిచారు. ఎప్పటిలాగే వీరిద్దరి మధ్యే గట్టి పోటీ నెలకొంది. ఇక మూడో స్థానంలో 11,660 ఓట్లు, 21 శాతం ఓటింగ్‌తో నబీల్ అఫ్రీది నిలిచాడు. అంటే, బిగ్ బాస్ విన్నర్ ఓటింగ్‌లో టాప్ 3 ప్లేస్‌లో నబీల్‌ను పెట్టారు ఆడియెన్స్. అలాగే, టాప్ 4 ప్లేస్‌లో ప్రేరణ ఉంది. కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్ ప్రేరణకు 6,090 ఓట్లు, 11 శాతం ఓటింగ్ పడింది.
అతి తక్కువగా అవినాష్‌కు
ఇక చివరి స్థానంలో అంటే, బిగ్ బాస్ విన్నర్‌కు టాప్ 5లో మొదటి ఫైనలిస్ట్ అయిన జబర్దస్త్ అవినాష్ మిగిలాడు. బిగ్ బాస్ తెలుగు 8 ఆల్ టైమ్ ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకున్న అవినాష్‌కు 2,853 ఓట్లు, 5 శాతంతో అతి తక్కువ ఓటింగ్ నమోదు అయింది. అయితే, ఈ ఓటింగ్‌లో గౌతమ్, నిఖిల్ ఓట్లు స్వల్ప తేడాతో ఉన్నాయి. కానీ, వీరితో పోల్చుకుంటే ఇతరులకు ఓటింగ్‌లో చాలా భారీ తేడా కనిపిస్తోంది.
శుక్రవారం వరకే
ఇలా మొదటి రోజు బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ఓటింగ్ ఫలితాలు ఉన్నాయి. ఇవి రోజు రోజు మారే అవకాశం ఉంది. ఈ ఫైనల్ వీక్ ఓటింగ్ పోల్ శుక్రవారం (డిసెంబర్ 13) అర్ధరాత్రి 12 గంటల వరకు ఓపెన్ అయి ఉంటాయి. ఆడియెన్స్ తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్‌కు ఓట్ వేయాలనుకుంటే ఆలోపే వేసి గెలిపించుకునే ఛాన్స్ ఉంది.
టాపిక్