Allu Arjun: అల్లు అర్జున్‌కు వీరాభిమానిని అన్న మెగాస్టార్.. బన్నీ రియాక్షన్ ఇదీ.. ట్వీట్ చాట్ వైరల్-allu arjun reacted to megastar amitabh bachchan tweet pushpa 2 movie success ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun: అల్లు అర్జున్‌కు వీరాభిమానిని అన్న మెగాస్టార్.. బన్నీ రియాక్షన్ ఇదీ.. ట్వీట్ చాట్ వైరల్

Allu Arjun: అల్లు అర్జున్‌కు వీరాభిమానిని అన్న మెగాస్టార్.. బన్నీ రియాక్షన్ ఇదీ.. ట్వీట్ చాట్ వైరల్

Hari Prasad S HT Telugu
Dec 09, 2024 12:35 PM IST

Allu Arjun: అల్లు అర్జున్, మెగాస్టార్ మధ్య జరిగిన ట్వీట్ చాట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఇద్దరూ ఒకరిపై మరొకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు. సోమవారం (డిసెంబర్ 9) ఎక్స్ వేదికగా జరిగిన వీళ్ల సంభాషణ అభిమానులను ఆకట్టుకుంటోంది.

అల్లు అర్జున్‌కు వీరాభిమానిని అన్న మెగాస్టార్.. బన్నీ రియాక్షన్ ఇదీ.. ట్వీట్ చాట్ వైరల్
అల్లు అర్జున్‌కు వీరాభిమానిని అన్న మెగాస్టార్.. బన్నీ రియాక్షన్ ఇదీ.. ట్వీట్ చాట్ వైరల్

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీలో నటనకు చాలా మంది ఫిదా అవుతున్నారు. ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నాడు. తాజాగా పుష్ప 2 మూవీ ప్రమోషన్లలో భాగంగా బిగ్ బీపై బన్నీ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ఎక్స్ వేదికగా అమితాబ్ థ్యాంక్స్ చెప్పగా.. దీనిపై అల్లు అర్జున్ కూడా స్పందించాడు.

yearly horoscope entry point

ఇండియా మెగాస్టార్ అమితాబ్: అల్లు అర్జున్

అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న వేళ.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పై బన్నీ చేసిన కామెంట్స్ వీడియో వైరల్ అయింది. బాలీవుడ్ లో తనను బాగా ఇన్‌స్పైర్ చేసిన నటుడు అమితాబే అని, ఇండియాలోనే మెగాస్టార్ అతడని అల్లు అర్జున్ ఆ వీడియోలో చెప్పడం చూడొచ్చు.

ఈ వయసులోనూ బిగ్ బీ అద్భుతంగా నటిస్తున్నాడని, తాను ఆ వయసుకు వచ్చినప్పుడు కూడా అలా నటించాలని అనుకుంటున్నట్లు బన్నీ చెప్పాడు. ఆ వీడియో వైరల్ అవడంతో అమితాబ్ కూడా సోమవారం (డిసెంబర్ 9) ఎక్స్ అకౌంట్ ద్వారా స్పందించాడు.

మీ నటనకు అభిమానిని: అమితాబ్

తనపై అల్లు అర్జున్ చూపిన అభిమానానికి థ్యాంక్స్ చెప్పిన బిగ్ బీ.. అదే సమయంలో బన్నీ నటనకు కూడా తాను అభిమానిని అని అన్నాడు. "అల్లు అర్జున్ జీ.. మీ మాటలు నాకు ఎంతో ఆనందాన్నిచ్చాయి. నా గురించి మీరు కాస్త ఎక్కువే చెప్పారు.

మీ నటన, టాలెంట్ కు మేమందరం కూడా వీరాభిమానులం.. మీరు కూడా అందరినీ ఇలాగే ఇన్‌స్పైర్ చేస్తూనే ఉండాలి.. మీరు మరింత సక్సెస్ సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని బిగ్ బీ ట్వీట్ చేశాడు.

మీరు మా సూపర్ హీరో: అల్లు అర్జున్

అమితాబ్ చేసిన ట్వీట్ పై వెంటనే అల్లు అర్జున్ మరోసారి స్పందించాడు. మీరు మా సూపర్ హీరో అని అందులో బన్నీ అనడం విశేషం. "అమితాబ్ జీ.. మీరు మా సూపర్ హీరో.. మీ నుంచి ఇలాంటి మాటలు వినడం నాకు చాలా అద్భుతంగా అనిపిస్తోంది. మీ ఈ అభిమానానికి, ప్రశంసలకు రుణపడి ఉంటాను.. మీ వినయంతో నన్ను కట్టిపడేశారు" అని అల్లు అర్జున్ రిప్లై ఇచ్చాడు.

బన్నీ నటించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల కంటే కూడా హిందీ బెల్ట్ లోనే ఎక్కువ వసూళ్లు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ వీకెండే రూ.800 కోట్లకుపైగా కొల్లగొట్టి సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. అందులో కేవలం హిందీ వెర్షన్ నుంచే రూ.285 కోట్ల వరకూ వచ్చాయి. తెలుగులో రూ.200 కోట్ల మార్క్ అందుకోవడానికి చేరువైంది. తొలి వారంలోనే రూ.1000 కోట్ల మార్క్ కూడా అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అత్యంత వేగంగా రూ.500 కోట్ల మార్క్ అందుకున్న ఇండియన్ సినిమాగా పుష్ప 2 చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

Whats_app_banner