Varun Tej: వాళ్లను మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదు.. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్‌పై వరుణ్ తేజ్ కామెంట్స్
Varun Tej Comments On Ram Charan In Matka Pre Release Event: మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రామ్ చరణ్, చిరంజీవి, పవన్ కల్యాణ్ గురించి గొప్పగా వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నీకు సపోర్ట్ ఇచ్చినవాళ్లను మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదని వరుణ్ తేజ్ అన్నాడు.
Varun Tej Comments On Ram Charan:టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ మట్కా. యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు మట్కా మూవీ థియేటర్లలో రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా వైజాగ్‌లో మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.
తమ్ముడు క్యారెక్టర్
"అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చి ఇంతగా అద్భుతంగా సపోర్ట్ చేసిన ప్రేక్షకులు, అభిమానులందరికీ పేరుపేరునా థాంక్యూ సో మచ్. బర్మా నుంచి వైజాగ్‌కి శరణార్థిగా వచ్చిన వాసు అనే కుర్రాడు కథ ఇది. వాసు చిన్నప్పటి క్యారెక్టర్‌లో కార్తికేయ నటించాడు. చాలా అద్భుతంగా చేశాడు. తనకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. అవినాష్ నాకు తమ్ముడు క్యారెక్టర్ చేశాడు. తనకి ఆల్ ది బెస్ట్" అని వరుణ్ తేజ్ చెప్పాడు.
సర్‌ప్రైజ్ చేసిన లావణ్య
భారీగా హాజరైన అభిమానులు సమక్షంలో మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు హీరో వరుణ్ తేజ్‌తోపాటు ఆయన భార్య, హీరోయిన్ లావణ్య త్రిపాఠి హాజరై ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేశారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
యాక్టర్‌ని పట్టుకున్నారు
"ఒక మాస్ సినిమా చేద్దాం, అందరికీ నచ్చే సినిమా చేద్దామని భావిస్తున్నప్పుడు కరుణ కుమార్ గారు మట్కా కథతో వచ్చారు. తను అద్భుతమైన మేకర్. మంచి సెన్సిబిలిటీస్ ఉన్న డైరెక్టర్. ఆయనతో వర్క్ చేయడం నిజంగా నాకు అదృష్టంగా అనిపించింది. నాలోని యాక్టర్‌ని ఆయన పట్టుకున్నారనిపించింది. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ రిలీజ్ తర్వాత అందరూ కరుణ కుమార్ గారి వర్క్ గురించి మాట్లాడుకుంటారు" అని వరుణ్ తేజ్ అన్నాడు.
లావణ్యతో మాట్లాడాక
"ప్రతి సినిమా రిలీజ్ ముందు ఒక టెన్షన్ ఉంటుంది. ఈ మధ్య ప్లాప్స్ వచ్చాయి. రాత్రి నా వైఫ్ లావణ్యతో కాల్ మాట్లాడి పెట్టేసాకా ఉదయం ఒక ఫోన్ వచ్చింది. అది రామ్ చరణ్ అన్నయ్య కాల్ చేశారు. ఆయన వంద మాటలు చెప్పాల్సిన అక్కర్లేదు. నా భుజంపై చేయి వేస్తే చాలు వంద కోట్లతో సమానం. అన్నయ్య ఎప్పుడు ఒక ఎమోషనల్ సపోర్ట్‌గా ఉంటారు. థాంక్స్ చరణ్ అన్న" అని వరుణ్ తేజ్ చెప్పాడు.
ఎక్కడి నుంచి వచ్చావో
"మా బాబాయ్. పెదనాన్న, నాన్న ఎప్పుడు గుండెల్లో ఉంటారు. వారి గురించి చెప్పాల్సిన పనిలేదు. వాళ్ల సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది. ఒకరన్నారు ఎప్పుడు మీవాళ్ల గురించే చెప్పడమేనా అని. వాళ్ల గురించి కచ్చితంగా మాట్లాడతాను. అది నా ఇష్టం. అంటే, లైఫ్‌లో నువ్ పెద్దోడివి అవ్వొచ్చు అవ్వకపోవచ్చు గానీ.. ఎందుకు మొదలుపెట్టావ్. ఎక్కడి నుంచి మొదలుపెట్టావ్. ఎక్కడి నుంచి వచ్చావ్. నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరు అని వారి గురించి మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదు." అని అని పవన్ కల్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్ గురించి వరుణ్ తేజ్ గొప్పగా తెలిపాడు.
టాపిక్