మీ భార్యతో కలిసి ఈ అకౌంట్ ఓపెన్ చేయండి.. రూ.5 లక్షలపైన సంపాదించండి!
Investment Plan : డబ్బులు ఊరికే డబుల్ అవ్వవు.. ఎక్కడో ఓ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే అవుతాయి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉండి ఉంటే మీ భార్యతో కలిసి పోస్ట్ ఆఫీసులో ఒక అకౌంట్ ఓపెన్ చేయండి. మంచి రాబడి వచ్చే ప్లాన్ ఉంది.
డబ్బును సురక్షితంగా పెట్టుబడి పెట్టాలంటే పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ స్కీమ్ బెటర్ ఆప్షన్. పోస్టాఫీసులో సూపర్‌హిట్ పథకం ఇది. ఇంట్లో కూర్చొని రూ. 5,55,000 వరకు సంపాదించవచ్చు. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో డబ్బు పూర్తిగా సురక్షితం, నెలవారీ వడ్డీ ఆదాయాన్ని కూడా పొందుతారు. సమీపంలోని పోస్టాఫీసులో ఎంఐఎస్ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఖాతాను ఒంటరిగా, ఉమ్మడిగా తెరవవచ్చు. మీరు మీ భార్య పేరు మీద ఈ ఖాతాను ఓపెన్ చేయండి. లేదంటో ఆమెతో కలిసి మీరు కూడా జాయింట్ ఖాతను తెరిస్తే.. డిపాజిట్ పరిమితి పెంచుకోవచ్చు. దీంతో మరికొన్ని ప్రయోజనాలు దక్కుతాయి.
పోస్ట్ ఆఫీస్ మంత్లీ సేవింగ్స్ స్కీమ్ అనేది డిపాజిట్ స్కీమ్. ఇందులో డిపాజిట్ చేసిన మొత్తంపై ప్రతి నెలా ఆదాయం అందుతుంది. పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలో ప్రతి నెలా ఖాతాపై వడ్డీ వస్తుంది. 5 సంవత్సరాల తర్వాత మీ డిపాజిట్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఈ పథకంలో సింగిల్, జాయింట్ ఖాతాను తెరవవచ్చు. ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఉమ్మడి ఖాతాను ఓపెన్ చేసుకోవచ్చు. ఒకే ఖాతాలో 9 లక్షల రూపాయల వరకు, జాయింట్ ఖాతాలో 15 లక్షల రూపాయల వరకు జమ చేయవచ్చు. ఎక్కువ జమచేస్తే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. మీరు, మీ భార్య కలిసి ఈ ఖాతాను తెరిస్తే కేవలం వడ్డీతో 5 లక్షల కంటే ఎక్కువ సంపాదించవచ్చు.
పోస్ట్ ఆఫీస్ మంత్లీ సేవింగ్స్ స్కీమ్ 7.4 శాతం వడ్డీని అందిస్తోంది. అందులో రూ.15 లక్షలు జాయింట్ ఖాతాలో డిపాజిట్ చేస్తే 7.4 శాతం వడ్డీతో ప్రతి నెలా రూ.9,250 వస్తుంది. ఈ విధంగా ఏడాదికి రూ.1,11,000 ఆదాయం గ్యారెంటీగా ఉంటుంది. 1,11,000 x 5 = 5,55,000 ఈ విధంగా మీరిద్దరూ 5 సంవత్సరాలలో రూ.5,55,000 వడ్డీని తీసుకోవచ్చు.
ఒకే ఖాతాను తెరిస్తే గరిష్టంగా రూ.9 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ప్రతి నెలా రూ. 5,550 వడ్డీని పొందుతారు. అంటే ఒక సంవత్సరంలో రూ. 66,600 వడ్డీని తీసుకోవచ్చు. 5 సంవత్సరాలలో రూ. 3,33,000 సంపాదించవచ్చు. దేశంలో ఎవరైనా పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకంలో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. పిల్లల వయస్సు పదేళ్ల కంటే తక్కువ ఉంటే తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు అతని పేరు మీద ఖాతాను తెరవవచ్చు. వారి వయసు 10 ఏళ్లకు చేరుకున్నప్పుడు ఖాతాను స్వయంగా నిర్వహించే హక్కును కూడా క్లెయిమ్ చేయవచ్చు.