Bigg Boss Telugu 8: బిగ్ బాస్ విజేతలకు, కంటెస్టెంట్లకు రెమ్యునరేషన్ ఎంత? వారి దశ మారిపోతుందా?
Bigg Boss Telugu Winners Remuneration: బిగ్ బాస్ షోకు ఎంత క్రేజ్ ఉంటుందో అందులో పాల్గొన్న కంటెస్టెంట్లకు వచ్చే రెమ్యునరేషన్, ఫైనల్ విన్నర్స్‌కు అందే పారితోషికం ఎంత అనేది ఎప్పుడూ క్యూరియాసిటీగానే ఉంటుంది. మరి బిగ్ బాస్ ద్వారా లైమ్ లైట్‌లో లేని సెలబ్రిటీలు, సాధారణ వ్యక్తుల దశ మారిపోతుందా?
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్.. ఈ రియాలిటీ షో పేరు ప్రతి సంవత్సరంలో మూడు నుంచి నాలుగు నెలలు చాలా గట్టిగా వినిపిస్తుంది. ప్రతి ఏడాది సరికొత్త సీజన్ స్టార్ట్ చేసి ప్రేక్షకులకు ఎంటర్టైన్‌మెంట్ అందిస్తుంటారు. ఈ షోకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. హిందీతోపాటు దక్షిణ భాషల్లో బిగ్ బాస్ షో చూసే జనాలు ఎక్కువే.
దశ మారుతుందా?
ఇక ఈ షోలో సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు కంటెస్టెంట్స్‌గా పాల్గొంటారన్న విషయం తెలిసిందే. అయితే, ఇంత క్రేజ్ సంపాదించిన ఈ షో వల్ల అందులోని పార్టిసిపెంట్లకు, ఫైనల్‌లో గెలిచిన విజేతలకు వచ్చే రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది..? బిగ్ బాస్ వల్ల వారి దశ ఏమైనా మారిపోతుందా..? అనేది సరదాగా గత సీజన్లకు సంబంధించిన విషయాలను గుర్తు చేసుకుందాం.
బిగ్ బాస్ ప్రారంభానికి నెల రోజుల ముందు నుంచి గ్రాండ్ ఫినాలే అయిపోయిన సుమారు పది, పదిహేను రోజుల వరకు మంచి బజ్ క్రియేట్ అవుతుంది. ఈ సమయంలో పాల్గొనే సెలబ్రిటీలు ఎవరు, వారికి ఇచ్చే పారితోషికం, అది ఇచ్చే విధానం, బాగా ఆడే కంటెస్టెంట్స్, విజేతగా నిలిచే వ్యక్తులు, విన్నర్‌కు వచ్చే ప్రైజ్ మనీ, దాంతో వాళ్లు ఏం చేస్తారనే లాంటివన్నీ అందరిలో ఇంట్రెస్ట్ కలిగించే విషయాలు.
రెమ్యునరేషన్ ఎంతంటే..
అయితే, బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఇచ్చే రెమ్యునరేషన్ వారి ఫేమ్, పాపులారిటీని బట్టి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో స్టార్ సెలబ్రిటీ రేంజ్ ఉన్నవారికి వారానికి లక్షల్లో పారితోషికం ఇస్తారు. అంటే, అది రూ. 2నుంచి 5 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు గత సీజన్ బిగ్ బాస్ తెలుగు 7లో పాల్గొన్న హీరో శివాజీకి వారానికి రూ. 4.5 లక్షలు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం.
టాలీవుడ్ హీరోగా శివాజీకి ఎంత పాపులారిటీ ఉందో తెలిసిందే. కాబట్టి అంత రేంజ్ సెలబ్రిటీలకు వచ్చే రెమ్యునరేషన్ అలా ఉంటుంది. ఇక వారు ఎన్ని వారాలు ఉంటారనేది వాళ్ల ఆట మీద ఆధారపడి ఉంటుంది. ఇక సాధారణ యూట్యూబర్స్, లైమ్ లైట్‌లో లేని సెలబ్రిటీలకు వేలల్లో ముట్టజెపుతారు. ఎగ్జాంపుల్‌కు రైతు బిడ్డగా, కామన్ మ్యాన్‌గా వచ్చిన పల్లవి ప్రశాంత్‌కు వారానికి రూ. లక్ష లోపు ఇచ్చినట్లు టాక్.
అరకొర అవకాశాలు
అయితే, ఇది ప్రతి సీజన్‌కు మారుతూ వస్తుంది. ఈ సీజన్‌కు మేకర్స్ పెట్టే బడ్జెట్‌ను పెట్టి దీనిలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇక బిగ్ బాస్ షోలో పాల్గొనడం వల్ల దశ మారిపోతుందా అంటే అది ఆ సెలబ్రిటీపైనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ విన్నర్ శివ బాలాజీకి అంతకుముందే నటుడిగా మంచి పాపులారిటీ ఉంది. విన్నర్ అయిన తర్వాత ఆయన కెరీర్‌లో పెద్దగా చెప్పుకునే ఫేమ్ ఏం రాలేదు.
అదే, సినీ ఇండస్ట్రీ వైపు అడుగులేస్తూ, లైమ్ లైట్‌లో లేని చిన్నిపాటి సెలబ్రిటీలకు మాత్రం అరకొర అవకాశాలు అయితే వచ్చాయి. ఆ తర్వాత వారి టాలెంట్‌తోనే వారి కెరీర్ సాగింది. వారిలో అరియానా గ్లోరి, సయ్యద్ సోహైల్, వీజే సన్నీ, రాహుల్ సిప్లిగంజ్, దివి వాద్యాను ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. వీళ్లందరిలో బిగ్ బాస్ ద్వారా రాహుల్ సిప్లిగంజ్‌కు చాలా ఫేమ్ వచ్చింది.
టాలెంట్‌ను బట్టి
యూట్యూబ్‌లో ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకునే రాహుల్ సిప్లిగంజ్‌కు బిగ్ బాస్ ద్వారా మంచి అవకాశాలు వచ్చాయి. దాంతో తన టాలెంట్ నిరూపించుకుని స్టార్ సింగర్‌గా ఎదిగాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా నాటు నాటు పాటతో ఆస్కార్ స్థాయికి వెళ్లాడు. బిగ్ బాస్ అనేది సెలబ్రిటీలు తమ టాలెంట్ చూపించుకునేందుకు ఒక మంచి వేదిక. ఆ తర్వాత వారికి ఛాన్సెస్ రావడం, వారి దశ మారడం అనేది మాత్రం చెప్పడం కష్టం.
ఇక సినీ ఛాన్సెస్ విషయం పక్కన పెడితే.. "బళ్లు ఓడలు అవుతాయి.. ఓడలు బళ్లు అవుతాయి" అనే సామెతకు బిగ్ బాస్ చాలా బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే ఎంతో మంచి పాపులారిటీ ఉన్న వాళ్లు తీవ్రమైన నెగెటివిటీ తెచ్చుకుంటే.. ఏమాత్రం తెలియని వారు విపరీతమైన ఫుల్ పాజివిటీ సంపాదించుకున్నారు. దాదాపుగా చాలా మందికి బిగ్ బాస్ నెగెటివిటీనే తీసుకొచ్చింది.
కన్ఫ్యూజన్‌లో తారలు
అందుకే, బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వాలంటే మంచి ఫేమ్ ఉన్న తారలు ఆలోచిస్తుంటారు. ఇదిలా ఉంటే, సెప్టెంబర్ 1 నుంచి కొత్త సీజన్ బిగ్ బాస్ తెలుగు 8 ప్రారంభం కానుంది. మరి ఈ సీజన్ ద్వారా ఎవరి తెలుగులో కొత్త బిగ్ బాస్ సీజన్ ప్రారంభం కానుంది. మరి ఈ సీజన్ ఏ సెలబ్రిటీని ఎలా చూపిస్తుందో చూడాలి.