Supreme Court Jobs 2024 : సుప్రీంకోర్టులలో అనేక పోస్టులకు రిక్రూట్‌మెంట్.. కానీ వీరికే ఛాన్స్.. మీకు అర్హత ఉందా?
Supreme Court Jobs 2024 : సుప్రీంకోర్టులో అనేక పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ నడుస్తోంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించిన మిగతా వివరాలేంటో చూద్దాం..
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్. సుప్రీం కోర్టులో కోర్ట్ మాస్టర్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్ మొత్తం 107 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 25 డిసెంబర్ 2024 వరకు అధికారిక వెబ్‌సైట్ sci.gov.inని సందర్శించి.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
రిక్రూట్‌మెంట్ జరిగే పోస్టులివే.. కోర్ట్ మాస్టర్: 31 పోస్టులు, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్: 33 పోస్టులు, పర్సనల్ అసిస్టెంట్: 43 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి అర్హతల గురించి తెలుసుకుందాం..
అర్హతలు
కోర్ట్ మాస్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి తప్పనిసరిగా న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. టైపింగ్ టేస్ట్, రాత పరీక్ష, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకునేవారు 120 డబ్ల్యూపీఎంతో ఇంగ్లిష్ షార్ట్ హ్యండ్ స్పీడ్, 40 డబ్ల్యూపీఎం కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ రావాలి. అలాగే, 5 సంవత్సరాల అనుభవం కూడా అవసరం.
సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్ కోసం గ్రాడ్యుయేట్‌తోపాటుగా ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 110 పదాలు, కంప్యూటర్ టైపింగ్ వేగం నిమిషానికి 40 పదాలు ఉండాలి. పర్సనల్ అసిస్టెంట్ కోసం అభ్యర్థి తప్పనిసరిగా ఏదైనా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. 110 డబ్ల్యూపీఎం షార్ట్‌హ్యాండ్ ఇంగ్లీష్, 40 కంప్యూటర్ టైపింగ్ స్పీడు రావాలి.
వయోపరిమితి
కోర్ట్ మాస్టర్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 30 నుండి 45 సంవత్సరాలు ఉండాలి. ఇతర పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల వయసుగా నిర్ణయించారు.
జనరల్/OBC/EWS అభ్యర్థులకు రూ. 1000గా ఫీజు నిర్ణయించారు. SC/ST/ESM/PWD: రూ. 250 చెల్లించాలి. ఆన్‌లైన్ (డెబిట్/క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, UPI) ద్వారా ఫీజు చెల్లించవచ్చు. నైపుణ్య పరీక్ష, రాత పరీక్ష. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్., వైద్య పరీక్షలు ఉంటాయి.
జీతం వివరాలు
కోర్ట్ మాస్టర్: నెలకు రూ.67,700.
సీనియర్ పర్సనల్ అసిస్టెంట్: నెలకు రూ. 47,600.
పర్సనల్ అసిస్టెంట్: నెలకు రూ. 44,900.
దరఖాస్తు విధానం
స్టెప్ 1 : అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ sci.gov.inకి వెళ్లండి.
స్టెప్ 2 : నోటీసు విభాగంలో రిక్రూట్‌మెంట్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: సంబంధిత పోస్ట్ కోసం అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 4 : దీని తర్వాత అభ్యర్థులు అవసరమైన సమాచారాన్ని పూరించడం ద్వారా నమోదు చేసుకోవాలి.
స్టెప్ 5 : తర్వాత అభ్యర్థి రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
స్టెప్ 6 : ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను నింపి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
స్టెప్ 7: తర్వాత అభ్యర్థులు దరఖాస్తు రుసుమును చెల్లించి, ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి.
స్టెప్ 8 : అభ్యర్థులు అప్లికేషన్ ప్రింట్ కాపీని భద్రంగా ఉంచుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడొచ్చు.
టాపిక్