Bigg Boss Sohel: ఇంట్లో ఉన్న డబ్బులన్నీ పెట్టి సినిమా తీశాను, నష్టపోయాను, ట్రోలింగ్ చేశారు.. బిగ్ బాస్ సోహైల్ కామెంట్స్
Bigg Boss Sohel Comments In Pranaya Godari Pre Release Event: బిగ్ బాస్ తెలుగు 4 సీజన్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు సయ్యద్ సోహైల్. ఇటీవల జరిగిన ప్రణయ గోదారి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన బిగ్ బాస్ సోహైల్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.
Bigg Boss Sohel At Pranaya Godari Pre Release Event: బిగ్ బాస్ తెలుగు 4 సీజన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు సయ్యద్ సోహైల్. అప్పటికే తెలుగు సీరియల్స్‌లో హీరోగా చేసిన సయ్యద్ సోహైల్ బిగ్ బాస్ 4 తెలుగు సీజన్ అనంతరం బిగ్ బాస్ సోహైల్‌గా మారిపోయాడు.
10 లక్షల డబ్బుతో
రూ. 10 లక్షల డబ్బుతో బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకొచ్చిన సయ్యద్ సోహైల్ సినిమాల్లో హీరోగా చేస్తూ అలరిస్తున్నాడు. తాజాగా ప్రణయ గోదారి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతథిగా హాజరయ్యాడు బిగ్ బాస్ సోహైల్. ప్రణయ గోదారి సినిమాలో సదన్ హీరోగా చేయగా ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటించింది.
ప్రణయ గోదారి ప్రీ రిలీజ్ ఈవెంట్
అలాగే, ప్రణయ గోదారి సినిమాలో డైలాగ్ కింగ్ సాయి కుమార్ ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాకు పీఎల్ విఘ్నేష్ దర్శకత్వం వహించారు. ‘ప్రణయ గోదారి’ మూవీని పీఎల్‌వీ క్రియేషన్స్‌పై పారమళ్ల లింగయ్య నిర్మించారు. ప్రణయ గోదారి సినిమా డిసెంబర్ 13న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రణయ గోదారి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా
ప్రణయ గోదారి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరితోపాటు హీరో, బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రణయ గోదారి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బిగ్ బాస్ సోహైల్ ఎమోనల్‌గా కామెంట్స్ చేశాడు.
50 శాతం పూర్తయిన తర్వాత
బిగ్ బాస్ సోహెల్ మాట్లాడుతూ.. "ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఒక చిన్న సినిమా బయటకు రావాలంటే ఎంత కష్టపడాలో నాకు తెలుసు. బూట్‌కట్ బాలరాజు సినిమా అప్పుడు ఎలాంటి కథ జరిగిందో మీ అందరికి తెలుసు. నేను లీడ్ రోల్ చేస్తున్న సమయంలో సినిమా 50 శాతం కంప్లీట్ అయిన తర్వాత నిర్మాత కష్టాల్లో ఉన్నానని చెప్పాడు" అని అన్నారు.
లాభాలు రావాలని చేయరు
"అంతకుముందు సినిమా వల్ల కష్టాల్లో ఉన్నట్లు నిర్మాత చెప్పాడు. అలాంటప్పుడు నేను అనుకుంది ఇందాక విఘ్నేష్ అన్న చెప్పినట్లు సినిమాకు ప్రాఫిట్ రావాలని చేయరు. పెట్టిన డబ్బులు వస్తే చాలు అనుకునేవారు ఉన్నారు. లేదా అప్పులు తీరిపోతే చాలురా భయ్ అనుకునేవాళ్లు ఉన్నారు" అని సోహైల్ తెలిపాడు.
అదృష్టం ఉంటే డబ్బు వస్తుంది
"నిజానికి డబ్బు సంపాదించడానికి సినిమాల్లోకి రారు చాలామంది. పేరు కోసం ఇక్కడకు వస్తారు. లక్ వస్తే.. డబ్బులు కూడా వస్తాయి. ఇంట్లో ఉన్న డబ్బులన్నీ పెట్టి సినిమాను తీశాను. నష్టపోయాను. నన్ను ట్రోలింగ్ కూడా చేశారు. హిట్టు కొట్టాలనే ఎవ్వరైనా సినిమాను చేస్తారు" అని బిగ్ బాస్ సోహైల్ అన్నాడు.
ఎంకరేజ్ చేయాలి
"ప్రణయ గోదారి టీమ్‌లో అందరూ కొత్త వాళ్లే. వారి కష్టాన్ని గుర్తించి థియేటర్‌కు వెళ్లి సినిమాను చూడండి. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చాలా నేచురల్‌గా చేశారు. కొత్త హీరో, దర్శక, నిర్మాతల్ని ఆడియెన్స్ ఎంకరేజ్ చేయాలి. డిసెంబర్ 13న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి" అని తన స్పీచ్ ముగించాడు హీరో సయ్యద్ సోహైల్.