Karthika Deepam Today December 12: దీపని చంపేందుకు ప్లాన్, రౌడీలకు సుపారీ ఇచ్చిన పారిజాతం జ్యోత్స్న-karthika deepam today episode december 12 parijatham jyotsna is the plan to kill deepa star maa serial today ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam Today December 12: దీపని చంపేందుకు ప్లాన్, రౌడీలకు సుపారీ ఇచ్చిన పారిజాతం జ్యోత్స్న

Karthika Deepam Today December 12: దీపని చంపేందుకు ప్లాన్, రౌడీలకు సుపారీ ఇచ్చిన పారిజాతం జ్యోత్స్న

Haritha Chappa HT Telugu
Dec 12, 2024 09:22 AM IST

Karthika Deepam Today December 12: జ్యోత్స్న దీపను చంపేందుకు సుపారీ ఇస్తుంది. కార్తీక్ కావాలని దీపతో ఫోన్లో రొమాంటిక్ గా మాట్లాడుతూ జ్యోత్స్నను ఫీల్ అయ్యేలా చేస్తాడు.

కార్తీక దీపం లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం లేటెస్ట్ ఎపిసోడ్ (Star maa)

Karthika Deepam Today December 12: జ్యోత్స్న దీపను చంపేందుకు సుపారీ ఇస్తుంది. కార్తీక్ కావాలని దీపతో ఫోన్లో రొమాంటిక్ గా మాట్లాడుతూ జ్యోత్స్నను ఫీల్ అయ్యేలా చేస్తాడు.

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్‌లో జోత్స్న, కార్తీక్‌లు అర్ధరాత్రి అయినా కూడా ఆఫీస్ నుంచి వెళ్లరు. పనిచేసుకుంటూ ఉండిపోతారు. కార్తీక్ పనిచేస్తూ ఉంటే జ్యోత్స్న దూరం నుంచే చూస్తూ మురిసిపోతుంది. అర్ధరాత్రి దాటాక జోత్స్న తనను ఇంటి దగ్గర డ్రాప్ చేయమని కార్తీక్‌ను అడుగుతుంది. కార్తీక్ ఫోన్ చేస్తుంది. కార్తీక్ కావాలనే జోత్స్నముందు దీపతో రొమాంటిక్ గా మాట్లాడతాడు. ‘నేను రాలేదని భోజనం చేయకుండా ఇంకా వెయిట్ చేస్తున్నావా? నీకు ఎన్నిసార్లు చెప్పాను దీప తొందరగా భోజనం చేయమని. నీకు ఏదైనా అయితే నేను తట్టుకోగలనా’ అని మాట్లాడతాడు.

దానికి దీప ‘నేనేం అడిగాను మీరేం చెబుతున్నారు’ అని అడుగుతుంది. అయినా కార్తీక్ జ్యోత్స్న వినాలని ‘ఈరోజు ఎందుకు ఆఫీసు లేట్ అయిందా? మా కొత్త సీఈవో గారు వారం పని ఒక్కరోజే చేయించేశారు’ అని చెబుతాడు. దానికి దీప ‘జోత్స్న ఇబ్బంది పెడుతుందన్నమాట’ అని అంటుంది. వెంటనే కార్తీక్ ‘ఇంకేంటి దీపా, ఈరోజు పనీర్ కూరా? మనిద్దరికీ ఆ కూర ఇష్టం కదా, ఏంటీ మల్లెపూలు తేవాలా, నువ్వు ఫోన్ చేసి గుర్తు చేయాలా చెప్పు. రేపు ఆఫీస్ కి వెళ్ళక్కర్లేదు ఈరోజు ఓవర్ టైం చేస్తే రేపు ఆఫీస్ లీవ్ తీసుకోవచ్చు’ అని అంటాడు. దీప ‘జ్యోత్స్న పక్కనే ఉందనుకుంటా ఇలా మాట్లాడుతున్నారు’ అని అంటుంది. ఆ తరువాత జ్యోత్న ‘మీ ప్రేమ ముచ్చట్లు అయ్యాయా, నన్ను డ్రాప్ చెయ్ బావ’ అని అడుగుతుంది. దానికి కార్తీక్ ‘క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళు’ అని చెప్పి దీపా వచ్చేస్తున్నా అంటూ బయలుదేరుతాడు కార్తీక్.

జ్యోత్స్న ని ఆఫీస్ లోనే వదిలి వెళ్తాడు కార్తీక్. దీంతో జ్యోత్స్నకు విపరీతమైన కోపం వస్తుంది. కార్తీక్ ఇంటికి వెళ్లేసరికి దీప హాల్లోనే నిద్రపోయి కనిపిస్తుంది. దీపను నిద్రలేపి ఇద్దరూ కలిసి భోజనం చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తీక్ తలనొప్పిగా ఉందని మందు రాస్తుంది. ఆ సమయంలో ‘జ్యోత్స్నకు మీరు కావాలి మిమ్మల్ని పెళ్లి చేసుకునే వరకు వదలదు’ అని అంటుంది.ఆ మాట వినగానే కార్తీక్ కు కోపం వస్తుంది. తలనొప్పి మందు తీసుకొని ‘నేనే రాసుకుంటా వెళ్లిపో’ అని కోపంగా అంటాడు.

అక్కడినుంచి సీన్ జ్యోత్స్న దగ్గరికి మారిపోతుంది. జ్యోత్స్న, పారిజాతం కలిసి రౌడీని కలుస్తారు. అతడికి దీప ఫోటో ఇచ్చి మిగతా వివరాలు మెసేజ్ చేస్తానని చెబుతుంది. ఈరోజే చంపేయాలని చెప్పి అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తుంది. పని పూర్తి చేసే ఇంకా ఎక్కువ మొత్తం డబ్బులు ఇస్తానని చెబుతుంది. అది విన్న పారిజాతం చాలా టెన్షన్ పడుతుంది.

జ్యోత్స్నా దీపను చంపడానికి సుపారి ఇచ్చిందని పారిజాతానికి భయం పట్టుకుంటుంది. దీపని చంపడం ఎందుకు అని ప్రశ్నిస్తుంది. అయితే ఆమె కూడా మనసులో దీప చావాలనే ఉంటుంది.

రౌడీ తన ప్లాన్ లో భాగంగా దీపకి ఫోన్ చేస్తాడు. తాను స్కూల్ అటెండర్ అని చెబుతాడు. పాప గ్రౌండ్లో పడిపోయిందని త్వరగా రమ్మని చెబుతాడు. దీప కంగారుపడుతుంది. అనసూయకి చెప్పి స్కూల్ కి బయలుదేరుతుంది దీప. దీంతో ఎపిసోడ్ ముగిసిపోతుంది.

Whats_app_banner