Budget Cars : ఈ కార్లు చిన్న ఫ్యామిలీకి భలే ఉంటాయి.. బడ్జెట్ ధరలోనే అనేక సేఫ్టీ ఫీచర్లు!-super hatchback cars for small families in budget range maruti suzuki alto 800 to hyundai grand i10 nios ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Budget Cars : ఈ కార్లు చిన్న ఫ్యామిలీకి భలే ఉంటాయి.. బడ్జెట్ ధరలోనే అనేక సేఫ్టీ ఫీచర్లు!

Budget Cars : ఈ కార్లు చిన్న ఫ్యామిలీకి భలే ఉంటాయి.. బడ్జెట్ ధరలోనే అనేక సేఫ్టీ ఫీచర్లు!

Anand Sai HT Telugu
Dec 12, 2024 08:10 AM IST

Small Family Best Car : చిన్న కుటుంబం.. చింతలేని కుటుంబం అంటుంటారు. అలాంటి ఫ్యామిలీ కారు కొనాలని చూస్తే బడ్జెట్‌ ధరలో కొన్ని కార్లు ఉన్నాయి. ఆ హ్యాచ్‌బ్యాక్ కార్ల లిస్టు మీకోసం..

మారుతి సుజుకి ఆల్టో 800
మారుతి సుజుకి ఆల్టో 800 (www.marutisuzuki.com)

కాంపాక్ట్ సైజ్, స్టైలిష్ లుక్, మంచి మైలేజీ, బడ్జెట్ ధరలో కారు కొనాలని చూస్తుంటే మీ కోసం మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. అద్భుతమైన డ్రైవింగ్ అనుభవం, అనేక సేఫ్టీ ఫీచర్లతో వచ్చే కార్లు వచ్చే అవకాశం ఉంది. మంచి పనితీరుతో ఉండే హ్యాచ్‌బ్యాక్‌లు ఉన్నాయి. ఇవి చాలామందికి ఇష్టమైన కార్లు. ఆ లిస్టులోని కార్లు ఏవో ఓసారి చూసేయండి..

మారుతి సుజుకి ఆల్టో 800

కొత్త మారుతి సుజుకి ఆల్టోలో స్ట్రీమ్‌లైన్డ్ బానెట్, షార్ప్ హెడ్ ల్యాంప్‌లు ఉన్నాయి. విశాలమైన ఇంటీరియర్‌తో ఉంటుంది. ఏబీఎస్, ఈబీడీ కలయిక సేఫ్టీని పెంచుతుంది. 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కొత్త స్మార్ట్ డిస్‌ప్లే, ఫోన్ కనెక్టివిటీని అందిస్తుంది. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి.

టాటా టియాగో

టాటా టియాగో 1.05 డీజిల్ లేదా 1.2 పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. 242 లీటర్ బూట్ స్పేస్‌తో లగేజీ స్టోరేజీకి సహాయపడే అడ్జస్టబుల్ రియర్ సీట్లు కూడా ఉన్నాయి. సిటీ డ్రైవింగ్, దూర ప్రయాణాలకు ఇది మంచి కారు. టియాగో 35 లీటర్ ఇంధన సామర్థ్యాన్ని, మంచి మైలేజీని అందిస్తుంది. ఎత్తు సర్దుబాటు చేయగల సీటు, బ్యాక్ కెమెరా, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8-స్పీకర్ ఆడియో సిస్టమ్, టాటా టియాగో ఇతర ఫీచర్లతో వస్తుంది.

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ దాని పెద్ద 2400 ఎంఎం వీల్‌బేస్, ఐదుగురు వ్యక్తులకు సౌకర్యవంతమైన సీటింగ్ కారణంగా లోపల విశాలమైన క్యాబిన్‌ను కలిగి ఉంది. ముందు క్యాబిన్‌లోని డ్యుయల్ టోన్ బ్రౌన్, బ్లాక్ డ్యాష్‌బోర్డ్ హై క్వాలిటీ ప్లాస్టిక్‌తో తయారు అయి ఉంది.

మారుతి సుజుకి స్విఫ్ట్

కొత్త స్విఫ్ట్ డ్యూయల్ టోన్ స్పోర్టీ స్టైలింగ్, క్రాస్డ్ మెష్ గ్రిల్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ లైట్లు, డ్యూయల్ టోన్ వీల్ బేరింగ్‌లతో స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, నావిగేషన్ సిస్టమ్, ఆటో గేర్ స్విచ్, ఈబీడీతో కూడిన సురక్షితమైన ఏబీఎస్ సిస్టమ్, హార్డ్ ప్లాట్‌ఫారమ్, కెమెరాలతో కూడిన రివర్స్ పార్కింగ్ సెన్సార్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ డీజిల్, పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్‌లో వస్తుంది. అప్డేట్ చేసిన హ్యుందాయ్ గ్రాండ్ i10 మునుపటి మోడళ్ల కంటే విశాలమైన, వేగవంతమైన, స్పోర్టివ్‌గా ఉంటుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కూడా రీడిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్‌ని పొందుతుంది. బంపర్, వెనుక టెయిల్ లైట్లతో వస్తుంది. కొత్త శ్రేణి అల్లాయ్ వీల్స్ మినహా సైడ్‌లు పాత మోడల్‌లోనే ఉంటాయి.

Whats_app_banner