Blue Sapphire: దుష్ట శక్తుల పీడ వదిలించి డబ్బు, అదృష్టం, ఐశ్వర్యం తెచ్చిపెట్టే ఈ రత్నాన్ని ధరించాలి
Blue Sapphire: శాస్త్రపరంగా ఎంతో విలువైన నీలమణి రత్నం దోషాలను తొలగించి శుభాలను కలుగజేస్తుంది. అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందించే నీలమణి రత్నాన్ని ఎవరు, ఎప్పుడు, ఎలా ధరించాలో తెలుసుకోండి.
రత్నశాస్త్రంలో నీలమణిని శనిగ్రహ రత్నంగా అభివర్ణిస్తారు. అందుకే జ్యోతిష్యులు శనిగ్రహ దోషం నుంచి ఉపశమనం కలగడానికి, శని దేవుడి అనుగ్రహం పొందడానికి నీలమణి రత్నాన్ని ధరించడం ఉత్తమమని అంటున్నారు. జాతకం ప్రకారం, గ్రహాలను బలపరిచేందుకు రత్నాలు ధరించడం సబబేనని పురాతన కాలం నుంచి చాలా మందిలో బలమైన విశ్వాసం ఉంది. ఇది శ్రేయస్సు, లాభం తెచ్చిపెట్టేదే కానీ, ఇవి ధరించే ముందు కొన్ని నియమాలను తూచా తప్పకుండా పాటించాలి. సరైన పద్ధతిలో, సరైన సమయానికి ధరిస్తేనే నీలమణి రత్నపు ప్రయోజనాలను పొందగలరు. ఏదైనా రత్నాన్ని ధరించే ముందు జాతకంలో గ్రహాల స్థితిని గమనించాలి. నీలమణి శక్తి బలపడి శనిదేవుని అనుగ్రహం పొందాలంటే, జాతక రీత్యా ధరించవచ్చునో లేదో తెలుసుకోవాలి. నీలమణిని ధరించడం వల్ల శని మహాదశ, అంతర్దశ, దుష్ట శక్తుల ఆగ్రహం తగ్గుతుంది. నీలమణిని ఎప్పుడు, ఎవరు, ఎలా ధరించాలో తెలుసుకుందాం.
నీలమణిని ఎప్పుడు ధరించాలి?
శని గ్రహానికి సంబంధించినది కాబట్టి, శనిదేవుడు అధిపతిగా ఉండే శనివారం రోజున నీలమణిని ధరించడం శుభప్రదంగా భావిస్తారు. అదే సమయంలో, దీనిని ధరించే ముందు శుద్ధి చేయడం అవసరమని కూడా బలమైన నమ్మకం.
నీలమణిని ఎలా ధరించాలి?
నీలమణి రత్నాన్ని పంచధాతువులో ఉంచి ధరించవచ్చు. ఈ రత్నాన్ని కనీసం 7 నుంచి 8 రోజుల పాటు ధరించాలి. శనివారం గంగాజలం ముందు నీలమణిని, పచ్చి పాలను శుద్ధి చేసుకోవాలి. తర్వాత శనీశ్వరుడికి సమర్పించాలి. కర్మకాండలు నిర్వహించి పూజలు చేస్తారు. కాసేపటి తర్వాత ఈ రత్నాన్ని మధ్య వేలికి మాత్రమే తొడగాలి.
నీలమణిని ఎవరు ధరించాలి?
నీలమణి రత్నాన్ని శనీశ్వరుని రత్నంగా భావిస్తారు. కాబట్టి, కుంభ, మకర రాశి, తుల రాశి వారికి నీలమణి రత్నాన్ని ధరించడం శుభదాయకంగా ఉంటుంది. పగడాలు, రూబీలు, ముత్యాలను నీలమణితో కలిపి ధరించకూడదు. అదే సమయంలో ఏదైనా రత్నాన్ని ధరించే ముందు జాతకంలో గ్రహాల స్థితిగతులను గమనించేందుకు జ్యోతిష్యుడి సలహా తీసుకోవడం మంచిది.
నీలమణి రత్నం వల్ల ఆరోగ్య ప్రయోజనం:
ఈ అత్యంత విలువైన, ఆకర్షణీయమైన యంత్రం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలగజేస్తుంది. శరీరాన్ని హార్మోనైజ్ చేసి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుంది. ఈ రత్నంలో రక్తప్రసరణను మెరుగుపరిచే గుణం ఉండటం వల్ల తల, కంటి సమస్యలు తగ్గేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది.
ఈ నీలమణి రత్నం ధరించడం వల్ల శుభాలు, సంపన్నత, ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మనలో ఆధ్మాత్మిక విశ్వాసాన్ని మెరుగుపరచడమే కాకుండా భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగల శాంతిని ప్రసాదిస్తుంది. ఆనందంతో పాటు మనస్సును తేలిక పరుస్తుంది. దీనిని నీలి రంగు రత్నం, నీలమణి, వఘ్నేశ్వర రత్నం అని కూడా పిలుస్తుంటారు. దీనిని ఇండియాతో పాటు అఫ్ఘనిస్థాన్, థాయ్‌లాండ్, మయన్మార్, శ్రీలంక వంటి దేశాల్లో ఎక్కువగా వినియోగిస్తారు.