Today Rasi phalalu: ఈ రాశుల వారి సమస్యలు తీరుతాయి.. ఆర్థిక లాభం-today december 12th rasi phalalu in telugu check zodiac signs horoscope predictions ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: ఈ రాశుల వారి సమస్యలు తీరుతాయి.. ఆర్థిక లాభం

Today Rasi phalalu: ఈ రాశుల వారి సమస్యలు తీరుతాయి.. ఆర్థిక లాభం

Peddinti Sravya HT Telugu
Dec 12, 2024 04:00 AM IST

Today Rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 21.12.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Today Rasi phalalu: ఈ రాశుల వారి సమస్యలు తీరుతాయి.. ఆర్థిక లాభం
Today Rasi phalalu: ఈ రాశుల వారి సమస్యలు తీరుతాయి.. ఆర్థిక లాభం (Pixabay)

రాశిఫలాలు (దిన ఫలాలు) : 12.12.2024

ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: మార్గశిరం, వారం : గురువారం, తిథి : శు. ద్వాదశి, నక్షత్రం : అశ్విని

మేషం

ఆదాయానికి తగ్గట్టుగా ప్రణా ళికలు వేసుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారిని సంప్రదిస్తారు. పెద్దల సలహా తీసుకోండి. ఇతరులకు బాధ్యతలు అప్పగించవద్దు. ఇంటి విషయాలపై శ్రద్ద వహించండి. పిల్లల దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. కొత్త యత్నాలు మొదలుపెడతారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. వ్యాపకాలు సృష్టించుకుంటారు.

వృషభం

గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అన్ని విధాలా కలిసివచ్చే సమయం. చక్కని ప్రణాళికలతో ముందుకు సాగుతారు. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పెట్టుబడులకు అనుకూలం, శుక్రవారం నాడు వనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. అవతలివారి స్థితిగతులు క్షుణ్ణంగా తెలుసుకోండి. తొందరపడి మాట ఇవ్వొద్దు.

మిధునం

ఈ వారం ఆశాజనకం. సమర్థతను చాటుకుంటారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త, ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు అర్ధాంతరంగా ముగిస్తారు. నోటీసులు అందుకుంటారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. వాహనం ఇతరులకివ్వవద్దు.

కర్కాటకం

ఆర్థికస్థితి నిరాశాజనకం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. పిల్లలకు శుభఫలితాలున్నాయి. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగి స్తుంది. ఆహ్వానం అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి.

సింహం

పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రతికూలతలను అనుకూలంగా మలుచు కుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. దూరపు బంధువులతో సంభా షిస్తారు. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మొండిగా యత్నాలు సాగిస్తారు. అవకాశాలను తక్షణం అంది పుచ్చుకోండి. వేడుకకు హాజరవుతారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.

కన్య

లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. ఉత్సాహంగా యత్నాలు సాగించండి సాయం ఆశించవద్దు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపుల్లో అశ్రద్ధ తగదు. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. చీటికిమాటికి అసహనం చెందుతారు. సిమితంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.

తుల

వ్యవహారానుకూలత, ధన ప్రాప్తి ఉన్నాయి. విజ్ఞతతో వ్యవహరిస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. గృహం సందడిగా ఉంటుంది. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి కొందరికి ఆపోహ కలిగిస్తుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త అతిగా శ్రమించ వద్దు. పిల్లల అత్యుత్సాహం అదుపు చేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి.

వృశ్చికం

కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. శనివారం నాడు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రలోభాలకు లొంగవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు.

ధనుస్సు

వ్యవహారాలతో తీరిక ఉండదు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఒత్తిడికి గురికావద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. అయినవారు మీ ఆశక్తతను అర్థం చేసుకుంటారు. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ప్రయాణంలో కొత్త వ్యక్తులతో జాగ్రత్త.

మకరం

ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు సామాన్యం. ఆలోచనలు క్రియా రూపం దాల్చుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అంతర్యం గ్రహించండి. బుధవారం నాడు అందరితోను సౌమ్యంగా, మాట్లాడండి. ముక్కుసూటిగా పోయే మీ వైఖరి వివాదాస్పదమవుతుంది.

కుంభం

పరిస్థితులు చక్కబడతాయి. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పొదుపునకు అవకాశం లేదు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. అందరితో మితంగా సంభాషించండి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు.

మీనం

ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. తరచూ ఆత్మీయులతో సంభాషిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. ముఖ్యుల కలయిక వీలుపడదు. ధైర్యంగా యత్నాలు కొనసాగిస్తారు. కనిపించకుండాపోయిన వస్తువులు లభ్యమవుతాయి.

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner