Karkataka Rasi 2025 Telugu: కర్కాటక రాశి ఫలాలు.. నూతన సంవత్సరంలో ఖర్చులు అధికం-karkataka rasi 2025 telugu know yearly horoscope predictions for cancer zodiac sign ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Karkataka Rasi 2025 Telugu: కర్కాటక రాశి ఫలాలు.. నూతన సంవత్సరంలో ఖర్చులు అధికం

Karkataka Rasi 2025 Telugu: కర్కాటక రాశి ఫలాలు.. నూతన సంవత్సరంలో ఖర్చులు అధికం

HT Telugu Desk HT Telugu
Dec 19, 2024 10:56 AM IST

Karkataka Rasi 2025 Telugu: కర్కాటక రాశి జాతకులకు 2025 రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ హిందుస్తాన్ టైమ్స్ తెలుగు పాఠకులకు అందిస్తున్న కర్కాటక రాశి జాతక ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

కర్కాటక రాశి 2025 సంవత్సర రాశి ఫలాలు
కర్కాటక రాశి 2025 సంవత్సర రాశి ఫలాలు

2025 సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గణన ఆధారంగా కర్కాటక రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోవచ్చు. బృహస్పతి మే నుండి వ్యయ స్థానమునందు సంచరించనున్నాడు. శని 9వ స్థానమునందు సంచరించనున్నాడు. రాహువు మే నుండి అష్టమ స్థానము నందు, కేతువు మే నుండి ద్వితీయ స్థానమునందు సంచరించనున్నాడు. ఈ గ్రహ సంచారాల ఫలితంగా కర్కాటక రాశి జాతకులకు 2025 సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలు కలుగనున్నాయి.

yearly horoscope entry point

కర్కాటక రాశి వారికి 2025లో ఖర్చులు అధికమగును. వ్యక్తిగత విషయాల కొరకు, కుటుంబ అవసరాల కొరకు ప్రయాణముల కొరకు ధనమును ఖర్చు చేసెదరు. వాక్ స్థానములో కేతువు ప్రభావంచేత ఆవేశపూరిత నిర్ణయాలు, గొడవలు అధికమగును. ఆరోగ్య విషయాల యందు శ్రద్ధ వహించాలి. పనుల యందు చికాకులు అధికమగును. కర్కాటక రాశి వారికి 2025 సంవత్సరంలో కోపము, ఆవేశము, వాదన వంటివి పెరిగే సూచనలు కనపడుచున్నవి. శాంతముగా వ్యవహరించుటకు ప్రయత్నించండి.

ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు?

2025 సంవత్సరం కర్కాటక రాశి విద్యార్థులకు మధ్యస్థం నుండి శుభ ఫలితాలను కలిగించును. వ్యాపారస్తులకు ఖర్చులు అధికమగును. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతమగును. విదేశీ ప్రయత్నములు అనుకూలించును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు, చికాకులు కలుగును. అయినప్పటికి ప్రమోషన్లు వంటివి కలసి వచ్చును. ఉద్యోగ మార్పు వంటివి కలసివచ్చును.

కర్కాటక రాశి రైతాంగానికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగా లేదు. కర్కాటక రాశి వారు కోర్టు విషయాలయందు, వ్యవహారాలయందు జాగ్రత్త వహించాలని సూచన. స్త్రీలకు అనారోగ్య సమస్యలు మరియు కుటుంబ సమస్యలు ఇబ్బంది కలిగించును. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి.

ఆచరించాల్సిన పరిహారాలు

కర్కాటక రాశి వారు మరింత శుభఫలితాలు ఈ సంవత్సరం పొందడం కోసం సోమవారం శివారాధన చేయండి. శనివారం రోజు విఘ్నేశ్వరుని, దుర్గాదేవిని పూజించాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ దర్శనం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

జనవరి 2025:

ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. గతంలో నిలిచిన పనులు పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణాలు ఉంటాయి. శుభకార్యములకు ఆటంకాలేర్పడును. స్త్రీ పరిచయములు, అధికారులతో విరోధాలు, పనిభారము పెరుగును. అదనపు రాబడి ఉండును.

ఫిబ్రవరి 2025:

ఈ మాసం కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉన్నది. వ్యాపార ఉద్యోగ ప్రయత్నములు ఫలించును. మంచి లాభములుంటాయి. వంశ వృద్ధియగును. స్త్రీపరంగా సహాయము లభించును. వాహన సౌఖ్యం. కొద్దిపాటి అపజయం. వ్యవసాయరంగములో లాభములు.

మార్చి 2025:

ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. ధన వ్యయం ఉండును. నూతన పరిచయములు పెరుగుతాయి. శుభకార్యములు చేసెదరు. గృహములో మార్పులు ఉంటాయి. ఇంటబయటా విరోధములుంటాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. యాత్రలు చేస్తారు. వ్యాపారంలో లాభాలుంటాయి.

ఏప్రిల్ 2025:

ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. శుభకార్యములు చేయుదురు. భార్యాపిల్లలతో కలసి వినోదయాత్రలకు వెళ్ళెదరు. సంతానం గూర్చి ఆలోచనలు ఉంటాయి. మానసికానందం లభిస్తుంది. రుణాలు చేయుదురు.

మే 2025:

ఈ మాసం కర్కాటక రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఇబ్బందులుంటాయి. ఉద్యోగ విధుల నిర్వహణ అజాగ్రత్త తగదు. కొత్తవారితో పరిచయాలేలు ఏర్పడుతాయి. బంధువులతో, స్నేహితులతో ఆనందముగా గడిపెదరు. సంఘంలో గౌరవం ఏర్పడును.

జూన్ 2025:

ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో విరోధములు ఏర్పడు సూచనలున్నాయి. ఉద్యోగస్తులకు ఆటంకాలు ఏర్పడును. మృష్టాన్న భోజనం ఉంటుంది. విపరీతమైన ఆలోచనలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. అధికముగా శ్రమించెదరు.

జూలై 2025:

ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. స్నేహితుల వలన ధనము ఖర్చు చేయుదురు. కోర్టు వ్యవహారములు అనుకూలించును. ప్రయత్నించిన కార్యములు ఫలించును. ధనలాభం. బంధుమిత్రులతో అభిప్రాయ బేధములు ఏర్పడును. అనారోగ్య సమస్యలుంటాయి.

ఆగస్టు 2025:

ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. బంధువులతో విరోధాలు ఉంటాయి. వ్యాపారస్తులకు లాభదాయకము. దేవాలయ సందర్శన చేస్తారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. అబద్ధాలు ఆడతారు. కొంతకాలంగా ఆగిన పనులు పూర్తవుతాయి. మాట పట్టింపులు ఉంటాయి. డిపాజిట్లు, చీటీలు కలసివచ్చును. ఎత్తు నుండి జారిపడే ప్రమాదం పొంచి ఉంది.

సెప్టెంబర్ 2025:

ఈ మాసంలో మీకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. కొత్త వస్త్రములు కొంటారు. ఆకస్మిక ధన లాభం ఉండును. స్త్రీల వలన కష్టములుంటాయి. ధనమునకు ఇబ్బంది కలుగును. మీ కారణంగా ఇతరులు బాధపడాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగును. జాయింట్ వ్యాపారాలలో సఖ్యత ఉండును. నరముల బలహీనత, నిద్రలేమి ఇబ్బంది పెట్టును. మానసికానందము లభిస్తుంది.

అక్టోబర్ 2025:

ఈ మాసం కర్కాటక రాశి జాతకులకు అనుకూలంగా లేదు. వ్యాపారములో నష్టములు సూచితం. అనవసర ఖర్చులు ఉంటాయి. కుటుంబములో గొడవలు ఏర్పడతాయి. ప్రత్యర్థుల విజయం. పదవులు కోసం ప్రయత్నములు చేస్తారు. తలచిన పనులలో ఆటంకాలేర్పడతాయి. మిత్రులు మిమ్మల్ని అపార్ధం చేసుకుంటారు.

నవంబర్ 2025:

ఈ మాసంలో మీకు అనుకూలంగా లేదు. నమ్మినవారు మోసం చేస్తారు. నూతన పరిశ్రమలు ప్రారంభం. కొత్త వ్యక్తుల ద్వారా ధనలాభముంటుంది. అనారోగ్య సమస్యలు ఉంటాయి. మధ్యవర్తిత్వము వ్యవహరించుట మంచిది కాదు. కోర్టు తగాదాలకు అనుకూలం కాదు. ప్రమాద సూచనలు ఉన్నాయి. జాగ్రత్త అవసరం.

డిసెంబర్ 2025:

ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. భూమి, గృహాభివృద్ధికి అవకాశం. కొత్త పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారపరంగా లాభదాయకం. శుభకార్యాలకు మంచిది. గౌరవానికి కొంత భంగం కలుగుతుంది. వృధా ప్రయాణాలుంటాయి. మీ మాటతీరు వల్ల ఇతరులు ఇబ్బంది పడతారు. మీరు చేసే పనులుఆలస్యమగును.

- చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, పంచాంగ కర్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు

ఆధ్యాత్మిక వేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
ఆధ్యాత్మిక వేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner

సంబంధిత కథనం