AP Inter 2025 Exams: ఏపీ ఇంటర్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల.. మార్చి 1 నుంచి పరీక్షల నిర్వహణ..
AP Inter 2025 Exams: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది.మార్చి 1నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రకటించారు.ఇంటర్మీడియట్ రెగ్యులర్,ఒకేషనల్ విద్యార్థులకు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతాయి.
AP Inter 2025 Exams: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2025 పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా విడుదల చేశారు. మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఇంటర్ రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఒకేషనల్ విద్యార్థులకు కూడా ఇవే తేదీలలో పరీక్షలు నిర్వహిస్తారు. ఒకేషనల్ విద్యార్థుల టైమ్ టేబుల్ విడిగా విడుదల చేస్తారు.
ఫస్టియర్ విద్యార్థులకు ఇలా…
2025 మార్చి 1 శనివారం ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పేపర్ 1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరుగుతుంది. మార్చి 4వ తేదీన పేపర్ 1 ఇంగ్లీష్ పేపర్ 1 పరీక్ష జరుగతుుంది. మార్చి 6వ తేదీన పార్ట్ 3లో మ్యాథ్స్ పేపర్ 1ఏ, బోటనీ పేపర్ 1, సివిక్స్ పేపర్ 1 పరీక్షలు జరుగుతాయి. మార్చి 8వ తేదీన మ్యాథ్స్ పేపర్ 1బి, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షను నిర్వహిస్తారు. మార్చి 11న ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్ష జరుగుతుంది.
మార్చి 13న కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 1 పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 17న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్(బైపీసీ విద్యార్థుల కోసం) పరీక్ష నిర్వహిస్తారు. మార్చి 19న మోడరన్ లాంగ్వేజ్ పేపర్1, జాగ్రఫీ పేపర్ 1 పరీక్ష జరుగుతుంది.
ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఇలా...
ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు మార్చి 3వ తేదీ సోమవారం పేపర్ 2 సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్ష జరుగుతుంది.
మార్చి 5వ తేదీన పార్ట్1లో ఇంగ్లీష్ పేపర్ 2 పరీక్ష జరుగతుుంది. మార్చి 7వ తేదీన పార్ట్ 3లో మ్యాథ్స్ పేపర్ 2ఏ, బోటనీ పేపర్ 2, సివిక్స్ పేపర్ 2 పరీక్షలు జరుగుతాయి. మార్చి 10వ తేదీన మ్యాథ్స్ పేపర్ 2బి, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2 పరీక్షలను నిర్వహిస్తారు. మార్చి 12న ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2 పరీక్ష జరుగుతాయి.
మార్చి 15న కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 18న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, లాజిక్ పేపర్ 2, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్ 2(బైపీసీ విద్యార్థుల కోసం) పరీక్ష నిర్వహిస్తారు. మార్చి 20 న మోడరన్ లాంగ్వేజ్ పేపర్2, జాగ్రఫీ పేపర్ 2 పరీక్షలు జరుగుతాయి.
అదనపు సబ్జెక్టులు..
ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్ పరీక్షను ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 10నుంచి ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ పరీక్షను 2025 ఫిబ్రవరి 3న నిర్వహిస్తారు.
ప్రాక్టికల్ పరీక్షలు..
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఒకేషనల్ విద్యార్థులకు ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు రెండు సెషన్లలో ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. సమగ్ర శిక్ష ఒకేషనల్ ట్రేడ్ పరీక్షలను ఫిబ్రవరి 22న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు.
సంబంధిత కథనం