Google MoU With AP Govt : ఏపీలో గూగుల్ పెట్టుబడులు, విశాఖలో ఐటీ అభివృద్ధికి ఎంవోయూ-google signed mou with ap govt investment in it sector visakhapatnam minister lokesh announced ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Google Mou With Ap Govt : ఏపీలో గూగుల్ పెట్టుబడులు, విశాఖలో ఐటీ అభివృద్ధికి ఎంవోయూ

Google MoU With AP Govt : ఏపీలో గూగుల్ పెట్టుబడులు, విశాఖలో ఐటీ అభివృద్ధికి ఎంవోయూ

Dec 11, 2024, 10:03 PM IST Bandaru Satyaprasad
Dec 11, 2024, 10:03 PM , IST

Google MoU With AP Govt : ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ సంస్థ ముందుకొచ్చింది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో గూగుల్‌, ఏపీ ప్రభుత్వం ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు. విశాఖలో వ్యూహాత్మక పెట్టుబడులకు గూగుల్‌ సంస్థ అంగీకరించింది. గూగుల్ పెట్టుబడులపై లోకేశ్ ఎక్స్ లో వివరాలు తెలిపారు.

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ సంస్థ ముందుకొచ్చింది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో గూగుల్‌, ఏపీ ప్రభుత్వం ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు. 

(1 / 6)

విశాఖలో వ్యూహాత్మక పెట్టుబడులకు గూగుల్‌ సంస్థ అంగీకరించింది. ఏపీలో పెద్ద ఎత్తున ఐటీ అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. గూగుల్‌ ప్రతిపాదిత పెట్టుబడులను స్వాగతిస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఒప్పందం దేశ ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

(2 / 6)

విశాఖలో వ్యూహాత్మక పెట్టుబడులకు గూగుల్‌ సంస్థ అంగీకరించింది. ఏపీలో పెద్ద ఎత్తున ఐటీ అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. గూగుల్‌ ప్రతిపాదిత పెట్టుబడులను స్వాగతిస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఒప్పందం దేశ ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ( )

గూగుల్ పెట్టుబడులపై మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా వివరాలు తెలిపారు.  ఇవాళ అమరావతిలో గూగుల్ గ్లోబల్ నెట్‌వర్కింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే నేతృత్వంలోని బృందం పర్యటించిందన్నారు. ఈ పర్యటనలో డిసెంబరు 5న జరిగిన అవగాహన ఒప్పందాన్ని మేరకు ఏపీ ప్రభుత్వం, గుగూల్ సంస్థ మధ్య ఎంవోయూ జరిగిందని ప్రకటించారు.  

(3 / 6)

ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ఎకోసిస్టమ్ ఏర్పాటవుతుందని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. మంత్రి లోకేశ్ అమెరికా పర్యటనలో గూగుల్ ఉన్నతస్థాయి ప్రతినిధులతో పెట్టుబడులపై చర్చించారు. ఈ చర్చలు ఫలవంతమై తాజాగా ఒప్పందం చేసుకోవడంపై మంత్రి లోకేశ్ సంతోషం వ్యక్తంచేశారు. 

(4 / 6)

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగిందని మంత్రి లోకేశ్ తెలిపారు.ఆర్సెలర్స్ మిట్టల్/నిప్పన్ స్టీల్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, భారత్ ఫోర్జ్‌తో సహా పలు భారీ పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు.

(5 / 6)

కూటమి ప్రభుత్వం అనుకూలమైన విధానాలు, ప్రోత్సాహకాలు అందించడానికి కట్టుబడి ఉందని మంత్రి లోకేశ్ అన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు సమిష్టింగా పనిచేస్తున్నామన్నారు. తాజా ఒప్పందం ఆంధ్రప్రదేశ్‌కు ఉజ్వల భవిష్యత్తును అందించడంలో ముఖ్యమైన దశను సూచిస్తుందన్నారు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు