CTET Admit Cards 2024: సీబీఎస్ఈ సీటెట్ డిసెంబర్ పరీక్ష హాల్ టికెట్లను ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
CTET Admit Cards 2024: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 14వ తేదీన దేశవ్యాప్తంగా జరగనుంది. ఈ పరీక్ష కోసం అడ్మిట్ కార్డులు డిసెంబర్ 12వ తేదీన విడుదల అవుతాయి. వాటిని అభ్యర్థులు సీబీఎస్ఈ సీటెట్ అధికారిక వెబ్సైట్ ctet.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
CTET Admit Cards 2024: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) గురువారం, డిసెంబర్ 12వ తేదీన సీటెట్ అడ్మిట్ కార్డు 2024ను తన అధికారిక వెబ్సైట్ ctet.nic.in లో విడుదల చేయనుంది. ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డును సీబీఎస్ఈ సీటెట్ అధికారిక వెబ్సైట్ ctet.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఢిల్లీలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కు అప్పగించింది.
రెండు షిఫ్ట్ ల్లో పరీక్ష
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) రెండు షిఫ్టుల్లో జరుగుతుందని, మొదటి షిఫ్ట్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, పేపర్-2 ఉదయం షిఫ్టులో, పేపర్-1 సాయంత్రం షిఫ్టులో జరుగుతాయని సీబీఎస్ఈ (CBSE) వెల్లడించింది. రెండు స్థాయిలకు (ఒకటి నుంచి ఐదో తరగతి, ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు) టీచర్ కావాలనుకునే అభ్యర్థులు రెండు పేపర్లకు (పేపర్ 1, పేపర్ 2) హాజరు కావాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రం హిందీ/ ఇంగ్లిష్ లో ఉంటుంది.
పరీక్ష తేదీ: సీటెట్ పరీక్షను 2024 డిసెంబర్ 14న నిర్వహిస్తారు. ఏ నగరంలోనైనా ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే 2024 డిసెంబర్ 15న కూడా పరీక్ష నిర్వహించవచ్చని సీబీఎస్ఈ తెలిపింది.
సీబీఎస్ఈ సీటెట్ 2024 హాల్ టికెట్లను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
సీబీఎస్ఈ సీటెట్ 2024 డిసెంబర్ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.
- సీబీఎస్ఈ సీటెట్ అధికారిక వెబ్సైట్ ctet.nic.in ను ఓపెన్ చేయండి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న సీటెట్ అడ్మిట్ కార్డ్ 2024 లింక్ పై క్లిక్ చేయండి.
- అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- వివరాలు నమోదు చేసి, సబ్మిట్ పై క్లిక్ చేస్తే మీ అడ్మిట్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
- అడ్మిట్ కార్డు చెక్ చేసుకుని ఆ పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి.
- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.
- మరింత సమాచారం కోసం, అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.