Shani Sade Sathi: శని సంచారంలో మార్పు: 2025లో ఈ రాశి వారికి ఏలినాటి శని నుంచి విముక్తి!
Shani Sade Sathi: 2025 సంవత్సరంలో శని తన సంచారాన్ని మార్చుకోనున్నాడు. మార్చి నెలలో శని భగవానుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో శని భగవానుడి ఏలినాటి శని ప్రభావం నుంచి ఓ రాశి వారికి విముక్తి లభిస్తుంది. 2027 లో వారు మళ్ళీ శని ప్రభావాన్ని ఎదుర్కొంటారు, ఎలాగో తెలుసుకుందాం.
గ్రహాలన్నింటిలో శని గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. శనిదేవుడు కర్మ ఫలితాలను ఇచ్చే వ్యక్తిగా పరిగణిస్తారు. అందుకే శని గ్రహాన్ని పాపాత్మకమైన, క్రూరమైన గ్రహం అంటారు. వాస్తవానికి శని వ్యక్తులు చేసే కర్మలకే ఫలితాలను ఇస్తాడు. అంటే మంచి చేస్తే మంచినే తిరిగి ఇస్తాడు. చెడు చేస్తే చెడు ఫలితాలనే తిరిగి ఇస్తాడు. శని అనుకూలంగా ఉంటే వ్యక్తి జీవితంలో డబ్బు, ఐశ్వర్యం, ఆనందం దేనీకీ కొదవే ఉండదు. అలాగే శని భగవానుడి అనుగ్రహం లేకుండా వ్యక్తి జీవితం కష్టాలలో, చిక్కుల్లో కొట్టిమిట్టాడుతుంది. అందుకే శని గ్రహం అంటే ప్రతి ఒక్కరూ భయపడతారు.
జ్యోతిష్య శాస్త్రంలో శని రాశి మార్పు చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే శనిదేవుడు అన్ని గ్రహాల కంటే నెమ్మదిగా కదులుతాడు.శని దేవుడు దాదాపు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిచక్రాన్ని మార్చి తదుపరి రాశిలోకి ప్రవేశిస్తాడు. శని రాశి మారడం వల్ల కొంత లాభం, కొందరికి నష్టం జరుగుతుంది. శని రాశి మారడం వల్ల కొన్ని రాశుల మీద శని గ్రహం ఏలినాటి శని, అర్థాష్టమ శని మొదలవుతుంది. అలాగే కొందరికి వీటి నుంచి విముక్తి లభిస్తుంది.
ప్రస్తుతం శని తన సొంత రాశి కుంభంలో సంచరిస్తున్నాడు. అందువల్ల 2024 శని సంవత్సరంగా పిలుస్తారు. వచ్చే ఏడాది అంటే 2025లో శని తన రాశిని మార్చబోతున్నాడు. కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు.. దీని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి ఏలినాటి, అర్థాష్టమ శని నుంచి విముక్తి కలుగుతుంది. శని రాశిలో మార్పు ఐదు రాశులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం కుంభ, మకర, మీన రాశులలో ఏలినాటి శని కొనసాగుతుండగా కర్కాటక, వృశ్చిక రాశుల్లో అర్థాష్టమ శని కొనసాగుతున్నాయి.
ఏలినాటి శని నుంచి ఏ రాశి వారికి విముక్తి లభిస్తుంది?
మార్చి 29, 2025న శనిగ్రహం కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తుంది. శని రాశి మారిన వెంటనే కొన్ని రాశుల వారికి ఏలినాటి శని, అర్థాష్టమ శని నుంచి ఉపశమనం లభిస్తే, మరికొందరికి వీటి వల్ల బాధలు మొదలవుతాయి. శని రాశి మార్పుతో మకర రాశి వారికి ఏలినాటి శని నుంచి విముక్తి లభిస్తుంది. ఏడేళ్లుగా పట్టి పీడిస్తున్న బాధలు తొలగిపోతాయి. అయితే ఇంతటితో వీరిపై శని ప్రభావం తగ్గిపోదు.. మకర రాశి వారు 2027 లో శనితో తిరిగి తలపడతారు. రెండు సంవత్సరాల తరువాత వీరిపై శని నీడ ప్రారంభమవుతుంది. మకర రాశి 2027 జూన్ 3 నుండి 2029 ఆగస్టు 8 వరకు శని ప్రభావం వీరిపై ఉంటుంది. 2025 లో కొంత ఉపశమనం పొందిన తరువాత, శని మకరంలో మళ్ళీ తన ప్రభావాన్ని చూపిస్తాడు. అటువంటి పరిస్థితిలో, మకర రాశి వారు శనికి సంబంధించిన పరిహారాలు పాటించాలి. మరింత ఖచ్చితమైన సమాచారం కోసం, మీరు జాతకంలో శని స్థానాన్ని తెలుసుకోవాలి. తరువాత కొద్ది రోజుల పాటు ఎదుర్కొన్న తర్వాత పూర్తిగా విముక్తి పొందుతారు. తిరిగి మకర రాశి వారు 2036 ఆగస్టు 27 నుండి 2038 అక్టోబర్ 22 వరకు శని ధయ్యా ప్రభావం ఉంటుంది.
ఏ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుందంటే..
శని రాశి చక్ర మార్పు కారణంగా కుంభ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం మొదలవుతుంది. కుంభరాశిపై శని సాడే సతీ 2020 జనవరి 24న ప్రారంభమవుతుంది. ఇది జూన్ 3, 2027 వరకు అమల్లో ఉంటుంది. ప్రస్తుతం, శని మధ్య దశ కుంభ రాశి ప్రజలపై నడుస్తోంది. దీని తరువాత 8 ఆగస్టు 2029 నుండి 31 మే 2032 వరకు శని ధయ్యా, 22 అక్టోబర్ 2038 నుండి 29 జనవరి 2041 వరకు ఏలినాటి శని అమలులో ఉంటుంది.
కుంభ రాశి వారికి ఏలినాటి శని మూడో దశ, మీన రాశి వారికి రెండవ దశ, మేష రాశి వారికి మొదటి దశ మొదలవుతాయి. దీనితో పాటు శని సంచారం వల్ల సింహ, ధనుస్సు రాశుల వారికి అర్థాష్టమ శని ప్రారంభం కాబోతుంది. అందువల్ల రానున్న రెండున్నర సంవత్సరాల పాటు ఈ ఐదు రాశుల వారికి శని వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి మీద దాని ప్రభావం కనిపిస్తుంది. అందుకే వీలైనంత వరకు శని దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించాలి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.