Allu Arjun Petition : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు, హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ దాఖలు
Allu Arjun Petition : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విషయంలో హీరో అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. చిక్కడపల్లి పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
Allu Arjun Petition : హీరో అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఈ నెల 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హీరో అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్ 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోని కారణంగా థియేటర్ యాజమాన్యంపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే ఈ కేసు విషయంలో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
ముగ్గురి అరెస్ట్
పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ యజమానితో పాటు, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద ఈ నెల 4న పుష్ప2 సినిమా బెనిఫిట్ షో సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా....ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. రేవతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో హీరో అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తాజాగా ముగ్గురిని అరెస్ట్ చేశారు.
పుష్ప 2 సినిమా చూసేందుకు తన టీమ్ తో కలిసి సంధ్య థియేటర్‌కు వచ్చిన నటుడు అల్లు అర్జున్ పోలీసులకు ఎలాంటి ముందస్తు సమాచారం అందించలేదని సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాన్ష్ యాదవ్ తెలిపారు. థియేటర్ యాజమాన్యం ప్రేక్షకులను కంట్రోల్ చేసేందుకు తగిన భద్రత ఏర్పాట్లు చేయలేదన్నారు. హీరో అల్లు అర్జున్ వచ్చారని తెలుసుకుని లోయర్ బాల్కనీలోకి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ రావడంతో తొక్కిసలాట జరిగి మహిళ మరణించిందని డీసీపీ ఆకాన్ష్ యాదవ్ అన్నారు.
తొక్కిసలాట ఘటనతో హీరో అల్లు అర్జున్, అతని ప్రైవేట్ సెక్యూరిటీ టీమ్, సంధ్య థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ తొక్కిసలాటలో రేవతి(32) అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు సాయి తేజ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. రేవతి భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు సాయి తేజ, సాంగ్వికతో కలిసి సంధ్య థియేటర్‌కి వెళ్లింది. అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రాగానే తొక్కిసలాట జరిగి రేవతి, సాయి తేజ జనంలో చిక్కుకున్నారు. ఊపిరాడక రేవతి మృతి చెందారు. సాయి తేజను పోలీసులు జనాల నుంచి బయటకు తీసుకొచ్చి సీపీఆర్ చేశారు. అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు BNS సెక్షన్ 105, 118 (1) కింద కేసు నమోదు చేశారు.
సంబంధిత కథనం