తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live December 12, 2024: Warangal Kaloji Kalakshetram : కాళోజీ కళాక్షేత్రానికి పగుళ్లు..! రూ.90 కోట్లతో కట్టినా ఎందుకిలా జరిగింది..?
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 12 Dec 202405:04 PM IST
తెలంగాణ News Live: Warangal Kaloji Kalakshetram : కాళోజీ కళాక్షేత్రానికి పగుళ్లు..! రూ.90 కోట్లతో కట్టినా ఎందుకిలా జరిగింది..?
- Warangal Kaloji Kalakshetram: వరంగల్ కాళోజీ కళాక్షేత్రానికి పగుళ్లు పట్టాయి. రూ.90 కోట్లతో నిర్మాణం జరగా.. ఇటీవలనే ప్రారంభించారు. నెల కూడా దాటకముందే ఈ పగుళ్ల వ్యవహారం కలకలం రేపుతోంది. క్రెడిట్ కొట్టేసేందుకు హడావిడిగా పనులు చేసి… ప్రజాధనాన్ని వృథా చేస్తారా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
Thu, 12 Dec 202404:02 PM IST
తెలంగాణ News Live: Komuravelli Mallanna Jatara 2025 : కొమరవెల్లి మల్లన్న జాతర తేదీలు ఖరారు - ఈనెల 29న కల్యాణం
- Komuravelli Mallanna Jatara 2025 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం, జాతర తేదీలు ఖరారయ్యాయి. డిసెంబర్ 29 ఉదయం 10.45 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి వారి కల్యాణం జరగనుంది. 19 జనవరి 2025 నుంచి 10 ఆదివారాలపాటు… 23 మార్చి 2025 వరకు జాతర నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయశాఖ నిర్ణయించింది.
Thu, 12 Dec 202403:33 PM IST
తెలంగాణ News Live: Hyderabad STPs : 'మూసీ' ప్రక్షాళనలో మరో అడుగు...! త్వరలోనే అందుబాటులోకి మరికొన్ని ఎస్టీపీలు
- Sewage Treatment Plants in Hyderabad : మరికొన్ని ఎస్టీపీలను ప్రారంభించేందుకు హైదరాబాద్ జలమండలి సిద్ధమవుతోంది. జనవరి నాటికి 9 ఎస్టీపీలు ప్రారంభించాలని యోచిస్తోంది. ఇప్పటికే 11 ఎస్టీపీలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొత్త ఎస్టీపీల ప్రారంభంతో మూసీ నీటి ప్రక్షాళనలో మరో అడుగు ముందుకు పడినట్లు అవుతుంది.
Thu, 12 Dec 202412:35 PM IST
తెలంగాణ News Live: TG Dharani Portal Services : ధరణి పోర్టల్ సేవలకు తాత్కాలికంగా బ్రేక్ - ఎప్పటివరకంటే
- Telangana Dharani Portal Services : ధరణి సేవలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. డేటాబేస్ వెర్షన్ అప్ గ్రేడ్ కారణంగా... ధరణి పోర్టల్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని తెలిపింది. డిసెంబర్ 16వ తేదీ వరకు సేవలు ఉండవని పేర్కొంది.
Thu, 12 Dec 202411:34 AM IST
తెలంగాణ News Live: TG Assembly Sessions 2024 : ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభలో ప్రశ్నిస్తారా..? ఈసారి సీన్ ఎలా ఉండబోతుంది..?
- TG Assembly Sessions 2024 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి డిసెంబర్ 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏడాది పాలనపై రేవంత్ సర్కార్ సంతృప్తిని వ్యక్తం చేస్తుండగా… మరోవైపు బీఆర్ఎస్ అస్త్రాలను సిద్ధం చేస్తోంది. హామీల అమల్లో విఫలమైందంటూ విమర్శలు చేస్తోంది. అయితే ఈసారి కేసీఆర్ రాకపై ఆసక్తి నెలకొంది.
Thu, 12 Dec 202410:36 AM IST
తెలంగాణ News Live: Manchu Family Issue : మోహన్‌బాబుకు రాజాసింగ్ సలహా.. ఇకనైనా ఆ పని చేయాలని సూచన!
- Manchu Family Issue : మంచు ఫ్యామిలీ వివాదంలోకి పొలిటికల్ లీడర్లు ఎంట్రీ ఇచ్చారు. తాజాగా రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబుకు సలహాలు ఇచ్చారు. జర్నలిస్టుపై దాడి తప్పన్న రాజాసింగ్.. క్షమాపణలు చెప్పాలని సూచించారు. అటు మోహన్ బాబు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Thu, 12 Dec 202409:14 AM IST
తెలంగాణ News Live: Lagacharla Farmers : లగచర్ల రైతుకు బేడీలు - అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్..!
- లగచర్ల ఫార్మా బాధిత రైతుకు సంకెళ్లు వేయటం చర్చనీయాంశంగా మారింది. ఈర్యా నాయక్ అనే రైతుకు గుండె నొప్పి రావటంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఈ సమయంలో బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Thu, 12 Dec 202409:08 AM IST
తెలంగాణ News Live: Lagacharla Incident : గుండెనొప్పి వచ్చిన వ్యక్తికి.. బేడీలు వేస్తారా.. కేటీఆర్ ఫైర్
- Lagacharla Incident : వికారాబాద్ జిల్లా లగరచ్లలో అధికారులపై దాడి కేసు నిందితులు జైల్లో ఉన్నారు. అయితే.. వారిపట్ల ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. తాజాగా ఓ వ్యక్తికి బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ భగ్గుమంది. ప్రభుత్వంపై ఫైర్ అయ్యింది.
Thu, 12 Dec 202407:42 AM IST
తెలంగాణ News Live: Khammam Murders: అదో దండుపాళ్యం తరహా ముఠా.. ఖమ్మంలో వృద్ధ దంపతుల హత్య మిస్టరీని చేధించిన పోలీసులు
- Khammam Murders: తొలుత ఫోన్ నంబర్ సేకరిస్తారు.. ఆపై ఇంట్లో అద్దెకు దిగుతామంటూ మాటలు కలుపుతారు.. వృద్ధుల ఇళ్ల పరిసరాలను ఒకట్రెండుసార్లు పరిశీలిస్తారు.. అనువైన సమయంలో వృద్ధులను మట్టుబెట్టి బంగారం, సొమ్ము కాజేస్తారు. సరిగ్గా ఇదే మాదిరిగా నవంబర్ 27న నేలకొండపల్లిలో హత్యలు జరిగాయి.
Thu, 12 Dec 202407:25 AM IST
తెలంగాణ News Live: Warangal Development : వరంగల్ అభివృద్ధిపై రేవంత్ సర్కారు స్పెషల్ ఫోకస్ ఎందుకు?
- Warangal Development : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. వరంగల్ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉత్తర తెలంగాణకు తలమానికంగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. అటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. వరంగల్ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎందుకో ఓసారి చూద్దాం.
Thu, 12 Dec 202404:59 AM IST
తెలంగాణ News Live: Attempt Murder case on Mohan Babu : మోహన్‌బాబుపై అటెంప్ట్ మర్డర్ కేసు.. మంచు లక్ష్మి ఇంట్రెస్టింగ్ పోస్ట్!
- Attempt Murder case on Mohan Babu : మంచు ఫ్యామిలీ వివాదం చినికి చినికి గాలి వానగా మారుతోంది. తాజాగా మోహన్ బాబుపై తెలంగాణ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. జర్నలిస్టుపై దాడి ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి ఆసక్తికర పోస్టు చేశారు.
Thu, 12 Dec 202404:14 AM IST
తెలంగాణ News Live: Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్‌డేట్.. తెలంగాణ ప్రజలకు కొత్త సంవత్సరం కానుక!
- Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రభుత్వం నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈనెల ఆఖరు వరకు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ఆ వెంటనే లబ్ధిదారుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. తాజాగా మంత్రి పొంగులేటి ఈ పథకంపై సమీక్ష నిర్వహించారు.
Thu, 12 Dec 202402:29 AM IST
తెలంగాణ News Live: Mancherial Sucides: మంచిర్యాలలో విషాదం, కొడుకు అప్పులకు బలైన కుటుంబం.. నలుగురు ఆత్మహత్య
- Mancherial Sucides: మంచిర్యాల జిల్లా తాండూరులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం రేపింది. కొడుకు చేసిన అప్పులు తీర్చలేక తల్లిదండ్రులతో పాటు సోదరి కూడా ప్రాణాలు కోల్పోయింది. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యలు చేసుకోవడం స్థానికులు విషాదంలో నింపింది.