Gunde Ninda Gudi Gantalu Today Episode: సంజు గ్యాంగ్‌ను ఇటుకలతో బాదిన మీనా.. బతికిపోయిన శ్రుతి.. బాలుకు ఇద్దరు భార్యలు
Gunde Ninda Gudi Gantalu Serial December 12 Episode: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 12 ఎపిసోడ్‌లో శ్రుతిని కలవడానికి మీనా రెస్టారెంట్‌కు వెళ్తుంది. అక్కడ మాస్క్‌లు పెట్టుకుని సంజు గ్యాంగ్ శ్రుతిపై యాసిడ్ పోయడానికి ట్రై చేయడం చూసిన మీనా వాళ్లపై ఇటుకలతో దాడి చేస్తుంది. దెబ్బకు వాళ్లు పారిపోతారు.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మీనాకు కాల్ చేసిన శ్రుతి ఒక్కసారి కలవాలంటుంది. ముందు రానన్న మీనా శ్రుతి బతిమిలాడేసరికి ఒప్పుకుంటుంది. మరోవైపు శ్రుతి వెళ్లడాన్ని సంజు మనుషులు చూసి అతనికి కాల్ చేసి చెబుతారు.
ఎలా చెప్పాలి
మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి పిచ్చివాడిని చేసింది కదా. ఆమె ఇప్పుడు ఒంటరిగా వెళ్తుంది. టెన్షన్‌గా ఉంది అని వాళ్లు చెబుతారు. దాంతో సంజు వస్తానంటాడు. దాన్ని ఫాలో అవ్వమన్నాడని చెప్పి శ్రుతిని సంజు మనుషులు ఫాలో అవుతారు. ఏయ్ శ్రుతి ఈరోజు నిన్ను ఎవడు కాపాడలేడే. వస్తున్నా అని సంజు అనుకుంటాడు. శ్రుతి గురించి బాలుకు చెప్పాలా వద్దా, చెబితే ఓ తంటా చెప్పకుంటే మరో తంటా అని ఆలోచిస్తుంది మీనా.
పూలు జల్లి బాలును నిద్రలేపుతుంది. దాంతో బాలు లేస్తాడు. నొప్పి ఎలా ఉందని మీనా అంటే.. అవును అస్సలు లేదు అని బాలు అంటాడు. చూశారుగా. భార్యలు తల్చుకుంటే ఏమైనా చేస్తారు. అందుకే భార్యలను గుర్తించండి అని మీనా అంటే.. ఇంకో భార్య వచ్చాక ఇద్దరు భార్యలను కలిపి గుర్తిస్తాను అని బాలు అంటాడు. తర్వాత బాలు స్నానం చేసి వచ్చేసరికి పూరి తీసుకొచ్చి ఇస్తుంది మీనా. మీరు తిని డ్యూటీకి వెళ్లండి. నేను పూలు తీసుకెళ్లి అమ్మకు ఇస్తాను అని మీనా అంటుంది.
దాంతో చేతులు పట్టేసినట్లు బాలు చేసేసరికి నేనే తినిపిస్తాను అని బాలుకు టిఫిన్ తినిపిస్తుంది మీనా. ముందు తలుపు వేయి రాత్రి తొక్కి తెల్లారి తినిపిస్తున్నావా అని అంటుందని బాలు అంటాడు. తర్వాత కారు ఎలా నడుపుతారు. ఇవాళ రెస్ట్ తీసుకోండి అని మీనా అంటే.. అదే అనుకుంటున్నా అని బాలు అంటాడు. ఈయన ఉంటే శ్రుతి దగ్గరికి ఎలా వెళ్లాలి అనుకున్న మీనా పడుకోండి వీపు తొక్కినట్లు చేతులు తొక్కుతాను అని మీనా అంటుంది.
తల్లిదండ్రులు అంటున్నాడు
నీకు అన్ని విద్యలు వచ్చని ఎలా పడితే తొక్కుతావా అని బాలు అంటాడు. తర్వాత చేతులు నార్మల్‌గా పెట్టేసరికి అంటే ఇప్పటిదాకా చేసింది నాటకమా అని మీనా అంటుంది. మరి అని బాలు వెళ్తాడు. మరోవైపు శ్రుతిని మీనా కలుస్తుంది. రవి మారిపోయాడు అని శ్రుతి చెబితే.. కొడుతున్నాడా, తిడుతున్నాడా అని మీనా అడుగుతుంది. లేదు. ప్రతిసారి ఇల్లు తల్లిదండ్రులు అంటున్నాడు అని శ్రుతి అంటుంది. నీతో పెళ్లి అయిందని అందరినీ వదిలేసుకోవాలా అని మీనా అంటుంది.
నీతో ఇదే చిక్కు. గారాబంగా పెరిగావ్. కుటుంబాన్ని వదులుకోవడం అంత సులువు కాదు అని మీనా అంటుంది. నేను కూడా వదిలేసివచ్చాను. కానీ, రవి నాలుగు రోజులు అయ్యాక తల్లిదండ్రులు అంటున్నాడు అని శ్రుతి అంటుంది. కొత్త బంధం దొరక్కానే పాత బంధాన్ని వదులకునేవాళ్లను నమ్మకూడదు. కొత్త బంధం ఏర్పడితే నిన్ను వదిలేస్తే ఎలా ఉంటుంది. రవిని సరిగ్గా అర్థం చేసుకోవడంలేదు. ఉమ్మడి కుటుంబం గురించి నీకు తెలియదు అని మీనా అంటుంది.
మీరు అక్కడ సంతోషంగా ఉంటున్నారా అని శ్రుతి అడుగుతుంది. మా ఆయన కోప్పడతారు. కానీ, చాలా మంచివారు. తప్పుంటే ఒప్పుకుంటారు. మా అత్తను నేను అర్థం చేసుకున్నాను. అందుకే సర్దుకుపోతున్నాను. మావయ్య గారు అయితే కన్నతండ్రిలా చూసుకుంటారు. రోహిణి కూడా బాగా చూసుకుంటుంది. అందరూ అందరికి నచ్చాలని లేదు. రవి కరెక్ట్‌గానే ఆలోచించాడు. నీలోనే స్వార్థం మొదలైంది. నీకు రవికి మధ్య దూరం పెంచే ఏ విషయాన్ని నువ్వు పెద్దది చేయకు. అలా చేస్తే నువ్వే రవికి దూరం అయిపోతావ్ అని మీనా లేస్తుంది.
సీసీ కెమెరాలు ఉన్నాయి
నీకు ఉమ్మడి కుటుంబం విలువ తెలియదు. ఏదో ఒక రోజు తెలుస్తుంది అని మీనా వెళ్లిపోతుంటే.. ఆగండి అని శ్రుతి ఆపుతుంది. మరోవైపు సంజు వచ్చి ఉంటాడు. రెస్టారెంట్‌లో సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయని, బయటకు వచ్చాక చూసుకుందామని అనుకుంటారు. శ్రుతి బయటకు రావడం చూసి కారులో నుంచి యాసిడ్ తీస్తాడు. ఏ లవర్ కోసం అయితే అది అలా చేసిందో వాడు దాన్ని చూసి అసహ్యించుకోవాలి అని సంజు అంటాడు.
శ్రుతి ఆపిన మీనా వెళ్లిపోతుంది. శ్రుతిని చూసి యాసిడ్ పోయడానికి సంజు వస్తుంటే అతని మనుషులు మాస్క్‌లు తీసుకొచ్చి పెట్టుకోమంటారు. అది నన్ను మోసం చేసింది. దానికి పగ తీర్చుకునేది ఎవరో తెలియాలి అని సంజు అంటాడు. చాలా మంది ఉన్నారు. వీడియో తీస్తే ఎంత దూరం పోతుందో తెలుసుకదా. నాన్నగారికి తెలిస్తే మమ్మల్ని అంటారు అని ముగ్గురు మాస్క్‌లు పెట్టుకుంటారు. శ్రుతి దగ్గరికి సంజు రావడంతో భయపడుతుంది.
వేరే జీవితాలతో ఆడుకునే నిన్ను ఇలా ఆనందంగా తిరగకూడదు. అందుకే నీకోసం ఈ గిఫ్ట్ అని యాసిడ్ తీయగానే శ్రుతి పారిపోయేందుకు చూస్తుంది. సంజు మనుషులు వచ్చి పట్టుకుంటారు. దయేచి వదిలేయండి అని శ్రుతి అంటుంది. నీలాంటి అమ్మాయిలకు ఇదే శిక్ష. అవతలి వాళ్లను మోసం సంతోషంగా బతకాలనుకునే నిన్ను మనశ్శాంతిగా బతకకూడదు అని సంజు యాసిడ్ పోసేందుకు ట్రై చేస్తుంటాడు.
మీనా ఇటుకలతో దాడి
శ్రుతి హెల్ప్ అని అరవడం విన్న మీనా పరుగెత్తుకు వస్తుంది. దారిలో ఇటుకలు ఉంటే దాంతో కొడుతుంది. దాంతో యాసిడ్ కిందపడిపోతుంది. రేయ్ ముందు దాన్ని పట్టుకోండిరా అని సంజు అనడంతో ఇటుకలతో వాళ్లను పదే పదే కొడుతుంది మీనా. ఇంతలో పక్కన ఉన్నవాళ్లు వచ్చి సంజును పిచ్చి కొట్టుడు కొడతారు. అంతా కలిసి కొట్టడంతో సంజు, అతని మనుషులు పారిపోతారు. శ్రుతి దగ్గరికి మీనా వచ్చి ఏం భయపడకు, ఏంకాలేదు కదా అని మీనా అంటుంది.
నేను రాకుంటే ఏమయ్యేది. ఒంటరిగా ఉంటే ఇలా కాపాడేవాళ్లు ఉండరు. ఉమ్మడిగా ఉంటే ఎవరు నిన్ను ఏం చేయలేరు అని మీనా అంటుంది. దాంతో మీనాను హగ్ చేసుకుంటుంది శ్రుతి. రవి దగ్గరికి శ్రుతిని తీసుకెళ్తుంది మీనా. జరిగింది తల్చుకుని షాక్‌లో ఉండిపోతుంది శ్రుతి. తర్వాత నీ మీద వాడికి అంత పగేంటీ అని మీనా అంటుంది. నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న వాడు అనుకుంటా. వాడి మాటలను బట్టి అర్థం అవుతుంది అని శ్రుతి అంటుంది.
ఇలాంటి వాళ్లను రాళ్లతో కొట్టడం కాదు జైలుకు పంపాలి. అదృష్టం కొద్ది ఆ సీసా కిందపడింది. తలుచుకుంటేనే భయం వేస్తుందని మీనా అంటుంది. దాంతో శ్రుతి ఏడుస్తుంది. ఏం కాదని మీనా ఓదార్చుతుంది. ఒకవేళ వాడే అయితే నన్ను విడిచిపెట్టడు. నామీద చాలా పగ పెట్టేసుకున్నాడు అని శ్రుతి అంటుంది. అదంతా పీడకలలా మర్చిపో. ఇప్పటికైనా నీకు అర్థమైంది అనుకుంటా. మనమంతా ఒకే కుటుంబంగా ఉండటంలో ఎంత ధైర్యంగా ఉంటుందో తెలియక మాట్లాడావ్ అని మీనా అంటుంది.
మావయ్య ఒప్పుకుంటే
తన ఇంట్లో జరిగే విషయాలు చెబుతుంది మీనా. ఏం జరిగినా అదే నా ఇల్లు. వాళ్లు నావాళ్లు అనుకున్నాను. మీరు వచ్చి ఉంటే ఆ ధైర్యమే వేరు. ఈరోజు వచ్చినవాడు మళ్లీ రాడని నమ్మకం ఏంటీ. గాయాలతో వెళ్లిన వాడు మరింత పగ పెంచుకుంటాడు. అదే మనింట్లో ఉంటే దాడి చేస్తాడా. మావయ్యతో నేను మాట్లాడతాను. ఆయన ఒప్పుకుంటే వస్తావా అని మీనా అడుగుతుంది. మరోవైపు మీనా ఎక్కడికి వెళ్లిందో అర్థం కావట్లేదని బాలు కంగారుపడతాడు.
ఇంతలో మీనా వస్తే చెప్పకుండా ఎక్కడికి వెళ్లావ్. ఎందుకు వెళ్లావ్ అని బాలు అంటాడు. మీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. నేను శ్రుతిని కలవడానికి వెళ్లాను అని మీనా చెబుతుంది. దాంతో ఎందుకు కలిశావ్. ఎవరు కలవమన్నారు అని ఫైర్ అవుతాడు బాలు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగుస్తుంది.
టాపిక్