Gunde Ninda Gudi Gantalu Today Episode: ఇల్లరికం అల్లుడిగా రవి- మీనా మాట కాదన్న సత్యం- అత్తకు సపోర్ట్ చేసిన పూలగంప-gunde ninda gudi gantalu serial december 10th episode sathyam declines meena prabhavathi plea about ravi star maa serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gunde Ninda Gudi Gantalu Today Episode: ఇల్లరికం అల్లుడిగా రవి- మీనా మాట కాదన్న సత్యం- అత్తకు సపోర్ట్ చేసిన పూలగంప

Gunde Ninda Gudi Gantalu Today Episode: ఇల్లరికం అల్లుడిగా రవి- మీనా మాట కాదన్న సత్యం- అత్తకు సపోర్ట్ చేసిన పూలగంప

Sanjiv Kumar HT Telugu
Dec 10, 2024 10:04 AM IST

Gunde Ninda Gudi Gantalu Serial December 10 Episode: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 10 ఎపిసోడ్‌లో రవి, శ్రుతి వెళ్లిన రెస్టారెంట్‌కే బాలు, మీనా వస్తారు. అక్కడ వారిని రవి పలకరిస్తే బాలు గొడవ పెట్టుకుంటాడు. బాలు రౌడీలా ప్రవర్తించాడని, ఆ ఇంటికి జీవితంలో రాను అని శ్రుతి చెబుతుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ డిసెంబర్ 10 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ డిసెంబర్ 10 ఎపిసోడ్‌

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో ఓ రెస్టారెంట్‌కు రవి, శ్రుతి వెళ్తారు. ఇంతలో అదే రెస్టారెంట్‌కు బాలు, మీనా వస్తారు. ఏంటీ తినడానికి తీసుకొచ్చారా అని మీనా అంటే.. లేదు నువ్ అంట్లు కడగడానికి, నేను టేబుల్స్ తుడవడానికి తీసుకొచ్చాను అని బాలు అంటాడు.

yearly horoscope entry point

రొమాంటిక్‌గా బాలు, మీనా

సరే మొదలుపెడదామా అని మీనా అంటుంది. ఇద్దరు వాదించుకుని టేబుల్‌పై కూర్చుంటారు. సినిమాల్లోలాగా ఇద్దరం ఒకే ప్లేట్‌లో ఒకరికొకరం తినిపించుకుంటూ, ఒకే కూల్ డ్రింక్‌లో రెండు స్ట్రాలు వేసుకుని తాగుదామా అని బాలు అంటాడు. దాంతో నవ్వుకున్న మీనా ఉన్నట్టుండి ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది ఏంటీ అని అంటుంది. ప్రేమ కాదు. ఇక్కడున్న రేట్లకు నా బడ్జెట్ సరిపోదు అని బాలు అంటాడు. ఉన్నదాంట్లోనే సర్దుకుందాం. చూసేవాళ్లకు ప్రేమికుల్లాగా కనిపిస్తాం మీనా అంటుంది.

ఒకే ప్లేట్‌లో బాలు, మీనా తినిపించుకుంటూ ఉంటారు. అంత స్పీడ్‌గా తింటున్నావేంటీ, నాకు ఉంచమని బాలు అంటే.. ప్లేట్ తిప్పుతుంది మీనా. అది నీ స్పూన్ అని బాలు అంటాడు. ఇంతలో రవి హ్యాండ్ వాష్‌కు అని చెప్పి బాలు వాళ్లను చూసి పలకరిస్తాడు. ఏరా నీకు సిగ్గు ఏం లేవా. ఎన్నిసార్లు ఛీ కొట్టిన దగ్గరికి వస్తావ్ అని బాలు అంటాడు. ఇంకా ఎన్నాళ్లు నీ కోపం. శ్రుతి కూడా వచ్చింది. పదా అందరం కలిసి భోజనం చేద్దామని బాలుపై చేయి వేస్తాడు రవి.

దాంతో కోప్పడిని బాలు చేయి తీయమని అంటాడు. రవి చేయి తీయకపోవడంతో గట్టిగా అరుస్తాడు. దాంతో శ్రుతి వస్తుంది. గొడవ పడకండి. అందరూ చూస్తున్నారు అని మీనా అంటుంది. ఎవరు చూస్తే నాకేంటీ అని బాలు అంటాడు. ఇద్దరం కలిసి రావడం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను అని రవి అంటాడు. దాంతో రవిని తోస్తాడు. మేనేజర్ వచ్చి ఏమైందని అడుగుతాడు. ఏం లేదు. మా అన్నయ్యే అని రవి అంటాడు. ఎవడ్రా నీకు అన్నయ్య అని బాలు అరుస్తాడు.

లేచిపోయి పెళ్లి చేసుకున్నావ్

ఎందుకు అరుస్తున్నారు అని శ్రుతి అంటుంది. ఆయన కోపంలో అర్థముంది శ్రుతి. కొంచెం ఓపిక పట్టమని చెబితే తొందరపడి పెళ్లి చేసుకున్నారు. మీ వల్ల ఈరోజుకు అందరితో నేను మాటలు పడుతున్నాను అని మీనా అంటుంది. ఇలా అవుతుంది అనుకోలేదు. ఇందులో మీనా తప్పు లేదు అని శ్రుతి అంటుంది. లేచిపోయి పెళ్లి చేసుకున్నావ్. నువ్వేంటీ చెప్పేది అని బాలు అంటాడు. నన్ను ఏమైనా అను నా భార్యను ఏమనకు అని రవి అంటాడు.

ఏరా రోషం పొడుచుకు వచ్చిందా. నాన్నకంటే ఆ పిల్ల ఎక్కువ అయిందా. ఆ సురేంద్ర గాడి కూతురే కదా తను. ఆ రక్తం ఎక్కడికి పోతుంది. బుద్ధులు ఎక్కడికి పోతాయ్. ఎలా చేసుకోవాలని అనిపించిందిరా అని బాలు అంటాడు. హే షటప్. పబ్లిక్‌లో ఎందుకు అరవడం అని శ్రుతి అంటుంది. శ్రుతిని ఏమనకు అని రవి అడ్డుపడుతే బాలు కొట్టబోతాడు. దాంతో శ్రుతి అడ్డుపడి ఎన్నిసార్లు కొడతారు. పోలీస్ స్టేషన్‌లో సరిపోనట్టు రెస్టారెంట్‌కు వచ్చి రక్తం కారేలా కొట్టారు అని శ్రుతి అంటుంది.

చూశావా ఎలా మాట్లాడుతుందో అని బాలు అంటే.. వారు మిమ్మల్ని ఏమనట్లేదు అండి. ఒకరినొకరు మాట పడట్లేదు. ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు. రవి శ్రుతిని తీసుకెళ్లు అని మీనా అంటుంది. నువ్ ఇంకా వాళ్లనే వెనకేసుకొస్తున్నావా అని బాలు అంటాడు. వదినపై ఎందుకు అరుస్తున్నావ్ అన్నయ్య. నాకు మీతో కలిసి ఉండాలని ఉందని రవి అంటాడు. ఇంకా ఇంటికి రావాలని ఉందా. ఇంటి గేట్ దగ్గరే నరికిపడేస్తాను. ఆ ఆలోచన వచ్చినా, నాతో మాట్లాడాలని ట్రై చేసిన చావగొడతాను అని మీనాకు డబ్బులిచ్చి బిల్ కట్టేసి రమ్మని వెళ్లిపోతాడు బాలు.

క్లాస్ పీకిన మీనా

తర్వాత కూడా మీనా వెళ్తుంది. మా అన్నయ్య అంతేలే అని రవి అంటే.. ఏంటీ అంతే. ఏదైనా చెప్పనిస్తున్నాడా. బజారు రౌడీలా బిహేవ్ చేస్తున్నాడు. ఇలాంటి రౌడీ ఉన్న మీ ఇంటికి రమ్మంటున్నావా. జీవితంలో మీ ఇంటికి రాను అని శ్రుతి అంటుంది. తర్వాత కారులో వెళ్తుంటారు మీనా, బాలు. ఇంకా కోపం చల్లారలేదు. ఇంకా కొట్టాల్సింది అని బాలు అంటాడు. ఇంకా ఎన్నిసార్లు కొడతారు. తమ్ముడి కాబట్టి భరిస్తున్నాడు. మీరు అన్న విషయం మర్చిపోలేదు. ఇలా కొడితే రౌడియిజం అంటారు అని మీనా అంటుంది.

కోపాన్ని కంట్రోల్ చేసుకునేవాడిని మొనగాడు అంటారు. ఇలా కొడితే కాదు. భర్తను అంటే ఏ భార్య పడుతుంది. తమ్ముడి భార్యపై ఏ అన్న కూడా అరవకూడదు. అది మీరు చేశారు. చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు అంతే కానీ, అది ఘోరం, నేరం కాదు అని మీనా అంటుంది. రవిగాడు ఎంత మారిపోయాడు. వాడి భార్యను ఒక్క మాట అననివ్వడం లేదు అని బాలు అంటాడు. పదిమందిలో తన భార్యను ఎలా చూసుకోవాలో రవికి తెలుసు. అందరూ పూలగంపలా భరించరు. నేను భరిస్తున్నాను. ఇంకొకరి భార్య మీ కోపాన్ని ఎందుకు భరించాలి అని మీనా అంటుంది.

నేను నీకు సారీ చెప్పకుండా ఉండాల్సింది అందుకే అలుసు అయిపోయాను అని బాలు అంటాడు. అన్ని అని నీ ఫ్రెండ్‌చేత చెప్పించారు. పెద్ద సారీ చెప్పినట్లు బిల్డప్పులు అని మీనా అంటుంది. మరోవైపు ప్రభావతి దగ్గరికి కామాక్షి వస్తుంది. రవిని ఇంటికి తీసుకురావడం ఎలా అని ప్లాన్ చేస్తుంటారు. బాలుగాడు అన్నయ్య మాటే వింటాడు. ముందు అన్నయ్యను ఒప్పించాలి. నేను ఒప్పిస్తాను అని కామాక్షి అంటుంటే.. సత్యం వస్తాడు.

బ్రెయిన్ వాష్ చేస్తున్నారా

నేను ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. మన రవి గురించే. వాడు తొందరపడి పెళ్లి చేసుకున్నాడు. వాడు గుణం, కులం తక్కువ అమ్మాయని పెళ్లి చేసుకోలేదు. ఆస్తి ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. మీరైనా క్షమించి రమ్మనవచ్చు అని కామాక్షి అంటుంది. నేను ఎప్పుడో క్షమించాను అని ప్రభావతి అంటుంది. అది సరిపోదు. వాడికి నాపై గౌరవం ఎక్కడ ఉందని సత్యం అంటే.. రవి చేసినవి చెబుతుంది ప్రభావతి. ముగ్గురు కోడళ్లు ఇంట్లో ఉంటేనే కదా మనకు మంచిపేరు వచ్చేది అని ప్రభావతి అంటుంది.

మీరు అందరిని క్షమిస్తారు. ఈ ఒక్క విషయంలో ఎందుకు అన్నయ్య ఇంత కఠినంగా ఉన్నారు అని కామాక్షి అంటుంది. మీరు నా మాట వినాల్సిందే. రవిని ఇంటికి తీసుకురావాల్సిందే. బండ సన్నాసి బాలు మాట విని రానివ్వట్లేదు మీరు అని ప్రభావతి అంటుంటే బాలు వచ్చి మాటలు వింటాడు. బాలు వచ్చినట్లు కామాక్షి సైగ చేసి చెబుతుంది. దాంతో ప్రభావతి ఆగిపోతుంది. ఇద్దరు చేరి మా నాన్నకు బ్రెయిన్ వాష్ చేస్తున్నారా అని బాలు అంటాడు.

ఇద్దరం కాదు మీ అమ్మ ఒక్కతే అని కామాక్షి అంటుంది. వాడిని ఇలా వదిలేస్తే వాడి మామ వచ్చి తీసుకెళ్తాడు. రవిగాడు ఇల్లరికం పోతాడు అని ప్రభావతి అంటుంది. వాడు ఇల్లరికం పోతే ఏంటీ. అసలు వాడు పుట్టలేదనే అనుకో అని బాలు అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. నేను వాడిని తొమ్మిది నెలలు మోసాను అని ప్రభావతి అంటాడు. నాన్న ఏం చేయలేదా. వాడిని ఇన్నేళ్లు చూసుకున్నాడు. ఆయన్నే మోసం చేశాడు వాడు అని బాలు అంటాడు.

మీనాకు ప్రభావతి సపోర్ట్

మీ నాన్న కష్టపడి పెంచిన రవిగాడిని వాళ్ల మామ తీసుకెళ్తే అడగటానికి ఉండదు అని కామాక్షి అంటుంది. దాంతో రెస్టారెంట్‌లో జరిగింది చెప్పిన బాలు రవిగాడి భార్య చాలా పొగరుగా ఉంది. సురేంద్ర గాడి ముక్కులోనుంచి ఊడిపడింది. వాడిని ఇంటకి రానిచ్చే పరిస్థితి లేదు. నాకే గౌరవం ఇవ్వలేదు. నాన్నకు ఏం ఇస్తుంది అని బాలు అంటాడు. దాంతో మీనా మాట్లాడనా అని అంటే.. నువ్ చేసింది చాలు. మాట్లాడకు అని ప్రభావతి అంటుంది.

నిన్ను మాట్లాడనిచ్చాను. మీనా ఎందుకు మాట్లాడొద్దు అని అంటాడు సత్యం. దాంతో వాళ్లు అనుకోకుండా పెళ్లి చేసుకున్నారు. రవికి వేరుగా ఉండటం ఇష్టంలేదు. మనతో కలిసి ఉండాలని అనుకుంటున్నాడు. మీరు ఒప్పుకుంటే వెంటనే వస్తాడు అని మీనా అంటుంది. దాంతో ఏయ్ అని బాలు అరిస్తే.. హే ఆపురా. నీ పెళ్లాం కరెక్ట్‌గానే మాట్లాడుతుంది కదా అని ప్రభావతి సపోర్ట్ చేస్తుంది. హో హో ఇందాక నువ్వు వెలగబెట్టింది చాలు అన్నది ఎవరో. నీకు సపోర్ట్ చేయగానే ఆపాలా అని బాలు అంటాడు.

నాన్న రవి రావొద్దు నాన్నా అని బాలు అంటాడు. ఒప్పుకోండి అని కామాక్షి, ప్రభావతి అంటుంది. మీనా నీది మంచి మనసు నాకు తెలుసు. కానీ, రవిని క్షమించేంత పెద్ద మనసు నాకు లేదు అని సత్యం వెళ్లిపోతాడు. విన్నారుగా. మా నాన్న నిర్ణయమే ఫైనల్. మా నాన్న మెత్తబడి రానిచ్చిన నేను వెంటబడి మరి తరిమికొడతాను అని బాలు అంటాడు. దీంతో ప్లాన్ ఫెయిల్ అయినట్లుగా చిరాకు మొహం పెడుతుంది ప్రభావతి.

మీనాకు శ్రుతి కంప్లైంట్

మరోవైపు బాలు, మీనా అన్నమాటలు తలుచుకుంటాడు రవి. అది మీనా చూసి అడుగుతుంది. మా అన్నయ్య జీవితంలో ఇంటికి రానిచ్చేలా లేడు అని రవి అంటాడు. ఇంకా ఆ ఇంటికి వెళ్లాలని అనుకుంటున్నావా. ఆ ఇంట్లో ఎలా ఉంటావ్. అసలు మనిషిలా ప్రవర్తించాడా అని శ్రుతి అంటుంది. కట్ చేస్తే మీనాను కలిసిన శ్రుతి రవి మారిపోయాడు అని చెబుతుంది. నిన్ను పెళ్లి చేసుకున్నాడని అందరిని వదిలేసుకోవాలా అని మీనా అంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner